National

PM Kisan: పీఎం కిసాన్ 24వ విడత నిధులపై కీలక అప్‌డేట్ ఇచ్చిన కేంద్రం!..

రచన: Venu•••4 నిమిషాల పఠనం

దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన తీపికబురును కేంద్ర ప్రభుత్వం అందించింది.

దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన తీపికబురును కేంద్ర ప్రభుత్వం అందించింది. 24వ విడత కింద రైతుల ఖాతాల్లోకి నిధులు విడుదల చేయడానికి సిద్దమైనట్టు పేర్కొంది. ఈ క్రమంలో గుజరాత్‌లోని బనాస్‌కంఠ జిల్లాలో అక్టోబర్ 30న జరిగే జాతీయ స్థాయి కార్యక్రమంలో ఈ నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విడుదల చేయనున్నట్లు సమాచారం..

కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో దేశవ్యాప్తంగా సుమారు 9 కోట్ల 34 లక్షల మంది రైతు కుటుంబాలకు ఈ విడతలో ప్రయోజనం చేకూరనుంది. మరోవైపు అర్హులైన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లోకి మొత్తం 18 వేల 680 కోట్ల రూపాయలకు పైగా నిధులు నేరుగా జమ కానున్నట్లు సమాచారం. ఇక అర్హులైన రైతు కుటుంబాలకు కేంద్ర ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం ద్వారా ఏడాదికి 6 వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తోంది.

ఇందులో భాగంగా నాలుగు నెలలకు ఒకసారి 2 వేల రూపాయల చొప్పున మూడు విడతల్లో ఈ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోంది.. ఈ డబ్బులు మీ ఖాతాలో జమ అయ్యాయో లేదో తెలుసుకోవడం కోసం.. రైతులు పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌లోకి వెళ్లి Know Your Status ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ రిజిస్ట్రేషన్ నంబర్, అవసరమైన వివరాలు నమోదు చేసి, ఓటీపీ ఎంటర్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు..

ఇదేకాకుండా మీ దరఖాస్తు పరిశీలనలో ఉండటం, భూమి రికార్డుల ధ్రువీకరణ పూర్తికాకపోవడం, ఈ-కేవైసీ పెండింగ్‌లో ఉండటం వంటి కారణాలతో నిధుల జమలో ఆలస్యం జరగవచ్చు. స్టేటస్‌లో Withheld లేదా Under Verification అని కనిపిస్తే, సంబంధిత వ్యవసాయ అధికారులను లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించాలి. అవసరమైన పత్రాలు, వివరాల్లో తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవాలి.

మరోవైపు ఈ పథకానికి అర్హత విషయంలోనూ కొన్ని నిబంధనలు ఉన్నాయి. సాగుభూమి కలిగి ఉండటంతోపాటు కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన అర్హత ప్రమాణాలను పాటించాలి. ఆదాయపు పన్ను చెల్లించే వారు, నిర్దిష్ట ప్రభుత్వ పదవుల్లో ఉన్నవారు, నిబంధనల ప్రకారం అర్హత లేని పెన్షనర్లు ఈ పథకం ప్రయోజనం పొందలేరు. కుటుంబంలో భార్యాభర్తలిద్దరూ వేర్వేరుగా లబ్ధి పొందేందుకు కూడా నిబంధనలు అనుమతించవు.

ఇక ఈ పథకానికి కొత్తగా దరఖాస్తు చేసుకోవాలనుకునే రైతులు ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా వివరాలు, భూమి రికార్డులతో అధికారిక పోర్టల్‌ను లేదా సమీపంలోని సీఎస్సీ కేంద్రాన్ని సంప్రదించవచ్చు.

#PM Kisan 24th Installment#PM Kisan Yojana 2026#PM Kisan Payment Status#PM Kisan Latest News#Narendra Modi Farmers Scheme#PM Kisan Beneficiary List#PM Kisan ₹2000 Update#Farmer Scheme India#PM Kisan eKYC#PM Kisan Samman Nidhi
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి