సినిమా

Heroines: పెళ్లి తర్వాత కూడా హీరోయిన్స్‌గానే!

రచన: Anshu••5 నిమిషాల పఠనం

Heroines: మన స్టార్ హీరోయిన్స్ చాలామంది పెళ్ళికి ముందే సినిమాలను చేస్తూ వస్తున్నారు తప్ప పెళ్లి తర్వాత దాదాపుగా సినిమాలకి దూరమైన వాళ్ళే ఉన్నారు. రోజా, మీనా, రంభ లాంటి వాళ్ళు మళ్ళీ సినిమాల వైపు రాలేదు. అంతకముందున్న వాళ్ళలో కూడా చాలామంది పెళ్లి తర్వాత పూర్తిగానే సినిమాలను వదిలేశారు. కానీ, జనరేషన్ మారింది. ఇప్పటితరం వాళ్ళు మాత్రం పెళ్లి తర్వాత కూడా సినిమాలను చేస్తూ ఉన్నారు.

Heroines: మన స్టార్ హీరోయిన్స్ చాలామంది పెళ్ళికి ముందే సినిమాలను చేస్తూ వస్తున్నారు తప్ప పెళ్లి తర్వాత దాదాపుగా సినిమాలకి దూరమైన వాళ్ళే ఉన్నారు. రోజా, మీనా, రంభ లాంటి వాళ్ళు మళ్ళీ సినిమాల వైపు రాలేదు. అంతకముందున్న వాళ్ళలో కూడా చాలామంది పెళ్లి తర్వాత పూర్తిగానే సినిమాలను వదిలేశారు. కానీ, జనరేషన్ మారింది. ఇప్పటితరం వాళ్ళు మాత్రం పెళ్లి తర్వాత కూడా సినిమాలను చేస్తూ ఉన్నారు.

పెళ్ళి తర్వాత కూడా హీరోయిన్స్‌గానే:

కీర్తి సురేష్:

ఇప్పుడు సౌత్ భాషలలో విపరీతమైన క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌లో కీర్తి సురేష్ ఒకరు. మహానటి తర్వాత జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా అవార్డును అందుకున్న కీర్తి సురేష్ పలు భాషలలో సినిమాలు చేస్తూ చాలా బిజీగా ఉంది. సాధారణంగా ఫ్లాప్స్ వస్తే ఆ హీరోయిన్‌కి అవకాశలిచ్చేవాళ్ళుండరు. కానీ, కీర్తికి తెలుగుతో పాటు తమిళం, మలాయాళం, హిందీ భాషలలో వరుసగా సినిమాలు చేస్తోంది. అది, కూడా పెళ్లి తర్వాత. పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకి గుడ్‌బై చెప్తుందని అందరూ అనుకున్నారు. కానీ, గ్లామర్ డోస్ పెంచి రాత్రింబవళ్ళు సినిమాలతోనే గడుపుతోంది.

నయనతార:

విగ్నేష్ శివన్‌తో నయనతార పెళ్లి జరిగిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ, లేడీ సూపర్ స్టార్ అనే క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు. అంతేకాదు, బాలీవుడ్ సహా తెలుగు-తమిళ భాషలలో హీరోయిన్‌గా నటిస్తోంది. భారీ రెమ్యునరేషన్ అందుకుంటున్న నయన్..ప్రస్తుతం, హిందీలో సల్మాన్ ఖాన్ సరసన నటిస్తోంది. మరోవైపు నిర్మాతగానూ యంగ్ డైరెక్టర్స్‌ను ఎంజరేజ్ చేస్తోంది.

సమంత:

సమంత కెరీర్ మంచి పీక్స్‌లో ఉన్నప్పుడే అక్కినేని నాగ చైతన్యను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత కూడా ఓ బేబీ, మజిలీ లాంటి సినిమాలు చేసింది. మజిలీ మూవీని నాగ చైతన్యతో చేసి హిట్ అందుకుంది. ఆ తర్వాత ఇద్దరూ విడిపోయి విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సమంత చేసిన సినిమాలు, వెబ్ సిరీస్‌లు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. కానీ, అనారోగ్యం పాలవడంతో కొంతకాలం బ్రేక్ తీసుకున్న సమంత, నిర్మాత దర్శకుడు రాజ్ నిడుమోరుని పెళ్లి చేసుకొని ఆ తర్వాత కూడా మా ఇంటి బంగారం సినిమా చేసి బ్లాక్ బస్టర్ కొట్టింది.

కాజల్ అగర్వాల్ కూడా ఆచార్య సినిమా సమయంలో పెళ్లి చేసుకుంది. పెళ్లి కోసం ఆచార్య సినిమాను కూడా వదిలేసింది. ఓ బిడ్డకి తల్లైయ్యాక మళ్ళీ బాలకృష్ణ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు కూడా సినిమాలను చేస్తోంది. దీనిలో భాగంగానే రామాయణ సినిమాలో మండోదరిగా నటించింది. కాజల్ మాదిరిగానే రకుల్ ప్రీత్‌సింగ్ కూడా సినిమాలు చేస్తోంది. ఇలా, ఈ జనరేషన్ హీరోయిన్స్ పెళ్లి తర్వాత కూడా సినిమాలు చేయడానికి భర్తలను ఒప్పించి మరీ సినీ కెరీర్‌ను కంటిన్యూ చేస్తున్నారు.

#Keerthy Suresh#Nayanthara#Samantha#Rakul Preeth Singh#Kajal Aggerwal
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి