సినిమా

Srikanth Odela: యూటర్న్ తీసుకున్న ఓదెల..ఈసారి చిన్న ప్రేమ కథతో!

రచన: Anshu••4 నిమిషాల పఠనం

శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు ఓ పీరియాడిక్ లవ్ స్టోరీని తయారు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తక్కువ బడ్జెట్‌తో..చిన్న ప్రేమకథను తీసి మళ్ళీ ఇటు ప్రేక్షకులతోనూ అటు ఇండస్ట్రీ వర్గాలతోనూ ప్రశంసలు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడట. కథ నచ్చితే ఈ సినిమాను నాని నిర్మించే అవకాశాలున్నాయి. ఎందుకంటే, ది ప్యారడైజ్ ఈవెంట్‌లో.. "నాని అన్న నన్ను భరించాల్సిందే" అంటూ తనమీదే బాధ్యత పెట్టాడు కాబట్టి.

Srikanth Odela: ఇండస్ట్రీకి కొత్తగా వచ్చిన ఏ దర్శకుడైనా ముందు చిన్న ప్రేమ కథతో ప్రేక్షకులను, నిర్మాతలను, ఇండస్ట్రీ వర్గాలను ఆకట్టుకుంటారు. ఆ తర్వాత, అతని టాలెంట్ నచ్చితే బడా నిర్మాణ సంస్థల నుంచి, స్టార్ హీరోల నుంచి పిలుపు, అడ్వాన్సులు వస్తుంటాయి. ఇలా, అంచలంచెలుగా ఎదిగిన దర్శకులు చాలాకాలం ఇండస్ట్రీలో కొనసాగారు. కొందరు మాత్రం ఒకటి, రెండు సినిమాల తర్వాత మెగా ఫోన్‌కి దూరమయ్యారు. ఇప్పుడు, యంగ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పరిస్థితి ఇలాగే ఉందా..!

మొదటి సినిమాతోనే 100 కోట్ల క్లబ్‌లో చేరాడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల. నానికి కథ చెప్పి ఒప్పించడమే కాదు, డెమో షూట్‌లో రెండు సన్నివేశాలను కూడా తీసి మెప్పించాడు. అలా, దసరా చిత్రంతో ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయమయ్యాడు శ్రీకాంత్ ఓదెల. కీర్తి సురేష్‌నే హీరోయిన్‌గా కాదనుకున్న మొండివాడు. చివరికి, ఆమెతోనే ప్రయాణం చేస్తున్నాడు. దసరా మూవీలో హీరోయిన్‌గా, ది ప్యారడైజ్ మూవీలో స్పెషల్ సాంగ్‌లో నటించి ఆకట్టుకోవడమే కాదు, శ్రీకాంత్ అంటే ప్రత్యేకమైన అభిమానం ఏర్పరచుకుంది.

ఇదంతా, బాగానే ఉంది గానీ, ఇప్పుడు దర్శకుడు శ్రీకాంత్ ఓదెల పరిస్థితి ది ప్యారడైజ్ ఫ్లాప్ తర్వాత ఏంటీ? అనేది ఆసక్తికరమైన చర్చగా మారింది. వాస్తవానికి, ఈ సినిమా హిట్ అయి ఉంటే, వెంటనే చిరంజీవితో ప్రాజెక్ట్ పట్టాలెక్కేది. కానీ, ది ప్యారడైజ్ ఫలితంతో ప్రస్తుతానికి ఓదెల-చిరు సినిమా హోల్డ్ చేశారు. దీంతో, కొత్తగా మళ్ళీ నిరూపించుకునే ప్రయత్నాలను శ్రీకాంత్ ఓదెల చేస్తున్నట్టుగా తాజా వార్త ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

వరుసగా రెండు భారీ చిత్రాలు తీస్తే ఒకటి హిట్ ఇంకోటి ఫ్లాప్‌గా మిగిలింది. అంతేకాదు, మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేయాల్సి వచ్చింది. అందుకే, శ్రీకాంత్ ఓదెల ఇప్పుడు ఓ పీరియాడిక్ లవ్ స్టోరీని తయారు చేసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. తక్కువ బడ్జెట్‌తో..చిన్న ప్రేమకథను తీసి మళ్ళీ ఇటు ప్రేక్షకులతోనూ అటు ఇండస్ట్రీ వర్గాలతోనూ ప్రశంసలు దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నాడట. కథ నచ్చితే ఈ సినిమాను నాని నిర్మించే అవకాశాలున్నాయి. ఎందుకంటే, ది ప్యారడైజ్ ఈవెంట్‌లో.. "నాని అన్న నన్ను భరించాల్సిందే" అంటూ తనమీదే బాధ్యత పెట్టాడు కాబట్టి.

#Srikanth Odela#Nani#The Paradise#Tollywood#Srikanth Odela Next Movie
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి