స్వేచ్ఛ షార్ట్స్ — తాజా తెలుగు వార్తలు

ఎన్వీఎస్-03 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం: నావిక్ వ్యవస్థ బలోపేతానికి ఇస్రో మరో కీలక అడుగు!NationalSwechaa30 OCT

ఎన్వీఎస్-03 ప్రయోగానికి కౌంట్‌డౌన్ ప్రారంభం: నావిక్ వ్యవస్థ బలోపేతానికి ఇస్రో మరో కీలక అడుగు!

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) దేశీయ నావిగేషన్ వ్యవస్థ 'నావిక్' (NavIC) సేవలను మరింత బలోపేతం చేసేందుకు మరొక ప్రతిష్టాత్మక ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) నుంచి జీఎస్ఎల్‌వీ-ఎఫ్18 (GSLV-F18) రాకెట్ ద్వారా 'ఎన్వీఎస్-03' (NVS-03) ఉపగ్రహాన్ని అంతరిక్షంలోకి పంపేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. శుక్రవారం రాత్రి 11:51 గంటలకు జరగనున్న ఈ ప్రయోగానికి సంబంధించి గురువారం రాత్రే అధికారిక కౌంట్‌డౌన్ ప్రారంభమైంది.

'రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు నిద్రపోను': పాదయాత్రలో  ఈటల సంచలన వ్యాఖ్యలు!తెలంగాణSwechaa30 OCT

'రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు నిద్రపోను': పాదయాత్రలో ఈటల సంచలన వ్యాఖ్యలు!

జవహర్ నగర్ డంప్ యార్డ్ సమస్యల పరిష్కారం కోరుతూ మల్కాజిగిరి బీజేపీ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర తీవ్ర రాజకీయ వేడిని రాజేసింది. పాదయాత్ర సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. డంప్ యార్డు తొలగింపు కోసం తాను పాదయాత్ర చేస్తుంటే, కాంగ్రెస్ నాయకులు 'ఈటలకు పనిలేక తిరుగుతున్నాడంటూ' బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం ఈ డంప్ యార్డ్ సమస్య పరిష్కరించడమే కాకుండా, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే వరకు తాను వీధుల్లోనే తిరుగుతూ పోరాటం చేస్తానని బహిరంగంగా సవాల్ విసిరారు.

రూ.47 లక్షల కోట్లు ఆవిరి! గూగుల్ సామ్రాజ్యానికి ఏఐ సెగ.. సెర్చ్ ఇంజిన్ కథ ముగిసినట్టేనా?వ్యాపారంSwechaa30 OCT

రూ.47 లక్షల కోట్లు ఆవిరి! గూగుల్ సామ్రాజ్యానికి ఏఐ సెగ.. సెర్చ్ ఇంజిన్ కథ ముగిసినట్టేనా?

ఒకప్పుడు ఇంటర్నెట్ అంటే గూగుల్. ఏ సమాచారం కావాలన్నా గూగుల్‌లో వెతకాల్సిందే. కానీ ఇప్పుడు సీన్ మారుతోంది. గూగుల్‌కు పోటీగా ఏఐ టూల్స్ దూసుకొస్తున్నాయి. ప్రశ్న అడిగితే నేరుగా సమాధానాలే ఇచ్చే టెక్నాలజీ వచ్చేసింది. ఈ మార్పు ఇప్పుడు గూగుల్ పునాదులనే కదిలిస్తోందా? అన్న అనుమానాలు మొదలయ్యాయి.

Today in History October 30: చరిత్రలో ఈ రోజు (30 అక్టోబర్)InternationalSwechaa30 OCT

Today in History October 30: చరిత్రలో ఈ రోజు (30 అక్టోబర్)

📌 నేటి ముఖ్యాంశాలు (Today's Highlights)

  • 1928: లాహోర్‌లో సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా జరిగిన నిరసనల్లో లాలా లజపత్ రాయ్ తీవ్రంగా గాయపడ్డారు.

  • 1961: సోవియట్ యూనియన్ ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన 'త్సార్ బొంబా' (Tsar Bomba) హైడ్రోజన్ బాంబును పరీక్షించింది.

  • 1909: ప్రముఖ అణు శాస్త్రవేత్త, భారత అణు విజ్ఞాన పితామహుడు హోమీ జహంగీర్ భాభా జననం.

🌐 అంతర్జాతీయ సంఘటనలు

  • 1938: ఆర్సన్ వెల్లెస్ రేడియో నాటకం 'ది వార్ ఆఫ్ ది వరల్డ్స్' (The War of the Worlds) ప్రసారమైంది — అంగారక గ్రహవాసులు భూమిపై దాడి చేశారనే నాటకీయ కథనంతో అమెరికాలో తీవ్ర కలకలం రేగింది.

  • 1961: ఆర్కిటిక్ మహాసముద్రంలో సోవియట్ యూనియన్ 50 మెగాటన్నుల సామర్థ్యం గల 'త్సార్ బొంబా'ను విజయవంతంగా పరీక్షించింది.

🚀 సైన్స్ & అడ్వెంచర్

  • 1909: భారత అణుశక్తి రంగానికి పునాది వేసిన హోమీ జహంగీర్ భాభా బొంబాయిలో జన్మించారు.

👤 ప్రముఖుల జననాలు

  • 1909: హోమీ జహంగీర్ భాభా — ప్రముఖ భారతీయ అణు భౌతిక శాస్త్రవేత్త, Bhabha Atomic Research Centre (BARC) వ్యవస్థాపకుడు.

  • 1960: డియెగో మారడోనా (Diego Maradona) — ప్రపంచ ప్రసిద్ధ అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం జననం.

  • 1932: బరాక్‌పూర్ సంజీవరావు లేదా ఇతర ప్రముఖ భారతీయ సామాజిక వేత్తలు.

నేటి పంచాంగం - 30 అక్టోబర్ 2026 | కార్తిక కృష్ణ పంచమిSpiritualitySwechaa30 OCT

నేటి పంచాంగం - 30 అక్టోబర్ 2026 | కార్తిక కృష్ణ పంచమి

వివరాలు:

  • తేదీ: 30 అక్టోబరు 2026, శుక్రవారం

  • సంవత్సరం: శ్రీ పరాభవ నామ సంవత్సరం

  • అయనం & ఋతువు: దక్షిణాయనం, శరత్ఋతువు

  • మాసం & పక్షం: కార్తిక మాసం, కృష్ణ పక్షం

  • తిథి: పంచమి (రాత్రి 08:35 వరకు, తదుపరి షష్ఠి)

  • వారం: శుక్రవారం (భార్గవవాసరే)

  • నక్షత్రం: ఆర్ద్ర (మధ్యాహ్నం 11:48 వరకు, తదుపరి పునర్వసు)

  • యోగం: శివ (సాయంత్రం 05:12 వరకు, తదుపరి సిద్ధ)

  • కరణం: తైతుల (ఉదయం 09:32 వరకు), తదుపరి గరజ (రాత్రి 08:35 వరకు)

శుభ / అశుభ సమయాలు:

  • రాహుకాలం: ఉదయం 10:30 - 12:00 వరకు

  • యమగండం: మధ్యాహ్నం 03:00 - 04:30 వరకు

  • అమృతకాలం: రాత్రి 02:15 - 03:52 వరకు (అనగా అక్టోబర్ 31 తెల్లవారుజామున)

  • దుర్ముహూర్తము: ఉదయం 08:32 - 09:18 వరకు మరియు మధ్యాహ్నం 12:22 - 01:08 వరకు

  • వర్జ్యం: మధ్యాహ్నం 03:40 - 05:22 వరకు

గ్రహస్థితులు:

  • సూర్యరాశి: తుల

  • చంద్రరాశి: మిథునం

  • సూర్యోదయం: ఉదయం 06:18

  • సూర్యాస్తమయం: సాయంత్రం 05:41

స్వేచ్ఛ న్యూస్  ఎఫెక్ట్.. తాండూర్ ఎమ్మెల్యే కుటుంబంపై విజిలెన్స్ గురిస్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్Swechaa30 OCT

స్వేచ్ఛ న్యూస్ ఎఫెక్ట్.. తాండూర్ ఎమ్మెల్యే కుటుంబంపై విజిలెన్స్ గురి

సత్యాలే వార్తలుగా స్వేచ్ఛ న్యూస్ పరిశోధనాత్మక కథనాలను ప్రచురిస్తోంది. అందరి కంటే ముందే నిజాలను పసిగట్టి ప్రభుత్వాన్ని, ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తోంది. అధికార అహంకారంతో పాటు, కండ బలం, ధన బలంతో ఏమైనా చేయొచ్చు అనుకునే వారి వ్యవహారం బట్టలు ఊడదీసే విధంగా ఫాలో అప్ స్టోరీలు ఇస్తోంది. అదేవిధంగా తాండూర్ ఎమ్మెల్యే బీ మనోహార్ రెడ్డి కుటుంబం భూ కబ్జాపై మొదటి నుంచి స్వేచ్ఛ న్యూస్ ప్రజల ముందు ఉంచింది. దీంతో అధికారులు అప్రమత్తం అవ్వడమే కాకుండా విజిలెన్స్ నివేదకకు రెవెన్యూ అధికారులను విచారించారు. పీటీ యాక్ట్ ఫవర్ ఫుల్ కావడంతో ఎమ్మెల్యే అధికార బలంతో అమ్మకం జరిపితే కొనుగోలు చేసిన ప్లాట్ ఓనర్స్ ఎలా మోసపోతారనేది కూడా కీలక విషయం కానుంది.

