స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

స్వేచ్ఛ న్యూస్ ఎఫెక్ట్.. తాండూర్ ఎమ్మెల్యే కుటుంబంపై విజిలెన్స్ గురి

రచన: Mamatha puppala••7 నిమిషాల పఠనం

సత్యాలే వార్తలుగా స్వేచ్ఛ న్యూస్ పరిశోధనాత్మక కథనాలను ప్రచురిస్తోంది. అందరి కంటే ముందే నిజాలను పసిగట్టి ప్రభుత్వాన్ని, ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తోంది. అధికార అహంకారంతో పాటు, కండ బలం, ధన బలంతో ఏమైనా చేయొచ్చు అనుకునే వారి వ్యవహారం బట్టలు ఊడదీసే విధంగా ఫాలో అప్ స్టోరీలు ఇస్తోంది.

  • తప్పుడు పత్రాలతో పేదల పీటీ భూములు కబ్జా?

  • గత ఏడాది డిసెంబర్ 2 నుంచి స్వేచ్ఛ వరస కథనాలు

  • తుమ్మలూర్‌లో జేబీ ఇన్ఫ్రా భూ మాయాజాలంతో ప్రారంభం

  • విస్తరణ ఎలా పెరిగిందో ఇన్వెస్టిగేషన్ స్టోరీ

  • ఏప్రిల్ 4న అధికార పార్టీ ఎమ్మెల్యే అయితే అంతా క్లియరా అంటూ అనుమతులపై ప్రశ్న

  • ఫ్యూచర్ సిటీలో తాండూర్ ఎమ్మెల్యే కబ్జాల నుంచి కాపాడండి అంటూ వేడుకోలు ప్రచురణలు

  • ఈ భూ దందాపైనే మనోహర్ రెడ్డిపై సీఎం రేవంత్ హాట్ కామెంట్స్?

  • ఎమ్మెల్యేలు ఎకరాలు కొనుగోలు చేసి గజాల్లో అమ్మడం అంటూ చురకలు?

  • కాంక్రీట్ ఇన్ఫ్రా అనిల్ రెడ్డి, ప్రవీణ్ రెడ్డి వల్ల కాలేకనే మీ ఎంట్రీతో వాటాలతో ఎలా పూర్తి చేశారో?

  • మహేశ్వరం ఎమ్మార్వో కార్యాలయంలో 40 నిమిషాల పాటు విజిలెన్స్ అధికారుల విచారణ

  • సైట్ విజిటింగ్‌తో పాటు రాతపూర్వక సమాధానాలు కోరిన వైనం

  • తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎమ్మార్వో తప్పుడు సమాచారం అందజేత?

  • అధికార పార్టీతో అన్నీ జరిపోతాయనే తీరుకు పీటీ ల్యాండ్‌యే ఉదాహరణ

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

స్వేచ్ఛ న్యూస్ చైర్మన్

సత్యాలే వార్తలుగా స్వేచ్ఛ న్యూస్ పరిశోధనాత్మక కథనాలను ప్రచురిస్తోంది. అందరి కంటే ముందే నిజాలను పసిగట్టి ప్రభుత్వాన్ని, ప్రజలను అప్రమత్తం చేసే ప్రయత్నం చేస్తోంది. అధికార అహంకారంతో పాటు, కండ బలం, ధన బలంతో ఏమైనా చేయొచ్చు అనుకునే వారి వ్యవహారం బట్టలు ఊడదీసే విధంగా ఫాలో అప్ స్టోరీలు ఇస్తోంది. అదేవిధంగా తాండూర్ ఎమ్మెల్యే బీ మనోహార్ రెడ్డి కుటుంబం భూ కబ్జాపై మొదటి నుంచి స్వేచ్ఛ న్యూస్ ప్రజల ముందు ఉంచింది. దీంతో అధికారులు అప్రమత్తం అవ్వడమే కాకుండా విజిలెన్స్ నివేదకకు రెవెన్యూ అధికారులను విచారించారు. పీటీ యాక్ట్ ఫవర్ ఫుల్ కావడంతో ఎమ్మెల్యే అధికార బలంతో అమ్మకం జరిపితే కొనుగోలు చేసిన ప్లాట్ ఓనర్స్ ఎలా మోసపోతారనేది కూడా కీలక విషయం కానుంది.

తప్పుడు నివేదికలు, తప్పుడు పత్రాలతో తప్పుదారి పట్టిస్తున్న ఎమ్మెల్యే?

తుమ్మలూర్ సర్వే నెంబర్ 371, 372, 373, 377లో 51 ఎకరాల పీటీ భూమి ఉంది. వీటి పక్కనే బిలా దాఖలా భూములు ఉన్నాయి. అవి కూడా అన్యాక్రాంతం అయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందు కాంక్రీట్ ఇన్ఫ్రా అనిల్ రెడ్డి, ప్రవీణ్‌ రెడ్డిలు ఈ భూములను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు. అయితే, రైతులు పోరాడారు. కానీ తాండూర్ ఎమ్మెల్యే ఎంట్రీతో సీన్ మారిపోయింది. కబ్జా చేసేశారు. పట్టాదారుడు మాకే అమ్మకం జరిపారని, పీటీ దారులు సరెండర్ చేశారని తప్పుడు సమాచారంతో అధికార బలాన్ని వినియోగించి అక్రమాలకు పాల్పడ్డారు. కొనుగోలు చేసిన భూములకు పొజిషన్ భూములకు చాలా తేడా ఉంది. ఇదే కాకుండా ఈ వెంచర్‌లో అనేక ఇతర భూ స్కాంలు ముడిపడి ఉన్నాయి. ఎమ్మెల్యే కావడంతో అధికారులందరి వద్దకు తిరుగుతూ తన అనుమతులు తెచ్చుకున్నారు. ఇలా ప్రతి వార్తను ప్రజల ముందు ఎండగట్టాం. అప్రమత్తం చేశాం. కానీ, ఆఫర్స్, బ్యాంకు లోన్స్ అంటూ విచ్చలవిడిగా అమ్మేసి వందల కోట్లు కూడబెట్టుకున్నారు.

ఇప్పుడు విజిలెన్స్‌తో ఎం జరగబోతుంది?

సొంత పార్టీ ఎమ్మేల్యే భూ కబ్జాలు పాల్పడ్డట్లు రికార్డులు ఉన్నాయి. అధికార బలంతో ఏం చేసినా నడుస్తుందని వాళ్ల కుమారుల పేర్ల మీదకు భూములను మార్చుకున్నారు. ఆ తర్వాత లే అవుట్ చేసుకుని అమ్మేశారు. ఎప్పుడైనా టైటిల్ డిస్ప్యూట్ వస్తే ఎవరు బాధ్యులు, అమ్ముకొనిపోతే ఎవరికి చెడ్డ పేరు వస్తుంది. ఇది కాంగ్రెస్ పార్టీ వరకు చేరింది. డిసెంబర్‌లో స్వేచ్ఛ న్యూస్ వార్తలు రాయగా, మార్చిలో ఎమ్మార్వో అప్పల నాయుడు పీటీ దారులు ఉన్నారని నివేదిక ఇచ్చారు. కానీ, ఆ తర్వాత వారంలో ఎమ్మార్వో చేత మరో నివేదిక తెప్పించుకున్నారు. తప్పుడు పత్రాలతో తప్పుడు సమాచారంతో పూర్తి అనుమతులు తీసుకున్నారు. పీటీ దారులపైనే అక్రమంగా కేసులు పెట్టించారు. పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పించారు. దీంతో ఏప్రిల్ 10న స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి మరో ఇన్వెస్టిగేషన్ స్టోరీ రాశారు. దీంతో అనేక దర్యాప్తు సంస్థలకు బాధితులు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కేటీఆర్‌ను కలిసి వినతి పత్రాలు, పేదల భూములను కాపాడండి అంటూ వేడుకోలు జరిగాయి. కేసీఆర్ ఫాంహౌజ్ వద్ద హడావుడి చేసిన అధికారులు తాజాగా సొంత పార్టీ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అక్రమ వెంచర్‌లో దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇది అందరిపైనా దర్యాప్తులు చేస్తున్నామనే సంకేతాలు పంపేందుకా? నిజంగానే పేదలకు న్యాయం చేసి ఎమ్మెల్యే కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకుంటారా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌గా ఉంది.

#TandurMLAManoharReddy#VigilanceRaidMaheshwaram#SwechaNewsEffect#ThummaloorLandScam#PTLandEncroachment#TelanganaPolitics2026#CrimeAndSafetyTelugu#TelanganaNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి