చిత్రం లేదు
తెలంగాణTG: ఎవ్వరినీ వదిలిపెట్టను.. వాళ్లంతా నాకు క్షమాపణ చెప్పాల్సిందే: కేటీఆర్
TG: తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపిన వ్యక్తిగత ఆరోపణల వ్యవహారంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూకుడు పెంచారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రి కొండా సురేఖ కోర్టు మెట్లు దిగి క్షమాపణలు చెప్పడంపై ఆయన ఘాటుగా స్పందించారు. తనపై తప్పుడు ప్రచారాలు చేసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని, లేదంటే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు."మొన్న ప్రముఖ పత్రిక ఈనాడు బేషరతుగా క్షమాపణ చెప్పింది.. ఈరోజు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. రేపు నాపై బురదజల్లిన ఇంకొందరు కూడా క్యూ కట్టి సారీ చెప్పక తప్పదు" అంటూ కేటీఆర్ గట్టి ధీమా వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమో లేదా తన ఇమేజ్ను డ్యామేజ్ చేయాలనో అసత్యాలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.
