తెలంగాణ
Kodangal: దారుణ పరిస్థితుల్లో రాష్ట్ర రైతాంగం.. రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోని రైతుల దుస్థితే నిదర్శనం!..
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. నీళ్లులేక, కరెంట్ రాక అప్పులు చేసి పంటలు పండిస్తే తీరా అమ్ముకునే సమయానికి గిట్టిబాటు ధరలు లేకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా పత్తికి గిట్టుబాటు ధర కల్పించాలని వికారాబాద్ జిల్లా కొడంగల్ మండలం నీటూర్ గేటు సమీపంలోని విజయ్ ఇండస్ట్రీస్ కాటన్ మిల్లు వద్ద రైతుల నిరసన చేపట్టారు. నీళ్లు లేక దిగుబడి తగ్గితే, ఉన్న పత్తికి కూడా సరైన ధర ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ రైతులు ఆందోళనకు దిగారు.
