2027 దీపావళి పండుగకి టాలీవుడ్ అంత కలర్‌ఫుల్‌గా కనిపించదా..అంటే అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే, ఈ దీపావళికి ఒక్కటి కూడా స్ట్రైట్ సినిమా రావడం లేదు. మన స్టార్ హీరోల సినిమాలు కనీసం రెండు రిలీజైనా కూడా, ఆ సౌండ్ ఇంకోలా ఉంటుంది. కానీ, ఈ దీపావళి కాంతులంతా కోలీవుడ్ సినిమాలదే అనిపిస్తోంది. అలాగే, బాలీవుడ్‌లో రూపొందిన రామాయణ చిత్రానిది. పరభాషా చిత్రాల మధ్యే గట్టి పోటీ నెలకొంది.
దీపావళికి రామాయణ పార్ట్ 1:
బాలీవుడ్ దర్శక దిగ్గజం నితీష్ తివారి ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందించిన రామాయణ ఫ్రాంఛైజీస్ నుంచి ఫస్ట్ పార్ట్ ఈ దీపావళి పండుగ సందర్భంగా రిలీజ్ కాబోతోంది. ఇంకో బాగం 2027 దీపావళికి రానుంది. దాదాపు, 4000 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోన్న రామాయణ మూవీలో రాముడిగా రణ్‌బీర్ కపూర్..సీత పాత్రలో సాయి పల్లవి నటించారు. మండోదరిగా కాజల్, రావణ్ పాత్రలో యష్..శూర్పణఖ పాత్రలో రకుల్ నటిస్తునారు. ఇంతటి భారీ కాన్వాయిస్‌తో వస్తోన్న రామాయణ మీద భారీ అంచనాలున్నాయి.
సూర్య 'సీన్' చూపించడానికి రెడీ:
ఈ ఏడాది ఇప్పటికే, కురుప్పు..విశ్వనాథ్ అండ్ సన్స్ చిత్రాలతో భారీ సక్సెస్‌లు అందుకున్న కోలీవుడ్ స్టార్ హీరో సూర్య..మూడవ సినిమా 'సీన్'తో రాబోతున్నాడు. వాస్తవానికి సూర్యకి ఇంతకముందు ఎక్కువ క్రేజ్ కోలీవుడ్‌లోనే ఉండేది. కానీ, ఇక్కడ స్ట్రైట్ సినిమాలను చేస్తూ మంచి ఆదరణను దక్కించుకున్నాడు. పైగా గత చిత్రం విశ్వనాథ్ అండ్ సన్స్ తెలుగు దర్శక నిర్మాతలు రూపొంచి సక్సెస్ ఇచ్చారు. కాబట్టి, 'సీన్' సినిమాపై మన టాలీవుడ్‌లోనూ మంచి అంచనాలున్నాయి.
నయన్ 'మూకుత్తి అమ్మన్ 2'పై భారీ అంచనాలు:
సుందర్ సి దర్శకత్వంలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించిన 'మూకుత్తి అమ్మన్ 2' కూడా దీపావళి బరిలో దిగుతోంది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. మొదటి భాగం సూపర్ హిట్ కావడమే దీనికి కారణం. నయన్‌కి సౌత్ అండ్ నార్త్‌లలో విపరీతమైన క్రేజ్ అండ్ మార్కెట్ ఉంది. కాబట్టి, సూర్య సినిమాకి నయన్ గట్టి పోటీ ఇవ్వడం ఖాయం.
అయితే, సూర్య 'సీన్'..నయన్ 'మూకుత్తి అమ్మన్ 2', 'రామాయణ' సినిమాలపై మాత్రం ఖచ్చితంగా రజినీకాంత్ 'జైలర్ 2' ఎఫెక్ట్ ఉంటుంది. ఇంకా, ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద జోరుగా ప్రదర్శింపబడుతోంది. ఏమాత్రం పై మూడు సినిమాల ఫలితం తేడా కొట్టినా, మళ్ళీ జైలర్ పుంజుకోవడం గ్యారెంటీ. ఏదేమైనా ఈ దీపావళి మన టాలీవుడ్ నుంచి ఒక్క సినిమా కూడా రాకపోవడం కాస్త డిసప్పాయింట్ అవ్వాల్సిన విషయమే.