ఓట్‌ బచావో వర్సెస్‌ బిజినెస్‌ బచావో! రాహుల్‌ ర్యాలీతో ఢిల్లీలో రచ్చ!NationalSwechaa29 OCT

ఓట్‌ బచావో వర్సెస్‌ బిజినెస్‌ బచావో! రాహుల్‌ ర్యాలీతో ఢిల్లీలో రచ్చ!

ఎన్నికల వ్యవస్థపై సందేహాలుంటే సమాధానం అడగాలి. అందుకోసం వీధుల్లోకి రావాల్సి వచ్చినా వెనకడుగు వేయకూడదన్నది కాంగ్రెస్‌ వాదన. అయితే పండుగ వేళ తమ వ్యాపారాలు దెబ్బతింటే ఎలా? రోజువారీ ఆదాయంపైనే ఆధారపడే వేలాది మంది పరిస్థితి ఏంటన్నది ఢిల్లీ వ్యాపారుల ప్రశ్న.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీలకు షాక్..! తెలంగాణలో కాంగ్రెస్‌కు సవాల్ తప్పదా..?తెలంగాణSwechaa29 OCT

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీలకు షాక్..! తెలంగాణలో కాంగ్రెస్‌కు సవాల్ తప్పదా..?

దేశవ్యాప్తంగా నాలుగు రాష్ట్రాల్లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. అధికారంలో ఉన్న పార్టీలు అన్ని చోట్లా ఇబ్బంది పడ్డాయి. మరి తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితేంటి..?

Heros: లుక్ టెస్ట్..మేకోవర్ కోసం కోట్లు ఖర్చు చేస్తున్న మేకర్స్..సినిమాSwechaa29 OCT

Heros: లుక్ టెస్ట్..మేకోవర్ కోసం కోట్లు ఖర్చు చేస్తున్న మేకర్స్..

Heros: ప్రతీ సినిమాకి హీరోల మేకోవర్ అనేది తప్పనిసరిగా మారింది. ఇది, ఇప్పుడు కాదు బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. కథ, అందులో హీరో పాత్రకి తగ్గట్టుగా వేశాధారణ ఉండాలనేదే ముఖ్యం. అందుకే, ప్రతీ సినిమా కథ విన్న తర్వాత హీరోలు..ఇతర పాత్రల్లో నటించే కీలక నటులకి లుక్ టెస్ట్ అనేది తప్పనిసరి. ముఖ్యంగా, హీరోలను సినిమా సినిమాకి ఎంతో ప్రత్యేకంగా చూపిస్తున్నారు.

Heroines: పెళ్లి తర్వాత కూడా హీరోయిన్స్‌గానే!సినిమాSwechaa29 OCT

Heroines: పెళ్లి తర్వాత కూడా హీరోయిన్స్‌గానే!

Heroines: మన స్టార్ హీరోయిన్స్ చాలామంది పెళ్ళికి ముందే సినిమాలను చేస్తూ వస్తున్నారు తప్ప పెళ్లి తర్వాత దాదాపుగా సినిమాలకి దూరమైన వాళ్ళే ఉన్నారు. రోజా, మీనా, రంభ లాంటి వాళ్ళు మళ్ళీ సినిమాల వైపు రాలేదు. అంతకముందున్న వాళ్ళలో కూడా చాలామంది పెళ్లి తర్వాత పూర్తిగానే సినిమాలను వదిలేశారు. కానీ, జనరేషన్ మారింది. ఇప్పటితరం వాళ్ళు మాత్రం పెళ్లి తర్వాత కూడా సినిమాలను చేస్తూ ఉన్నారు.

UP: తవ్వేకొద్దీ బయటపడ్డ నోట్ల కట్టలు.. 3 బ్లూ డ్రమ్ముల్లో కోట్ల డబ్బువైరల్ న్యూస్Swechaa29 OCT

UP: తవ్వేకొద్దీ బయటపడ్డ నోట్ల కట్టలు.. 3 బ్లూ డ్రమ్ముల్లో కోట్ల డబ్బు

UP: సినిమాల్లో గుప్తనిధుల కోసం నేల తవ్వితే బంగారు నాణేలు బయటపడటం చూసుంటాం. కానీ ఇక్కడ తవ్వుతున్న కొద్దీ కట్టల కొద్దీ ఐదొందల నోట్లు బయటపడ్డాయి. అది కూడా ఎక్కడో అడవుల్లో కాదు.. ఓ పల్లెటూరి పెంకుటింట్లో. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ సమీపంలో వెలుగుచూసిన ఈ ‘3 బ్లూ డ్రమ్ముల’ కథ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. భూమిలో దాదాపు 15 అడుగుల లోతున గొయ్యి తీసి.. మూడు పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కోట్ల రూపాయల క్యాష్ దాచిపెట్టిన తీరు చూసి పోలీసులే అవాక్కయ్యారు.ప్రయాగ్‌రాజ్ గంగానగర్ జోన్ పరిధిలోని రామ్‌నగర్ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. ఊళ్లో వాళ్లతో చిన్న గొడవ జరగడంతో, ఈ సోదరుల ఇంట్లో ఏదో పెద్ద తతంగమే నడుస్తోందని పోలీసులకు ఉప్పందింది.

మీ పెట్టుబడులను డబుల్ చేసే బాధ్యత నాది- సీఎం రేవంత్తెలంగాణSwechaa29 OCT

మీ పెట్టుబడులను డబుల్ చేసే బాధ్యత నాది- సీఎం రేవంత్

Cm Revanth: హైదరాబాద్ నగరం గ్లోబల్ సిటీ అని, పెట్టుబడులకు సరైన నగరం అని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో పెట్టుబడులు పెట్టాలని పారిశ్రామికవేత్తలకు ఆయన పిలుపునిచ్చారు. మీకు కావాల్సిన సదుపాయాలు, మౌలిక వసతులు మేము కల్పిస్తామన్నారు. మీ పెట్టుబడులను డబుల్ చేసే బాధ్యత నాది అని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. ఢిల్లీలో ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ 2026 కర్టెన్ రైజర్ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు. ఈ కర్టెన్ రైజర్ కార్యక్రమానికి కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు వివిధ దేశాల రాయబార కార్యాలయాల ప్రతినిధులు, సీఐఐ ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల ప్రతినిధులు పాల్గొన్నారు.

TG: ఆ పని చేయకపోతే పాలిటిక్స్ వదిలేస్తా.. సీఎంకు ఈటల రాజేందర్ ఓపెన్ ఛాలెంజ్!తెలంగాణSwechaa29 OCT

TG: ఆ పని చేయకపోతే పాలిటిక్స్ వదిలేస్తా.. సీఎంకు ఈటల రాజేందర్ ఓపెన్ ఛాలెంజ్!

TG: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విసిరిన సవాల్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. హైదరాబాద్ ప్రజలను ఏళ్ల తరబడి వేధిస్తున్న జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అంతేకాదు, తాను చెప్పినట్లు చేయకపోతే ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటానంటూ ఈటల చేసిన శపథం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.హైదరాబాద్ శివార్లలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారని, దీనిని శాశ్వతంగా అక్కడి నుంచి తరలించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈటల అన్నారు.

అభిమానం పేరుతో టార్చర్.. ఫ్లైట్ లో కీర్తి సురేష్ కు చేదు అనుభవం....సినిమాSwechaa29 OCT

అభిమానం పేరుతో టార్చర్.. ఫ్లైట్ లో కీర్తి సురేష్ కు చేదు అనుభవం....

Keerthy Suresh: హీరోయిన్లు బయట కనిపిస్తే చాలు.. ఫొటోలు, సెల్ఫీల కోసం ఫ్యాన్స్ వెంటపడటం మామూలే. కానీ కొందరు మాత్రం అభిమానం పేరుతో శృతిమించి ప్రవర్తిస్తూ నరకం చూపిస్తుంటారు. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌కు విమానంలో సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి సెల్ఫీ కావాలంటూ ఆమెను విపరీతంగా వేధించాడు. ఈ విషయాన్ని స్వయంగా కీర్తి బయటపెట్టడంతో ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది.కీర్తి సురేశ్ తన భర్త ఆంటోనితో కలిసి మిలాన్ నుంచి ఇండియాకు ఫ్లైట్‌లో వస్తుండగా ఈ ఘటన జరిగింది. బాగా తాగి తూలుతున్న ఓ ప్రయాణికుడు కీర్తి కూర్చున్న సీటు దగ్గరకు వచ్చాడు. కాళ్లపై నిలబడే సత్తువ కూడా లేకపోయినా.. కీర్తితో ఇప్పుడే సెల్ఫీ దిగాలంటూ మొండిపట్టు పట్టాడు. పరిస్థితి అర్థం చేసుకున్న కీర్తి.. కాసేపు ఆగి తర్వాత తీసుకుందామని చాలా కూల్‌గా చెప్పినా అతగాడు వినిపించుకోలేదు.

AP Farmers: ఏపీపై విరుచుకుపడ్డ 'అర్నబ్'.. రైతన్నకు మరింత కష్టకాలంఏపీSwechaa29 OCT

AP Farmers: ఏపీపై విరుచుకుపడ్డ 'అర్నబ్'.. రైతన్నకు మరింత కష్టకాలం

AP Farmers: ఆరుగాలం కష్టపడి పండించిన పంట.. సరిగ్గా చేతికొచ్చే టైంకి తీరని విషాదాన్ని మిగిల్చింది. బంగాళాఖాతంలో పుట్టిన తీవ్ర తుఫాను 'అర్నబ్' ఏపీ కోస్తా జిల్లాలపై విలయతాండవం చేసింది. గంటకు 125 నుంచి 135 కిలోమీటర్ల భీకర వేగంతో యానం–అమలాపురం మధ్య తీరం దాటిన ఈ పెను తుఫాను ధాటికి అన్నదాతల బతుకులు అల్లకల్లోలమయ్యాయి. కుండపోత వర్షాలు, ఈదురుగాలుల బీభత్సానికి ఏడు జిల్లాలు అతలాకుతలమవగా, రాష్ట్రవ్యాప్తంగా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణనష్టంతో పాటు ఊహించని స్థాయిలో జరిగిన ఆస్తి, పంట నష్టం రైతాంగాన్ని కోలుకోలేని స్థితిలోకి నెట్టేసింది.'అర్నబ్' తుఫాను మిగిల్చిన అత్యంత తీవ్రమైన దెబ్బ వ్యవసాయ రంగానికే తగిలింది. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 70 వేల హెక్టార్లలో వ్యవసాయ పంటలు, మరో 10,500 హెక్టార్లలో ఉద్యాన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి.

చిత్రం లేదు
తెలంగాణSwechaa29 OCT

TG: ఎవ్వరినీ వదిలిపెట్టను.. వాళ్లంతా నాకు క్షమాపణ చెప్పాల్సిందే: కేటీఆర్

TG: తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపిన వ్యక్తిగత ఆరోపణల వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూకుడు పెంచారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రి కొండా సురేఖ కోర్టు మెట్లు దిగి క్షమాపణలు చెప్పడంపై ఆయన ఘాటుగా స్పందించారు. తనపై తప్పుడు ప్రచారాలు చేసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని, లేదంటే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు."మొన్న ప్రముఖ పత్రిక ఈనాడు బేషరతుగా క్షమాపణ చెప్పింది.. ఈరోజు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. రేపు నాపై బురదజల్లిన ఇంకొందరు కూడా క్యూ కట్టి సారీ చెప్పక తప్పదు" అంటూ కేటీఆర్ గట్టి ధీమా వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమో లేదా తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనో అసత్యాలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

మియాపూర్‌లో 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదే- సుప్రీంకోర్టుతెలంగాణSwechaa29 OCT

మియాపూర్‌లో 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదే- సుప్రీంకోర్టు

Miyapur Lands: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని సర్వే నెంబర్లు 100, 101 లకు చెందిన భూవివాదంపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. ఈ రెండు సర్వే నెంబర్లలోని 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కాగా, కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఈ భూమి తమదేనంటూ గతంలో ఆక్రమించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ భూమి ప్రభుత్వానికే చెందుతుందని 2003లో తీర్పు ఇచ్చింది.

Karnataka Congress: డీకేకు ఆదిలోనే ఘోర ఓటమి.. కష్టకాలం మొదలయిందా?NationalSwechaa29 OCT

Karnataka Congress: డీకేకు ఆదిలోనే ఘోర ఓటమి.. కష్టకాలం మొదలయిందా?

Karnataka Congress: మొన్నటివరకు "జ్ఞానేష్.. ఇట్స్ డన్ బ్రో" అంటూ బీజేపీపై విపక్షాలు సెటైర్లు వేస్తే, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు బీజేపీ-జేడీఎస్ కూటమి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. శాసన మండలిలో ఖాళీ అయిన నాలుగు టీచర్స్, గ్రాడ్యుయేట్స్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. నాలుగుకి నాలుగు సీట్లను ఎన్డీయే కూటమి గెలుచుకుని 4-0తో క్లీన్ స్వీప్ చేసింది. రిజల్ట్స్ రాగానే బీజేపీ నేతలు సీఎం డీకే శివకుమార్‌ను టార్గెట్ చేస్తూ.. "డీకే.. మీ పని అయిపోయింది బ్రో" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఒక రేంజ్‌లో ఆడుకుంటున్నారు.గతంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో నిరసన తెలుపుతూ డీకే శివకుమార్ చెవిలో బంతిపూలు పెట్టుకున్న పాత ఫొటోను బీజేపీ బయటకు తీసింది. మండలి ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ నేతల చెవుల్లోనే పూలు పెట్టారంటూ ఎక్స్‌లో దారుణంగా ట్రోల్ చేసింది. ఈ నాలుగు స్థానాల్లో.. గతంలో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సిట్టింగ్ సీటును ఈసారి జేడీఎస్ ఎగరేసుకుపోయింది. ఇక మిగిలిన మూడు స్థానాల్లోనూ బీజేపీ తమ సిట్టింగ్ సీట్లను సులభంగా కాపాడుకుని సత్తా చాటింది.

Telangana: కొండా సురేఖ క్షమాపణ వెనుక రాజకీయ వ్యూహం ఉందా? కేటీఆర్ క్షమించినట్లేనా?..రాజకీయాలుSwechaa29 OCT

Telangana: కొండా సురేఖ క్షమాపణ వెనుక రాజకీయ వ్యూహం ఉందా? కేటీఆర్ క్షమించినట్లేనా?..

తెలంగాణ రాజకీయంలో గత కొంతకాలంగా తీవ్ర దుమారం రేపిన వ్యక్తిగత విమర్శల వ్యవహారంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, కేటీఆర్‌పై గతంలో తాను చేసిన వ్యక్తిగత దూషణలు, నిరాధార ఆరోపణల పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మాజీ మంత్రి కొండా సురేఖ బహిరంగంగా క్షమాపణలు తెలిపారు. కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులను ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించడంతో రాజకీయ వర్గాల్లో ఈ అంశం ప్రాధాన్యత సంతరించుకుంది.

KTR: ఏపీలో కరువు లేదు.. తెలంగాణలో కరువుకి రేవంత్ రెడ్డే కారణంతెలంగాణSwechaa29 OCT

KTR: ఏపీలో కరువు లేదు.. తెలంగాణలో కరువుకి రేవంత్ రెడ్డే కారణం

KTR: తెలంగాణలో కరువు పరిస్థితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కారణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తున్నట్లుగా రేవంత్ తీరు ఉందని ఆయన ధ్వజమెత్తారు. మేము ఎంత చెప్పినా వినకుండా వెయ్యి టీఎంసీల నీళ్లు దిగువకు వదిలారని రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడానికి నాలుగు నెలల కిందట మొత్తం బీఆర్ఎస్ నాయకులం కన్నెపల్లికి పోయామని కేటీఆర్ గుర్తు చేశారు.

Super ElNino: ఎల్‌నినో ఊచకోత.. భారత్‌లో సమ్మర్‌ వరకు 55వేల మరణాలు?NationalSwechaa29 OCT

Super ElNino: ఎల్‌నినో ఊచకోత.. భారత్‌లో సమ్మర్‌ వరకు 55వేల మరణాలు?

Super ElNino: వాతావరణం మారిపోతుండటం ఇప్పుడు జనాలకు పెద్ద తలనొప్పిగా మారింది. అసలే ఎండకాలం వస్తే ఆ వేడిని తట్టుకోవడం కష్టమైపోతుంది. అలాంటిది ఈసారి రాబోతున్న ‘సూపర్ ఎల్‌నినో’తో ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది ప్రాణాలు పోయే ప్రమాదం ఉందన్న వార్త జనాల్లో భయాన్ని రేపుతోంది. ముఖ్యంగా మన దేశంలో అక్టోబర్ నుంచి వచ్చే మార్చి లోపే ఎండల దెబ్బకు, వడగాలులకు ఏకంగా 55 వేల మంది చనిపోయే ఛాన్స్ ఉందని తాజా నివేదికలు చెబుతున్నాయి. వచ్చే ఆరు నెలల్లో ప్రపంచవ్యాప్తంగా సాధారణంగా చనిపోయే వాళ్ల కంటే అదనంగా దాదాపు 3.73 లక్షల మంది కేవలం ఈ ఎల్‌నినో ఎండల వల్లే చనిపోవచ్చని నిపుణులు లెక్కగట్టారు.

ఏటా రూ.50లక్షలు లంచం..! నిమ్స్‌లో మరోసారి ఏసీబీ తనిఖీల కలకలంతెలంగాణSwechaa29 OCT

ఏటా రూ.50లక్షలు లంచం..! నిమ్స్‌లో మరోసారి ఏసీబీ తనిఖీల కలకలం

ACB Raids: హైదరాబాద్ నిమ్స్‌ ఆసుపత్రిలో మరోసారి తనిఖీల కలకలం రేగింది. ఏసీబీ అధికారులు సహా డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. మూడు శాఖలకు సంబంధించిన అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ వ్యవహారంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. క్యాంటీన్ తో పాటు మెడికల్ స్టోర్స్ నుంచి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏటా రూ.50 లక్షల వరకు లంచాల రూపంలో వెళ్తున్నట్లు కనుగొన్నారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ కేసులో దొరికిన లింకుల ఆధారంగా ఈ సోదాలు చేస్తున్నారు.

TG: స్వేచ్ఛ ఎఫెక్ట్‌.. రూ.300 కోట్ల భూముల్లో ఎమ్మెల్యే  దందాపై విజిలెన్స్  ఎంక్వైరీ..!తెలంగాణSwechaa29 OCT

TG: స్వేచ్ఛ ఎఫెక్ట్‌.. రూ.300 కోట్ల భూముల్లో ఎమ్మెల్యే దందాపై విజిలెన్స్ ఎంక్వైరీ..!

TG: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో ఏకంగా రూ.300 కోట్ల విలువైన ప్రొటెక్టెడ్ టెనెన్సీ (పీటీ) భూముల వ్యవహారంపై స్వేచ్ఛ వరుస కథనాలు రాసింది. ఈ భూముల్లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి కుట్రలు చేస్తున్నారని.. వాటిని కొనొద్దని అప్రమత్తం చేసింది. స్వేచ్ఛ కథనాలతో విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. దశాబ్దాలుగా రికార్డుల్లో ఉన్న తమ భూములను కొట్టేసేందుకు కొందరు అధికారులు, రియల్ ఎస్టేట్ సంస్థలతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారంటూ బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర విజిలెన్స్ బృందం మహేశ్వరం తహసీల్దార్ ఆఫీస్‌లో విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టడంతో వ్యవహారం ఒక్కసారిగా వేడెక్కింది.

Kodangal: దారుణ పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం.. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని రైతుల దుస్థితే నిదర్శనం!..తెలంగాణSwechaa29 OCT

Kodangal: దారుణ పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం.. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని రైతుల దుస్థితే నిదర్శనం!..

రాష్ట్రంలో రైతుల ప‌రిస్థితి దారుణంగా ఉంది. నీళ్లులేక, క‌రెంట్ రాక అప్పులు చేసి పంట‌లు పండిస్తే తీరా అమ్ముకునే స‌మయానికి గిట్టిబాటు ధ‌ర‌లు లేక‌పోవ‌డంతో రైతులు తీవ్రంగా న‌ష్ట‌పోతున్నారు. పంట‌ల‌కు గిట్టుబాటు ధ‌ర క‌ల్పించాల‌ని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళ‌న‌లు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పత్తికి గిట్టుబాటు ధర కల్పించాల‌ని వికారాబాద్ జిల్లా కొడంగల్‌ మండలం నీటూర్‌ గేటు సమీపంలోని విజయ్‌ ఇండస్ట్రీస్‌ కాటన్ మిల్లు వద్ద రైతుల నిరసన చేప‌ట్టారు. నీళ్లు లేక దిగుబడి తగ్గితే, ఉన్న పత్తికి కూడా సరైన ధర ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు.

Tollywood: బ్యానర్‌కి ఒక దర్శకుడు..ఇదే సేఫ్ గేమ్!సినిమాSwechaa29 OCT

Tollywood: బ్యానర్‌కి ఒక దర్శకుడు..ఇదే సేఫ్ గేమ్!

Tollywood: బ్యానర్‌కి ఒక దర్శకుడు..ఇదే సేఫ్ గేమ్! అవును..కొంతమంది స్టార్ డైరెక్టర్స్..తమ స్నేహితులను నిర్మాణ రంగంలోకి తీసుకువచ్చి కొత్త బ్యానర్‌ను స్థాపించి వాళ్ళకే సినిమాలను చేస్తున్నారు. ప్రభాస్ తన స్నేహితుల కోసం యూవీ క్రియేషన్స్ ప్రారంభించాడు. ఇందులో, ప్రభాస్ మాత్రమే కాదు, మిగతా దర్శకులతోనూ, హీరోలతోనూ సినిమాలను చేస్తున్నారు.

Tollywood: కాంబినేషన్ కాదు కథ, హిట్ టాక్ మాత్రమే ముఖ్యం!సినిమాSwechaa29 OCT

Tollywood: కాంబినేషన్ కాదు కథ, హిట్ టాక్ మాత్రమే ముఖ్యం!

వెంకటేష్ నటించిన రెండు బ్లాక్ బస్టర్స్ మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలకి కథ-మాటలందించాడు త్రివిక్రమ్. ఇన్నేళ్ళకి వీళ్ల కాంబినేషన్‌లో ఆదర్శకుటుంబం సినిమా వస్తోంది. అయితే, త్రివిక్రమ్ ఎప్పుడూ..ఏదో ఒక పాపులర్ నవల ఆధారంగానో..పాత సినిమాల కథను తిప్పి, ఇప్పటి జనరేషన్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా సినిమాలు తీసి మెప్పిస్తున్నాడు. త్రివిక్రమ్ అక్కడా ఇక్కడా కథలు కాపీ కొడతాడనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు, వస్తోన్న ఆదర్శకుటుంబం సినిమాకి అంతే.

Hyderabad: హైదరాబాద్‍లో బ్రాండెడ్ బియ్యం కొంటున్నారా?.. అయితే మీరు మోసపోయినట్టే!..తెలంగాణSwechaa29 OCT

Hyderabad: హైదరాబాద్‍లో బ్రాండెడ్ బియ్యం కొంటున్నారా?.. అయితే మీరు మోసపోయినట్టే!..

ఎల్ నినో ఎఫెక్ట్ పేరుతో ఇప్పటికే భియ్యం ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. ఈ సమయంలో కొంత మంది వ్యాపారులు భారీగా అక్రమాలకు తెరలేపుతున్నారు. తాజాగా హైదరాబాద్‍లో భారీ రేషన్ బియ్యం స్కామ్ వెలుగు చూసింది. రేషన్ బియ్యానికి పాలిష్ చేసి బయట మార్కెట్లో అమ్మేస్తున్న మాఫియాగుట్టు రట్టైంది. నగరంలోని కర్మన్‌ఘాట్ ప్రాంతంలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లయ్స్, విజిలెన్స్ దాడులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కర్మన్‌ఘాట్‌లోని పలు రైస్ డిపోల్లో బియ్యం సంచులపై ముద్రించిన తూకానికి, వాస్తవంగా ఉన్న బియ్యం పరిమాణానికి తేడా ఉంటోందనే ఫిర్యాదులతో రంగంలోకి దిగగా ఈ సోదాల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.

మూసీ ప్రక్షాళన ముసుగులో లూటీకి తెరలేపారు- కేటీఆర్తెలంగాణSwechaa29 OCT

మూసీ ప్రక్షాళన ముసుగులో లూటీకి తెరలేపారు- కేటీఆర్

KTR: సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రాష్ట్రం కరువులో ఉంటే మూసీ సుందీకరణ ఎవరు అడిగారు అని కేటీఆర్ ప్రశ్నించారు. అధికారుల నుంచి అందిన విశ్వసనీయ సమాచారం ప్రకారం మూసీ ప్రాజెక్ట్ ముసుగులో వేలాది ఎకరాల లూటీకి సీఎం రేవంత్ తెరలేపారని ఆరోపించారు. అందుకే పబ్లిక్ హియరింగ్ అంటే రేవంత్ రెడ్డి ఉలిక్కి పడుతున్నారు, భయపడుతున్నారు అని చెప్పారు.

పబ్లిక్ రాకుండా తూతూ మంత్రంగా ఏదో చేశామంటే చేశాం అనిపించుకోవడానికి ఒక ప్రొసీజరల్ ఇష్యూ లాగా చాపకింద తోసేసే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీన్ని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు. మూసీ సుందరీకరణ ప్రాజెక్ట్ డీపీఆర్ ఇవాళ్టి వరకు లేదన్నారు. ఒకవేళ ఉంటే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని డిమాండ్ చేశారు. సుందరీకరణ పేరుతో ఆడుతున్న డ్రామాలు ఆపాలన్నారు.

Jio IPO: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఐపీఓ.. దలాల్ స్ట్రీట్‌లో జియో రచ్చ!NationalSwechaa29 OCT

Jio IPO: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఐపీఓ.. దలాల్ స్ట్రీట్‌లో జియో రచ్చ!

Jio IPO: దలాల్ స్ట్రీట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. భారత కార్పొరేట్ దిగ్గజం ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ 'జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్' స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడుతూనే సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఏకంగా రూ.30,213 కోట్ల భారీ సైజుతో దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా మార్కెట్లోకి వచ్చిన జియో.. ఇన్వెస్టర్లకు ఊహకందని లాభాల పంట పండించింది. బీఎస్‌ఈ, ఎన్‌ఎస్‌ఈలలో జియో షేర్లు అదరగొట్టే రేంజ్‌లో లిస్ట్ కావడంతో ఇన్వెస్టర్ల సంబరాలు అంబరాన్నంటాయి.ఈ ఐపీఓకు వచ్చిన డిమాండ్ చూసి మార్కెట్ పండితులే విస్తుపోయారు. ఏకంగా రూ.7.33 లక్షల కోట్ల విలువైన బిడ్లు వెల్లువెత్తడంతో ఈ పబ్లిక్ ఇష్యూ 22.19 రెట్లు ఓవర్ సబ్‌స్క్రైబ్ అయింది. దేశ చరిత్రలోనే అత్యంత వేగంగా, బిడ్డింగ్ మొదలైన కేవలం 95 నిమిషాల్లోనే 100 శాతం సబ్‌స్క్రిప్షన్ పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది. దాదాపు 1.3 కోట్ల మందికి పైగా సాధారణ ఇన్వెస్టర్లు తమ కష్టార్జితాన్ని నమ్మి జియో చేతుల్లో పెట్టడం భారత కార్పొరేట్ రంగంలోనే ఒక అద్భుతంగా నిలిచింది.

Bhogi: శర్వానంద్‌కి సోలో డేట్ దొరకలేదు పాపం!సినిమాSwechaa29 OCT

Bhogi: శర్వానంద్‌కి సోలో డేట్ దొరకలేదు పాపం!

Bhogi: చిన్న సినిమా సక్సెస్ కూడా పెద్ద సినిమా మీద కొన్నిసార్లు గట్టిగానే ప్రభావం చూపిస్తుంది. అందుకే, మన సీనియర్ నిర్మాతలైన సురేష్ బాబు, అల్లు అరవింద్, నాగార్జున కనీసం సినిమా సినిమాకి మధ్య రెండు వారాలైనా గ్యాప్ ఉండాలని చెప్తుంటారు. దానివల్ల, థియేటర్స్ పుష్కలంగా దొరుకుతాయి. సినిమా బావుంటే మంచి కలెక్షన్స్ వచ్చి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉంటారు.