Tollywood: బ్యానర్‌కి ఒక దర్శకుడు..ఇదే సేఫ్ గేమ్! అవును..కొంతమంది స్టార్ డైరెక్టర్స్..తమ స్నేహితులను నిర్మాణ రంగంలోకి తీసుకువచ్చి కొత్త బ్యానర్‌ను స్థాపించి వాళ్ళకే సినిమాలను చేస్తున్నారు. ప్రభాస్ తన స్నేహితుల కోసం యూవీ క్రియేషన్స్ ప్రారంభించాడు. ఇందులో, ప్రభాస్ మాత్రమే కాదు, మిగతా దర్శకులతోనూ, హీరోలతోనూ సినిమాలను చేస్తున్నారు. యూవీ క్రియేషన్స్‌కి టాలీవుడ్‌లో మంచి బేస్ ఏర్పడింది. అలాగే, చాలా సంస్థలు కలిసి సినిమాలను అందిస్తున్నారు.
త్రివిక్రమ్ @ హారిక అండ్ హాసిని, సితార:
మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన అత్యంత సన్నిహితుడు ఎస్.రాధాకృష్ణతో హారిక అండ్ హాసిని క్రియేషన్స్ సంస్థను పెట్టించి ఆయనకి సినిమాలను చేస్తున్నాడు. లేటెస్ట్ మూవీ ఆదర్శకుటుంబం కూడా ఈ సంస్థ నుంచే వస్తోంది. అలాగే, రాధాకృష్ణ అన్న కొడుకు సూర్య దేవర నాగవంశీతో సితార ఎంటర్‌టైన్మెంట్స్ ద్వారా భారీ చిత్రాలతో పాటు మీడియం బడ్జెట్ చిత్రాలను నిర్మిస్తున్నారు. విశేషం ఏమిటంటే ఈ రెండు సంస్థలు త్రివిక్రమ్ తో సినిమాలను నిర్మించడమే కాదు, ఆయన సొంత నిర్మాణ సంస్థ ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్‌తో కలిసి కూడా సినిమాలను నిర్మిస్తున్నారు.
సుకుమార్‌కి మైత్రీతో ప్రత్యేకమైన అనుబంధం:
దర్శకుడు సుకుమార్ అంటే మైత్రీ మూవీ మేకర్స్ నుంచి వచ్చే సినిమాకి దర్శకుడిగానో తన సొంత బ్యానర్ సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి సినిమాని నిర్మించడమో జరుగుతున్నాయి. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు కూడా మైత్రీకే సినిమాలు చేస్తున్నాడు. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి మైత్రీ వారు చిన్న, మీడియం బడ్జెట్ సినిమాలను అందిస్తున్నారు. అలాగే, కొరటాల శివ కూడా. తన రెండవ సినిమా శ్రీమంతుడు చిత్రంతో మైత్రీ వారు నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. కొరటాలకి ఈ సంస్థతో ప్రత్యేకమైన అనుబంధం ఉంది.
దిల్ రాజు అండదండలతో వంశీపైడిపల్లి కూడా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా పేరు సంపాదించుకున్నాడు. వంశీ ముందు నుంచి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌లో ప్రయాణం చేస్తూ వస్తున్నాడు. అలాగే, వేణు శ్రీరామ్ కూడా. ఇలా, చాలామంది దర్శకులు కొన్ని నిర్మాణ సంస్థలతో కలిసి ప్రయాణం చేస్తున్నారు. ఒక సినిమా ఫ్లాపైనా కూడా వీరికి ఆ సంస్థ అండగా నిలిచి ఇంకో అవకాశం ఇస్తోంది. ఇక, అన్నపూర్ణ నుంచి ఎప్పుడు కూడా టాలెంటెడ్ డైరెక్టర్స్ బయటకు వస్తుంటారు. గీతా ఆర్ట్స్, సురేష్ ప్రొడక్షన్స్ నుంచి కూడా అంతే జరుగుతోంది.


