Tollywood: కాంబినేషన్ కాదు కథ, హిట్ టాక్ మాత్రమే ముఖ్యం! అవును..ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్‌తో స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కాంబినేషన్‌లో వచ్చిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా మిగిలాయి. కానీ, ఎలాంటి అంచనాలు..క్రేజీ కాంబినేషన్ కాకుండా కూడా కథాబలంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాయి. అందుకే, ఇప్పుడు ఆదర్శకుటుంబం సినిమా గురించి కూడా కాంబినేషన్ కంటే కూడా ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకునే కథే ముఖ్యమని..ఆ ఒక్కటీ సాలీడ్‌గా ఉంటే గ్యారెంటీగా హిట్ అని అంటున్నారు.
త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలలో కొన్ని కేవలం కామెడీ మీదే సక్సెస్ సాధించినవి ఉన్నాయి. కొన్ని సినిమాలలో మాత్రం బలమైన కథ సినిమాను తారా స్థాయిలో నిలబెట్టింది. త్రివిక్రమ్ అంటే మంచి మాటలు..పంచ్ డైలాగ్స్..చక్కటి కామెడీ..బరువైన ఎమోషనల్ సీన్స్‌తో నింపేసి ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తాడు. జులాయి లాంటి సిల్లీ కథ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుందంటే అదీ గురూజీ మాయాజాలం.
గతంలో వెంకటేష్ నటించిన రెండు బ్లాక్ బస్టర్స్ మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్ సినిమాలకి కథ-మాటలందించాడు త్రివిక్రమ్. ఇన్నేళ్ళకి వీళ్ల కాంబినేషన్‌లో ఆదర్శకుటుంబం సినిమా వస్తోంది. అయితే, త్రివిక్రమ్ ఎప్పుడూ..ఏదో ఒక పాపులర్ నవల ఆధారంగానో..పాత సినిమాల కథను తిప్పి, ఇప్పటి జనరేషన్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా సినిమాలు తీసి మెప్పిస్తున్నాడు. త్రివిక్రమ్ అక్కడా ఇక్కడా కథలు కాపీ కొడతాడనే ప్రచారం జరుగుతుంది. ఇప్పుడు, వస్తోన్న ఆదర్శకుటుంబం సినిమాకి అంతే.
బ్లాక్ బస్టర్ అందుకున్న కొరియన్ సినిమా ఆధారంగా ఆదర్శకుటుంబం తీశాడని ఈ మధ్య వార్తలు వినిపిస్తున్నాయి. ఇదంతా, పక్కన పెడితే ఆదర్శకుటుంబం సినిమా సక్సెస్‌కి కావాల్సింది ఫ్యామిలీ ఆడియన్‌ను ఆకట్టుకునే కథ-కథనాలు. ఇప్పటి వరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తో మంచి అంచనాలను పెంచేశారు. సినిమా రిలీజైయ్యాక ఒక్క షోతో టాక్ గనక హిట్ అని వస్తే..ఎవరూ ఆపలేరు. అలా, కాకుండా కాంబినేషన్ మీద ఆసక్తితో థియేటర్స్ వరకూ వచ్చినా..అందులో సోల్ లేకపోతే ది రాజాసాబ్, టాక్సిక్, అజ్ఞాతవాసి, గుంటూరు కారం లాంటి సినిమాల మాదిరిగా నిరాశపడాల్సి ఉంటుంది.


