సినిమా

Bhogi: శర్వానంద్‌కి సోలో డేట్ దొరకలేదు పాపం!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Bhogi: చిన్న సినిమా సక్సెస్ కూడా పెద్ద సినిమా మీద కొన్నిసార్లు గట్టిగానే ప్రభావం చూపిస్తుంది. అందుకే, మన సీనియర్ నిర్మాతలైన సురేష్ బాబు, అల్లు అరవింద్, నాగార్జున కనీసం సినిమా సినిమాకి మధ్య రెండు వారాలైనా గ్యాప్ ఉండాలని చెప్తుంటారు. దానివల్ల, థియేటర్స్ పుష్కలంగా దొరుకుతాయి. సినిమా బావుంటే మంచి కలెక్షన్స్ వచ్చి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉంటారు.

Bhogi: చిన్న సినిమా సక్సెస్ కూడా పెద్ద సినిమా మీద కొన్నిసార్లు గట్టిగానే ప్రభావం చూపిస్తుంది. అందుకే, మన సీనియర్ నిర్మాతలైన సురేష్ బాబు, అల్లు అరవింద్, నాగార్జున కనీసం సినిమా సినిమాకి మధ్య రెండు వారాలైనా గ్యాప్ ఉండాలని చెప్తుంటారు. దానివల్ల, థియేటర్స్ పుష్కలంగా దొరుకుతాయి. సినిమా బావుంటే మంచి కలెక్షన్స్ వచ్చి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్స్ హ్యాపీగా ఉంటారు. కానీ, అలా జరగడం లేదు. ఇప్పుడు, మన చార్మింగ్ స్టార్ శర్వానంద్ సినిమా భోగి కి కూడా గట్టి పోటీ నెలకొంది.

ఈ ఏడాది వరుసగా నారి నారి నడుమ మురారి, బైకర్ సినిమాలతో డీసెంట్ హిట్స్ అందుకున్న శర్వానంద్ మూడవ సినిమా భోగితో రాబోతున్నాడు. ఖచ్చితంగా, ఈ ఏడాది హ్యాట్రిక్ కొట్టబోతున్నామని చాలా నమ్మకంగా విజయవాడలో జరిగిన ఈవెంట్‌లో చెప్పాడు శర్వా. దీంతో, ప్రేక్షకుల్లో..ఇండస్ట్రీ వర్గాలలో భోగి సినిమాపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఇప్పటి వరకూ ఈ మూవీ నుంచి వచ్చిన శర్వా, అనుపమ, డింపుల్ హయాతిల లుక్స్, సాంగ్స్ బాగా బజ్ క్రియేట్ చేశాయి.

భోగి కి సోలో డేట్ లేదా!

సంపత్ నంది దర్శకుడిగా ఈ మధ్య కాలంలో ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయాడు. దీంతో, మంచి కసితో భోగి చిత్రాన్ని తీస్తున్నాడు. ఫిల్మ్ నగర్ నుంచి అందుతున్న సమాచారం మేరకు అద్భుతమైన కథ-కథనాలతో భోగి చిత్రాన్ని తెరకెక్కించాడు సంపత్ నంది. కథ గమనం ఎంతో ఆసక్తికరంగా సాగుతుందట. ఇంట్రవెల్ అండ్ క్లైమాక్స్ ముందు వచ్చే ట్విస్టులతో థియేటర్స్‌లో ఆడియన్స్ ఉళిక్కిపడతారని తెలుస్తోంది. హీరోయిన్స్ అనుపమ, డింపుల్ పాత్రలు మేజర్ ప్లస్ కానున్నాయని అర్థమవుతోంది. అయితే, భోగి చిత్రానికి మాత్రం పోటీ గట్టిగానే ఉంది. సోలో డేట్ మాత్రం దొరకలేదు.

భోగికి ఆరు సినిమాలతో పోటీ:

సంపత్ నంది, శర్వానంద్ కాంబినేషన్‌లో రాబోతున్న భోగి సినిమాకి మొత్తం ఆరు సినిమాలు పోటీగా రాబోతున్నాయి. భోగి సినిమా నవంబర్ 12న రిలీజ్ కాబోతుండగా..ఒకరోజు తేడాతో సుడిగాలి సుధీర్ నటించిన గోట్ సినిమా విడుదలవుతోంది. ఇక, ఇదే నవంబర్ 13న దొంగ నాకొడుకు, చంద్రయాన్, డార్క్ చాక్లెట్, టాల్కమ్ పౌడర్, రోమియో జూలియెట్ చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. కానీ, ఈ సినిమాలన్నీ భోగి ముందు నిలబడం కాస్త కష్టమే.

#Bhogi Movie#Sharwanand#Sampath Nandi#Anupama Parameshwaran#Dimple Hayathi#Tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి