తెలంగాణ

'రేవంత్ ప్రభుత్వాన్ని కూల్చే వరకు నిద్రపోను': పాదయాత్రలో ఈటల సంచలన వ్యాఖ్యలు!

జవహర్ నగర్ డంప్ యార్డ్ సమస్యల పరిష్కారం కోరుతూ మల్కాజిగిరి బీజేపీ ఈటల రాజేందర్ చేపట్టిన పాదయాత్ర తీవ్ర రాజకీయ వేడిని రాజేసింది. పాదయాత్ర సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. డంప్ యార్డు తొలగింపు కోసం తాను పాదయాత్ర చేస్తుంటే, కాంగ్రెస్ నాయకులు 'ఈటలకు పనిలేక తిరుగుతున్నాడంటూ' బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కేవలం ఈ డంప్ యార్డ్ సమస్య పరిష్కరించడమే కాకుండా, ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చే వరకు తాను వీధుల్లోనే తిరుగుతూ పోరాటం చేస్తానని బహిరంగంగా సవాల్ విసిరారు.