సినిమా

Tollywood: తండేల్ సక్సెస్ ఇంకా వృష కర్మపై ఉందా..ఏ రకంగా?

రచన: Anshu••4 నిమిషాల పఠనం

Tollywood: మన టాలీవుడ్ హీరోలలో అక్కినేని వారే బాగా స్లోగా సినిమాలను చేస్తూ వస్తున్నారు. అక్కినేని నాగ చైతన్య మరీ సెలెక్టెడ్‌గా ఉన్నాడు. తండేల్ లాంటి 100 కోట్ల సినిమా తర్వాత వరుసగా నాలుగైదు ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెట్టకుండా..ఒకే ఒక్క సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఆ సినిమానే వృష కర్మ. ఈ సినిమా నుంచి ఇప్పటి వరకూ పెద్దగా అప్‌డేట్స్ కూడా ఇవ్వలేదు. దీంతో, తండేల్ సక్సెస్ బజ్ ఇంకా కంటిన్యూ ఎలా అవుతుంది..వృష కర్మకి ప్రమోషన్స్ కావాలి కదా..అంటూ మాట్లాడుకుంటున్నారు.

ఎదురు దెబ్బలతో జాగ్రత్తపడుతున్న చైతూ:

కెరీర్ ప్రారంభంలో కొన్ని ఎదురు దెబ్బలు తిన్నాడు నాగ చైతన్య. కొత్త దర్శకుడికి ఛాన్స్ ఇస్తూ చేసిన దడ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ డిజాస్టర్‌గా మిగిలింది. అంతేకాదు, బెజవాడ..ఆటోనగర్ సూర్య..దోచెయ్..యుద్ధం శరణం..సవ్యసాచి లాంటి సినిమాలతో చైతూ చాలా నేర్చుకున్నాడు. ఇక, బాలీవుడ్‌లో ఆమిర్ ఖాన్‌తో కలిసి చేసిన లాల్ సింగ్ చద్ధా కూడా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ సినిమాల అనుభవంతో ఒక్కో సినిమాను చాలా జాగ్రత్తగా ఎంచుకుంటున్నాడు.

శివ నిర్వాణతో మజిలీ, శేఖర్ కమ్ములతో లవ్ స్టోరి, చందు మొండేటితో తండేల్ లాంటి సినిమాలను చేసి భారీ హిట్స్ అందుకున్నాడు. అయితే, ఎప్పుడో 2025లో వచ్చిన తండేల్ సినిమా సక్సెస్ ఇంకా చైతూ కొత్త సినిమాపై ప్రభావం చూపుతుందంటే..అది ముమ్మాటికి తప్పే. కార్తీక్ వర్మ తెరకెక్కిస్తున్న వృష కర్మ సినిమాకంటూ ఖచ్చితంగా సాలీడ్ ప్రమోషన్స్ కావాల్సి ఉంది. కానీ, ఆ ఊపు ఏమాత్రం కనిపించడం లేదు. అసలే, ఈ నవంబర్ అండ్ డిసెంబర్‌లో చాలా సినిమాల రిలీజ్ షెడ్యూల్ ఫిక్సై ఉంది.

పోటీ ఎక్కువగా ఉన్నప్పుడు చిన్న సినిమా అయినా పెద్ద సినిమా అయినా ప్రేక్షకుల్లో ఆసక్తి రేకెత్తించడం చాలా ముఖ్యం. లేదంటే, జనాలకి థియేటర్స్ వరకూ వచ్చి సినిమాను చూడాలన్న ఆసక్తి కలగదు. ఈ విషయంలో ఇప్పటి వరకూ వృష కర్మ మేకర్స్ చాలా స్లోగా ఉన్నారు. డిసెంబర్ 4నే ఈ సినిమాను రిలీజ్ చేస్తామని ప్రకటించారు. మీనాక్షి చౌదరీ హీరోయిన్‌గా నటించింది. ఇప్పటి నుంచైనా సినిమాపై బజ్ క్రియేట్ అయ్యేలా వరుస ఇంటర్వ్యూలు..ప్రమోషనల్ కంటెంట్‌ను వదలడం చేస్తే బావుంటుందనేది సినీ వర్గాల అభిప్రాయం.

#Vrushakarma#naga chiathanya#meenakshi chaudary#karthik varma#thandel#tollywood
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి