Jio IPO: భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే బిగ్గెస్ట్ ఐపీఓ.. దలాల్ స్ట్రీట్లో జియో రచ్చ!
Jio IPO: దలాల్ స్ట్రీట్ చరిత్రలో సరికొత్త అధ్యాయం మొదలైంది. భారత కార్పొరేట్ దిగ్గజం ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ 'జియో ప్లాట్ఫామ్స్ లిమిటెడ్' స్టాక్ మార్కెట్లోకి అడుగుపెడుతూనే సరికొత్త రికార్డులను తిరగరాసింది. ఏకంగా రూ.30,213 కోట్ల భారీ సైజుతో దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా మార్కెట్లోకి వచ్చిన జియో.. ఇన్వెస్టర్లకు ఊహకందని లాభాల పంట పండించింది. బీఎస్ఈ, ఎన్ఎస్ఈలలో జియో షేర్లు అదరగొట్టే రేంజ్లో లిస్ట్ కావడంతో ఇన్వెస్టర్ల సంబరాలు అంబరాన్నంటాయి.ఈ ఐపీఓకు వచ్చిన డిమాండ్ చూసి మార్కెట్ పండితులే విస్తుపోయారు. ఏకంగా రూ.7.33 లక్షల కోట్ల విలువైన బిడ్లు వెల్లువెత్తడంతో ఈ పబ్లిక్ ఇష్యూ 22.19 రెట్లు ఓవర్ సబ్స్క్రైబ్ అయింది. దేశ చరిత్రలోనే అత్యంత వేగంగా, బిడ్డింగ్ మొదలైన కేవలం 95 నిమిషాల్లోనే 100 శాతం సబ్స్క్రిప్షన్ పూర్తి చేసుకుని రికార్డు సృష్టించింది. దాదాపు 1.3 కోట్ల మందికి పైగా సాధారణ ఇన్వెస్టర్లు తమ కష్టార్జితాన్ని నమ్మి జియో చేతుల్లో పెట్టడం భారత కార్పొరేట్ రంగంలోనే ఒక అద్భుతంగా నిలిచింది.
