తెలంగాణ

KTR: ఏపీలో కరువు లేదు.. తెలంగాణలో కరువుకి రేవంత్ రెడ్డే కారణం- కేటీఆర్

రచన: NK•••4 నిమిషాల పఠనం

KTR: తెలంగాణలో కరువు పరిస్థితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కారణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తున్నట్లుగా రేవంత్ తీరు ఉందని ఆయన ధ్వజమెత్తారు.

KTR: తెలంగాణలో కరువు పరిస్థితులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డే కారణం అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. రోమ్ నగరం తగలబడుతుంటే ఫిడేల్ వాయిస్తున్నట్లుగా రేవంత్ తీరు ఉందని ఆయన ధ్వజమెత్తారు. మేము ఎంత చెప్పినా వినకుండా వెయ్యి టీఎంసీల నీళ్లు దిగువకు వదిలారని రేవంత్ రెడ్డిపై విరుచుకుపడ్డారు. ప్రభుత్వాన్ని అప్రమత్తం చేయడానికి నాలుగు నెలల కిందట మొత్తం బీఆర్ఎస్ నాయకులం కన్నెపల్లికి పోయామని కేటీఆర్ గుర్తు చేశారు.

రేవంత్ వదిలేస్తే.. చంద్రబాబు తీసుకున్నారు

''లక్ష క్యూసెక్కుల నీళ్లు కిందికి ఉత్తగా పోతున్నాయి.. రాజకీయాలు పక్కన పెట్టి నీళ్లను ఎత్తిపోయమని చెప్పాము. కానీ, నీళ్లను ఎత్తిపోయలేదు. దిగువకు విడిచిపెట్టారు. కన్నెపల్లి, దేవాదుల దగ్గర పంపులు ఆన్ చేయలేదు. మీరు నీళ్లు వదిలి పెడితే 750 టీఎంసీల నీళ్లు కిందికి పోయాయి. చంద్రబాబు అదే గోదావరిలో పట్టిసీమ దగ్గర పంపులు ఆన్ చేసి దాదాపు 90 టీఎంసీల నీళ్లు తీసుకున్నారు. బ్రహ్మాండంగా వాళ్ళ చెరువులు నిండాయి. ఇవాళ ఆంధ్రాలో కరువు లేదు. తెలంగాణలో మాత్రమే కరువు ఉంది. దానికి కారణం కచ్చితంగా రేవంత్ రెడ్డి, ఆయన అహంకార మనస్తత్వం.

అహంకారభావంతో రేవంత్ వ్యవహరించారు

వీళ్లు చెప్తే వినాలా? వీళ్లు కట్టిన ప్రాజెక్టు పంపులు ఆన్ చేయాలా? వీళ్లు నాకు చెప్పేటోళ్లా? వీళ్లు చెప్పినట్టు చేస్తే నేను ముఖ్యమంత్రి ఎట్ల అయితా అనే ఒక అహంకారభావంతో రేవంత్ వ్యవహరించారు. 123 రోజుల కిందట మేము హెచ్చరించినా.. ఈరోజు వరకు ఆ పంపులు ఆన్ చేయలేదు. తొమ్మిది ఉమ్మడి జిల్లాలను రేవంత్ ఎండబెట్టారు. ఇవాళ రాష్ట్రంలోని 365 మండలాల్లో కరువు ఉందంటే దానికి కారణం ఒకే ఒక్కరు.. రేవంత్ రెడ్డి.

700 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుప్పంకి నీళ్లు తీసుకెళ్లారు

250 టీఎంసీల నీళ్లు కృష్ణా నదిలో వదిలిపెట్టారు. శ్రీశైలం ప్రాజెక్టుకి కుప్పం 700 కిలోమీటర్ల దూరం. కృష్ణా నీళ్లు 70 కిలోమీటర్లు పక్కకు పారించే తెలివి మన సీఎంకి లేకపాయె. కానీ, 700 కిలోమీటర్లు దాటి తీసుకెళ్లారు చంద్రబాబు. శ్రీశైలం నుంచి 700 కిలోమీటర్ల దూరం నీళ్లు ప్రయాణం చేయాలంటే కాలువల ద్వారా ఒక లక్ష ఎకరాలకు సరిపడే నీరు ఆవిరితోనే పోతుంది. దాదాపు 165 నుంచి 180 టీఎంసీల నీళ్లు.. ఏపీ వాడుకుంటే మన తెలంగాణ ప్రభుత్వం 20 టీఎంసీలు కూడా వాడలేదు. ఇంతకంటే సిగ్గుచేటు మరొకటి లేదు'' అంటూ సీఎం రేవంత్ పై విరుచుకుపడ్డారు కేటీఆర్.

#KTR#Drought#Telangana#Cm Revanth Reddy#Swechaa News
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి