International

ఎప్‌స్టీన్ ఒక పిచ్చివాడు.. 20 ఏళ్ల క్రితమే క్లబ్ నుంచి గెంటేశా: ట్రంప్

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

అమెరికాలో అత్యంత వివాదాస్పదంగా మారిన కుబేరుడు, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎట్టకేలకు బహిరంగంగా స్పందించారు.

అమెరికాలో అత్యంత వివాదాస్పదంగా మారిన కుబేరుడు, లైంగిక నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్ (Jeffrey Epstein) వ్యవహారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ఎట్టకేలకు బహిరంగంగా స్పందించారు. నవంబర్ 3న జరగబోయే అమెరికా మధ్యంతర ఎన్నికల (US Midterm Elections) ప్రచారంలో భాగంగా ఒహియో రాష్ట్రంలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో ట్రంప్‌కు విచిత్రమైన పరిస్థితి ఎదురైంది. సభ జరుగుతుండగా ఒక నిరసనకారుడు ఎప్‌స్టీన్‌తో ట్రంప్‌కు ఉన్న పాత సంబంధాల గురించి బిగ్గరగా నినాదాలు చేస్తూ ప్రశ్నించడంతో ట్రంప్ తనదైన శైలిలో ఘాటుగా స్పందించారు.

 ఎప్‌స్టీన్ వ్యవహారంలో తనకేమీ సంబంధం లేదని స్పష్టం చేస్తూ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "ఎప్‌స్టీన్ ఒక పిచ్చివాడని (Whack job) భావించి, అతడి చెడు ప్రవర్తన నచ్చకపోవడంతో సుమారు 20 ఏళ్ల క్రితమే ఫ్లోరిడాలోని నా మార్-ఎ-లాగో క్లబ్ నుంచి బయటకు గెంటేసాను" అని వెల్లడించారు. ఆనాడు తాను చేసిన పని చాలా గొప్పదని, ఎప్‌స్టీన్ ఎక్కువగా డెమోక్రాట్ నాయకులతోనే సత్సంబంధాలు కలిగి ఉన్నాడని చెప్పారు. ఈ కేసులో తాను పూర్తిగా నిర్దోషినని (Exonerated), ఉద్దేశపూర్వకంగానే డెమోక్రాట్ల నుంచి డబ్బులు తీసుకుని కొందరు నిరసనకారులు తన సభల్లో రసాభాస సృష్టిస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు.

 ఇదిలా ఉండగా, అదే ఎన్నికల ప్రచార సభలో ఒహియో సెనేటర్ అభ్యర్థి జాన్ హస్టెడ్ (Jon Husted) శరీరాకృతి, దేహధార్డ్యం గురించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. గతంలో కాలేజ్ స్థాయిలో ఫుట్‌బాల్ క్రీడాకారుడిగా రాణించిన హస్టెడ్ భుజాలు ఉక్కులా చాలా బలంగా ఉన్నాయంటూ ఆయన శారీరక సౌష్టవాన్ని వర్ణించారు. కీలకమైన మధ్యంతర ఎన్నికల సమయంలో అభ్యర్థి హామీలు, విధానాల కంటే ఆయన శరీర ఆకృతి గురించి మాట్లాడటం స్థానిక మీడియా దృష్టిని ఆకర్షించింది.

 అమెరికా వ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా జరుగుతోన్న ఈ మధ్యంతర ఎన్నికల ప్రచారంలో ట్రంప్ నిర్వహిస్తున్న సభలకు డెమోక్రాట్ల నిరసనల సెగ తగులుతోంది. సభలకు ఆటంకం కలిగిస్తున్న వారిని 'బలహీనమైన, అనారోగ్యకరమైన వ్యక్తులు'గా అభివర్ణించిన ట్రంప్, ఎప్‌స్టీన్ అంశంపై క్లారిటీ ఇవ్వడం ద్వారా డెమోక్రాట్ల ఆరోపణలను తిప్పికొట్టే ప్రయత్నం చేశారు.

 

#DonaldTrumpEpstein#USMidterms2026#TrumpOhioRally#JeffreyEpsteinControversy#JonHustedOhio#TrumpCommentsTelugu#USPoliticsTelugu#WorldNewsTelugu
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి