తెలంగాణ

ఏటా రూ.50లక్షలు లంచం..! నిమ్స్‌లో మరోసారి ఏసీబీ తనిఖీల కలకలం

ACB Raids: హైదరాబాద్ నిమ్స్‌ ఆసుపత్రిలో మరోసారి తనిఖీల కలకలం రేగింది. ఏసీబీ అధికారులు సహా డ్రగ్ కంట్రోల్, ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. ఏకకాలంలో సోదాలు చేస్తున్నారు. మూడు శాఖలకు సంబంధించిన అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు. నిమ్స్ డాక్టర్ లక్ష్మీ భాస్కర్ వ్యవహారంలో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. క్యాంటీన్ తో పాటు మెడికల్ స్టోర్స్ నుంచి పెద్ద ఎత్తున లంచాలు తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఏటా రూ.50 లక్షల వరకు లంచాల రూపంలో వెళ్తున్నట్లు కనుగొన్నారు. నిమ్స్ అడిషనల్ సూపరింటెండెంట్ లక్ష్మీ భాస్కర్ కేసులో దొరికిన లింకుల ఆధారంగా ఈ సోదాలు చేస్తున్నారు.