తెలంగాణ

TG: ఎవ్వరినీ వదిలిపెట్టను.. వాళ్లంతా నాకు క్షమాపణ చెప్పాల్సిందే: కేటీఆర్

రచన: Mahesh••3 నిమిషాల పఠనం

TG: తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపిన వ్యక్తిగత ఆరోపణల వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూకుడు పెంచారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రి కొండా సురేఖ కోర్టు మెట్లు దిగి క్షమాపణలు చెప్పడంపై ఆయన ఘాటుగా స్పందించారు.

TG: తెలంగాణ రాజకీయాల్లో గత కొన్ని రోజులుగా తీవ్ర దుమారం రేపిన వ్యక్తిగత ఆరోపణల వ్యవహారంలో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దూకుడు పెంచారు. తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా మాట్లాడిన మంత్రి కొండా సురేఖ కోర్టు మెట్లు దిగి క్షమాపణలు చెప్పడంపై ఆయన ఘాటుగా స్పందించారు. తనపై తప్పుడు ప్రచారాలు చేసిన ప్రతి ఒక్కరూ కచ్చితంగా క్షమాపణలు చెప్పి తీరాల్సిందేనని, లేదంటే ఎవరినీ వదిలిపెట్టే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.

"మొన్న ప్రముఖ పత్రిక ఈనాడు బేషరతుగా క్షమాపణ చెప్పింది.. ఈరోజు మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. రేపు నాపై బురదజల్లిన ఇంకొందరు కూడా క్యూ కట్టి సారీ చెప్పక తప్పదు" అంటూ కేటీఆర్ గట్టి ధీమా వ్యక్తం చేశారు. కేవలం రాజకీయ లబ్ధి కోసమో లేదా తన ఇమేజ్‌ను డ్యామేజ్ చేయాలనో అసత్యాలు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు.

తప్పుడు మాటలతో తనపై దుష్ప్రచారం చేసిన ఏ ఒక్కరినీ వదిలిపెట్టేది లేదని.. న్యాయపరంగా అందరి అంతు చూస్తానని ఆయన తేల్చిచెప్పారు. చట్టం ముందు అందరూ సమానులేనని, నిరాధారమైన వ్యాఖ్యలు చేస్తే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో ఈ క్షమాపణలే నిరూపిస్తున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. కొండా సురేఖ వ్యవహారం తర్వాత కేటీఆర్ చేసిన ఈ హెచ్చరికలు ఇప్పుడు అధికార కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కొత్త గుబులు రేపుతున్నాయి.

#KTR#KTR News#Telangana Politics#BRS#Konda Surekha#Telangana News#Eenadu#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి