సినిమా

Heros: లుక్ టెస్ట్..మేకోవర్ కోసం కోట్లు ఖర్చు చేస్తున్న మేకర్స్..

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Heros: ప్రతీ సినిమాకి హీరోల మేకోవర్ అనేది తప్పనిసరిగా మారింది. ఇది, ఇప్పుడు కాదు బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి కొనసాగుతూ వస్తోంది. కథ, అందులో హీరో పాత్రకి తగ్గట్టుగా వేశాధారణ ఉండాలనేదే ముఖ్యం. అందుకే, ప్రతీ సినిమా కథ విన్న తర్వాత హీరోలు..ఇతర పాత్రల్లో నటించే కీలక నటులకి లుక్ టెస్ట్ అనేది తప్పనిసరి. ముఖ్యంగా, హీరోలను సినిమా సినిమాకి ఎంతో ప్రత్యేకంగా చూపిస్తున్నారు.

కమర్షియల్ సినిమాలకే హీరో గెటప్, కాస్ట్యూంస్, హెయిర్ స్టైల్ కోసం ఒక బడ్జెట్ కేటాయించాల్సి వస్తుంది. అలాంటిది, పీరియాడికల్ సినిమా, హిస్టారికల్, మైథలాజికల్ సినిమాలంటే గ్యారెంటీగా కోట్లను ఖర్చు చేయాల్సిందే. అందుకే, ఈ మధ్యకాలంలో సినిమాల బడ్జెట్ తడిసి మోపెడవుతోంది. అఖండ సినిమాలో బాలయ్య మేకోవర్, పుష్ప సినిమాలో అల్లు అర్జున్ మేకోవర్ కోసం నిర్మాతలు చాలానే ఖర్చు చేశారు.

హీరోల విగ్గులకే లక్షల ఖర్చు:

మన టాలీవుడ్ స్టార్ హీరోలలో ప్రభాస్ వాడే విగ్గుల కోసం లక్షల్లో ఖర్చు చేస్తున్నారు. ఆయన, ప్రతీ సినిమాకి ఓ గెటప్‌లో కనిపిస్తున్న విషయం తెలిసిందే. అందుకే, సినిమా సినిమాకి విగ్గు మారుతుంది. అలాగే, సూపర్ స్టార్ మహేష్ బాబు విషయంలోనూ. మహేష్ కూడా ప్రతీ సినిమాకి ఓ కొత్త గెటప్‌లో కనిపిస్తున్నారు. ఆయన మేకోవర్ కోసం కూడా లక్షల్లో ఖర్చు అవుతోంది. సూపర్ స్టార్ రజినీకాంత్ గురించైతే ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఆయన, వాడే వుగ్గులు కూడా చాలా కాస్ట్లీ.

శంకర్ సినిమాలో హీరోలకి భారీ ఖర్చు:

క్రియేటివ్ జీనియస్ శంకర్ తీసే సినిమాలలో హీరోలను చాలా వింతగా చూపిస్తుంటారు. అపరిచితుడు, ఐ, మల్లన్న లాంటి సినిమాలలో విక్రమ్ లుక్ కోసం కోట్లను ఖర్చు పెట్టిన విషయం చాలామందికి తెలియకపోవచ్చు. రోబో సినిమాల కోసం రజినీకాంత్ కి భారీగా ఖర్చు చేశాడు శంకర్. అలాగే, ఇండియన్ సినిమాలో కమల్ హాసన్, సుకన్యల గెటప్స్ కోసం చాలా కోట్లు ఖర్చు పెట్టించాడు. ఇన్ని వందల కోట్లు ఖర్చు చేసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ అయితే నిర్మాత చచ్చిబ్రతికినట్టే.

#Prabhas#Mahesh Babu#Rajinikanth#Vikram#Shankar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి