*అనుచరుల ఆర్ధిక బాగుపై ఉన్న శ్రద్ధ ఓట్లు వేసిన ప్రజలపై లేకపాయే!
* పడకేస్తున్న పాలనను చూస్తే జాలేస్తోంది?
- ఏపీలో 3 రోజుల్లో తుఫాన్‌కు అలర్ట్ అయిన పనితీరు
- తెలంగాణలో 6 నెలల క్రితమే కరవు అని చెప్పినా మీ టీమ్ ఏం చేసింది?
- తప్పు చేస్తే అనుచరులను తిట్టుడు తప్ప మీకేమైనా అర్ధం అవుతుందా?
- ఎక్కడికంటే అక్కడికి తిరిగితేనే సీఎం పని ఆరోజు గడిచినట్లా?
- మీరు చెప్పుకునే గురువు దగ్గర నుంచైనా పాలన నేర్చుకోండి
- తెలంగాణను అవినీతి, అక్రమాల నుంచి కాపాడండి
- వేడుకోవడం కాదు.. డిమాండ్ చేస్తున్నాం
- ఇలానే మీరు, మీ టీం డబ్బుల కోసమే అంటే స్వేచ్ఛగా 6 నెలల్లో ఏం జరగుద్దో కౌంట్‌డౌన్ స్టార్ట్ చేద్దాం?
- మీకోసం మీ చిల్లర గాళ్లు ఆలోచించడం లేదు.. దోపిడీ దొంగల్లా తయారయ్యారు?
- వాళ్ల కోసం మీరు అధికారులకు చెప్పిన చెత్త మాటలే పునాదులు!
- అదే ప్రజల కోసం పాలనలో ఎందుకు స్ట్రిక్ట్‌గా చెప్పడం లేదు?
- పాలన కంటే పనోళ్లకే ఎక్కువ ప్రయారిటీ అంటే ఏంటో పేర్లతో పాటు జరిగిన సంభాషణపై స్వేచ్ఛ న్యూస్ ప్రత్యేక కథనం
దేవేందర్ రెడ్డి చింతకుంట్ల
9848070809
స్వేచ్ఛ న్యూస్ చైర్మన్
ముఖ్యమంత్రి మాట అంటే అధికారులకు దిశానిర్దేశం. అదే మన తెలంగాణ రెండో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఏం చెబుతారంటే, ‘‘మా ఏవీ రెడ్డి చెబుతాడు ఆ పని చేయండి. మా అన్న ముఖ్యం, ఆయన చెప్పినట్లు వినండి. నాకు ఉదయ్ చాలా కావాల్సిన వ్యక్తి. ఈ శాఖ మొత్తం అతను చెప్పినట్లు చేయాలి. జానారెడ్డి కొడుకులు మనం ఆటలు నేర్పించి ఆడించినం. ఏ టెండర్ ఎలాగైనా ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వాళ్లకే అన్నట్లు, సిటీ అంటేనే ముస్లింలు వాళ్లను మా ఫయిం ఖరేషీ చూసుకుంటాడు. అతను చెప్పింది సిటీ అడ్మినిస్ట్రేషన్ మొత్తం వినాలి. ఓఆర్ఆర్ లోపల ఎకరం 200 కోట్లు ఉన్న భూముల్లో ఆంధ్రావాళ్లు వాటాలు ఎక్కువగా ఇస్తారు. ఆనాడు వాళ్లు ఏం చేసినా, ఏ పార్టీ అయినా పట్టించుకోకుండా ఎంత వందల కోట్లు ఇస్తారో అది ఉదయ్‌కి చెప్పమను. పోలీస్ శాఖలో అక్రమాలు జరుగుతున్నాయా? అరె మనకు ఏసీబీ ఉంది. వాళ్లు చూసుకుంటారు. వాళ్లకు స్ట్రిక్ట్‌గా చెప్పాను. మిగితా శాంతి భద్రతలు మా ఫయింకి తెలుసు. ఇంకా ఏం శాఖలు ఉన్నాయి. రెవెన్యూ పొంగులేటి హెల్ప్ ఎప్పుడు మర్చిపోలేం. ఎన్నో చేశారు. ఇప్పుడు చేసుకుంటే తప్పేంటి? వాళ్లు చేసుకోలేదా? మేము చేసుకుంటే తప్పా? ధరణి ఏంటో మాకు తెలుసు. మేము బట్టలు విప్పుతాం. అడిగితే కడిగేస్తాం. ఇంకా ఏ డిపార్ట్‌మెంట్‌లో పని కావాలన్నా మనకు హెల్ప్ చేసిన టీం ఉంది. వాళ్లకు పనులు చేయాలి. సంపాదించుకోవాలి. ఎవరూ ఆంధ్రజ్యోతి ఆయనకు చెప్పాల్సిన అవసరం లేదు. ఆ లక్షణాలు వాళ్ల అన్న కొడుకు వంశీకి ఉన్నాయి. ఆల్రడీ 500 వరకు చేసుకున్నాడు. ఆయిన ఎప్పుడంటే అప్పుడు హెల్ప్ చేయండి. తమ్ముడు కొండల్ రియల్ ఎస్టేట్‌లో ఉన్న లొసుగులు, పొజిషన్ లేకుంటే వందల మందిని పెట్టి పొజిషన్ తీసుకోవడం. కృష్ణారెడ్డి బిజినెస్‌మెన్. అతనికి ప్రింటింగ్ ప్రెస్ ఉంది. సౌమ్ముడు. ఏది నచ్చినా నా వద్దకు రాడు. ఎవరి వద్దకు వచ్చినా కాదనొద్దు’’ ఇవన్నీ ఒక సీఎంగా చాలామంది ముందు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలు. అధికారుల ముందు చేసే దిశానిర్దేశాలు. వీటికి ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు ఎస్ సార్ అంటూ తలలు ఊపుతున్నారు. పనులు కూడా అలానే చేస్తున్నారు.
అసలు సమస్య ఎక్కడంటే?
అయ్యా రేవంత్.. కేసీఆర్ మొదట 5 ఏండ్లు తెలంగాణ ప్రజలకు కావాల్సిన ఎన్నో వ్యవస్థలను బలోపేతం చేశారు. రోడ్లు, నీళ్లు, చెరువులు, పోలీసింగ్, రెవెన్యూ, విద్యుత్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలా వ్యవస్థలను గాడిలో పెట్టారు. ముఖ్యంగా ఆంధ్రా పెత్తనంపై పైచేయి సాధించారు. మరోసారి అధికారంలోకి రాగానే మీలాగే అనేక మందికి హెల్ప్ చేయాలనే ఉద్దేశంతో సొంత మనుషులకు మాత్రమే వందల కోట్ల హెల్స్ చేశారు. ఆయన పాలనలో ఆనాటి మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు, ఈటల, తుమ్మల, గంగుల ఇలా చెప్పుకుంటూ పోతే రాజకీయం కోసం ఎవరినైనా వదిలేశారు. ఫోన్ చేసి ‘‘పని చేయ్’’ అని మీలానే చెప్పారు. వందల మంది బీఆర్ఎస్ నేతలు వందల కోట్లు సంపాదించారు. 2018 వరకు ఎన్ని ఆస్తులు ఉన్నాయో తెలియదు కాని 2022 వరకే వేల కోట్లలోకి వెళ్లిపోయారు. అవ్వన్నీ ఆధారాలతో ఆనాటి నుంచి ఫైట్ చేశాం. తెర ముందు తీన్మార్ మల్లీ, తొలివెలుగు రఘు, మరో అచ్చిగాడు బుచ్చిగాడు ఉండొచ్చు. కానీ, వ్యుహాలు రచించింది ఎవరో తెలుసు. ఎవరూ దిక్కు లేరని మిమ్మల్ని ఎన్నుకుంటే మీరు, మీ అనుచరుల కోసం వేల కోట్ల ప్రభుత్వ అస్తులను, లక్షల కోట్ల ప్రభుత్వ భూములను అప్పగిస్తుంటే ఎలా ఊరుకుంటాం. మీ వరెస్ట్ పాలనను ఎండగట్టడం చాలా చిన్న పని. కానీ, ఎందుకు ఆగామంటే ఇకనైనా పాలనలో పట్టు సాధిస్తారేమో అని ఒక్క చిన్న ఆలోచన. కానీ మీ కాంగ్రెస్ పార్టీ రాజకీయ పాలనే కోరుకుంటున్నారు. ప్రజలు అలానే ఆశీర్వదీస్తారు. ఇలాగే వ్యవహరిస్తే సీఎం అయినా సరే నువ్వే అంటూ సంబోధిస్తూ నువ్వా, వాడా, వీడా అనే పదాలతో తెలంగాణ మాడలీకంలో సమాధానం అక్షరాల రూపంలో వస్తూనే ఉంటుంది. మీ పాలనలో ఏ పని వాళ్లు వాళ్ల బాధ్యతతో చేశారని అనుకున్నారో ఒక్కటి చెప్పండి. జేబులో డబ్బులు లేకపోతే ఆత్మహత్య చేసుకునేలా పాలన కొనసాగుతోంది. కాదంటారా?
అక్కడ వర్ష బీభత్సం.. ఇక్కడ కరువు ఎందుకు?
ఆంధ్రాలో తుఫాన్ భీభత్సం సృష్టించింది. చెరువులు, వాగులు జలకళసంతరించుకున్నాయి. కానీ, తెలంగాణలో జనం నీళ్ల కోసం అల్లాడిపోతున్నారు. కరువు అనేది దశాబ్దాల నుంచి ముందే హెచ్చరించేది. పెను తుఫాన్‌లు వారం ముందే తెలుస్తాయి. ప్రభుత్వాలు పసి గట్టి అలర్ట్ అవ్వాలి. కానీ, మీ నిద్రమత్తు కమీషన్స్ పాలనలో కరువుకు కారణం ఆనాటి పాలన అంటూ వదిలించుకోవాలనుకుంటున్నారు. మీ వద్ద 130 మంది ఐఏఎస్‌లు, 120 మంది ఐపీఎస్‌లు వాళ్ల కింద లక్షల మంది ఉద్యోగులు ఉన్నా మీరు కరువుపై ఏనాడూ ఆదేశించలేదు. మీ పైరవీకారుల గురించే చెప్పారు. అందుకే ఈనాడు ఇంతగా తెలంగాణ ప్రజలు ఆలోచించాల్సి వస్తోంది. ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కూడా తెర వెనుక ఆయన టీం చేసిన దందాలు ఎంటో ఎవ్వరు నోరుతో చెప్పితే ప్రజలకు అర్ధం అవుతుందో వాళ్లతో చెప్పించాం. ఇక నుంచి మీ పాలనపై అందరూ నేరుగా ఫైట్ చేయడానికి సిద్ధమయ్యారు. అందరి వద్ద మీ పని తీరు, మీ మాట తీరు, మీ తిట్లు ఉన్నాయి. మీరు పాలనను మీ గురువైన చంద్రబాబు నుంచైనా నేర్చుకోండి. మీరు ఏం తప్పు చేయలేదని అనుకుంటూ సీఎం కూర్చీలో కూర్చుని ఉంటానంటే నడవడు. మరో లాల్ ప్రసాద్ యాదవ్, మమతా బెనర్జీలా కావొద్దు. మరో జయలలిత, కరుణానిధిలా, రాజశేఖర్, చంద్రబాబులా ఉండాలనుకుంటే తీరు మార్చుకోండి. లేదంటే ప్రజా సంఘాలు 6 నెలల్లో జెన్ జీ కంటే ఎక్కువ ఉద్యమం తీసుకొస్తాయి. ప్రాథమిక తప్పులు చేయకండని స్వేచ్ఛ న్యూస్ దేవేందర్ రెడ్డి చింతకుంట్ల డిమాండ్ చేస్తున్నారు.


