సినిమా

అభిమానం పేరుతో టార్చర్.. ఫ్లైట్ లో కీర్తి సురేష్ కు చేదు అనుభవం....

రచన: Mahesh•••4 నిమిషాల పఠనం

Keerthy Suresh: హీరోయిన్లు బయట కనిపిస్తే చాలు.. ఫొటోలు, సెల్ఫీల కోసం ఫ్యాన్స్ వెంటపడటం మామూలే. కానీ కొందరు మాత్రం అభిమానం పేరుతో శృతిమించి ప్రవర్తిస్తూ నరకం చూపిస్తుంటారు. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌కు విమానంలో సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది.

Keerthy Suresh: హీరోయిన్లు బయట కనిపిస్తే చాలు.. ఫొటోలు, సెల్ఫీల కోసం ఫ్యాన్స్ వెంటపడటం మామూలే. కానీ కొందరు మాత్రం అభిమానం పేరుతో శృతిమించి ప్రవర్తిస్తూ నరకం చూపిస్తుంటారు. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌కు విమానంలో సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి సెల్ఫీ కావాలంటూ ఆమెను విపరీతంగా వేధించాడు. ఈ విషయాన్ని స్వయంగా కీర్తి బయటపెట్టడంతో ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది.

కాళ్లపై నిలబడలేడు.. కానీ సెల్ఫీ కావాలట

కీర్తి సురేశ్ తన భర్త ఆంటోనితో కలిసి మిలాన్ నుంచి ఇండియాకు ఫ్లైట్‌లో వస్తుండగా ఈ ఘటన జరిగింది. బాగా తాగి తూలుతున్న ఓ ప్రయాణికుడు కీర్తి కూర్చున్న సీటు దగ్గరకు వచ్చాడు. కాళ్లపై నిలబడే సత్తువ కూడా లేకపోయినా.. కీర్తితో ఇప్పుడే సెల్ఫీ దిగాలంటూ మొండిపట్టు పట్టాడు. పరిస్థితి అర్థం చేసుకున్న కీర్తి.. కాసేపు ఆగి తర్వాత తీసుకుందామని చాలా కూల్‌గా చెప్పినా అతగాడు వినిపించుకోలేదు.

భర్త ఆపినా వినకుండా రచ్చ

"ఇప్పుడే ఫొటో కావాలి" అంటూ ఆ వ్యక్తి మరింత మొండిగా ప్రవర్తించడంతో కీర్తికి చిర్రెత్తుకొచ్చింది. "నేను ఎవరితో ఎప్పుడు ఫొటో దిగాలో నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు" అని ముఖం మీదే గట్టిగా చెప్పేశారు. పక్కనే ఉన్న ఆమె భర్త ఆంటోని కూడా అతనికి నచ్చజెప్పి ఆపేందుకు ట్రై చేశాడు. అయినా సరే ఆ తాగుబోతు వెనక్కి తగ్గకుండా మరింత గొడవ చేయడంతో.. విధిలేక విమాన సిబ్బందికి కంప్లైంట్ చేయాల్సి వచ్చింది. వాళ్లు వెంటనే రంగంలోకి దిగి అతడిని పక్కకు తీసుకెళ్లడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఫ్యాన్స్‌తో మాట్లాడటం తనకు ఇష్టమేనని, కానీ హద్దులు దాటి ప్రవర్తించే కొందరి వల్లే ఇలాంటి తలనొప్పులు వస్తుంటాయని కీర్తి బాధపడ్డారు. కొందరు మాత్రం చాలా పద్ధతిగా మాట్లాడి వెళ్తారని, అలాంటి వాళ్లను ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటానని ఆమె చెప్పారు.

#Keerthy Suresh#Keerthy Suresh News#Keerthy Suresh Latest News#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి