తెలంగాణ

TG: ఆ పని చేయకపోతే పాలిటిక్స్ వదిలేస్తా.. సీఎంకు ఈటల రాజేందర్ ఓపెన్ ఛాలెంజ్!

రచన: Mahesh••3 నిమిషాల పఠనం

TG: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విసిరిన సవాల్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. హైదరాబాద్ ప్రజలను ఏళ్ల తరబడి వేధిస్తున్న జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఓపెన్ ఆఫర్ ఇచ్చారు.

TG: తెలంగాణ రాజకీయాల్లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ విసిరిన సవాల్ ఇప్పుడు సంచలనం రేపుతోంది. హైదరాబాద్ ప్రజలను ఏళ్ల తరబడి వేధిస్తున్న జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ సమస్యపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. అంతేకాదు, తాను చెప్పినట్లు చేయకపోతే ఏకంగా రాజకీయాల నుంచే తప్పుకుంటానంటూ ఈటల చేసిన శపథం రాజకీయ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

హైదరాబాద్ శివార్లలోని జవహర్‌నగర్ డంపింగ్ యార్డుతో చుట్టుపక్కల ప్రజలు నిత్యం నరకం చూస్తున్నారని, దీనిని శాశ్వతంగా అక్కడి నుంచి తరలించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఈటల అన్నారు. "రేవంత్ రెడ్డి గారూ.. జవహర్‌నగర్ డంపింగ్ యార్డును తరలించడానికి వెంటనే డీపీఆర్ (డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్) సిద్ధం చేయండి. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి, ప్రధాని నరేంద్ర మోడీ గారి దగ్గరి నుంచి దీనికి కావాల్సిన నిధులను నేనే స్వయంగా తీసుకొచ్చి ఇప్పిస్తా" అని ఈటల రాజేందర్ స్పష్టం చేశారు.

అక్కడితో ఆగకుండా రేవంత్ సర్కార్‌కు ఈటల గట్టి సవాల్ విసిరారు. "ఒకవేళ కేంద్రం నుంచి నేను నిధులు ఇప్పించలేకపోతే.. రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటా" అంటూ కుండబద్దలు కొట్టారు. ప్రజల ఆరోగ్యం, నగర భవిష్యత్తు కోసం ప్రభుత్వం ముందడుగు వేస్తే కేంద్రం వైపు నుంచి నిధులు రాబట్టే బాధ్యత తనదని ఆయన తేల్చిచెప్పారు. ఈటల రాజేందర్ చేసిన ఈ ఓపెన్ ఛాలెంజ్‌పై ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.

#Etela Rajender#Revanth Reddy#Telangana Politics#Telangana BJP#BJP MP#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి