తెలంగాణ

TG: స్వేచ్ఛ ఎఫెక్ట్‌.. రూ.300 కోట్ల భూముల్లో ఎమ్మెల్యే దందాపై విజిలెన్స్ ఎంక్వైరీ..!

రచన: Mahesh••5 నిమిషాల పఠనం

TG: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో ఏకంగా రూ.300 కోట్ల విలువైన ప్రొటెక్టెడ్ టెనెన్సీ (పీటీ) భూముల వ్యవహారంపై స్వేచ్ఛ వరుస కథనాలు రాసింది. ఈ భూముల్లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి కుట్రలు చేస్తున్నారని.. వాటిని కొనొద్దని అప్రమత్తం చేసింది.

TG: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో ఏకంగా రూ.300 కోట్ల విలువైన ప్రొటెక్టెడ్ టెనెన్సీ (పీటీ) భూముల వ్యవహారంపై స్వేచ్ఛ వరుస కథనాలు రాసింది. ఈ భూముల్లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి కుట్రలు చేస్తున్నారని.. వాటిని కొనొద్దని అప్రమత్తం చేసింది. స్వేచ్ఛ కథనాలతో విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. దశాబ్దాలుగా రికార్డుల్లో ఉన్న తమ భూములను కొట్టేసేందుకు కొందరు అధికారులు, రియల్ ఎస్టేట్ సంస్థలతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారంటూ బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర విజిలెన్స్ బృందం మహేశ్వరం తహసీల్దార్ ఆఫీస్‌లో విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టడంతో వ్యవహారం ఒక్కసారిగా వేడెక్కింది.

ఎమ్మార్వో రిపోర్టులపై విజిలెన్స్ ఎంక్వైరీ..

తుమ్మలూరు పరిధిలోని సర్వే నంబర్లు 371, 372, 373, 377లలోని 51 ఎకరాల పీటీ భూములపై బాధిత రైతులు గద్దగూటి నరేష్, మహేందర్, శ్రీరాములు, హరికృష్ణ, శాంతమ్మ తదితరులు ఇచ్చిన ఫిర్యాదుతో విజిలెన్స్ అధికారులు నేరుగా రంగంలోకి దిగారు. తహసీల్దార్ కార్యాలయంలోని రికార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేసి, అనంతరం వివాదాస్పద భూములను స్వయంగా పరిశీలించారు. అయితే, గతంలో స్థానిక ఎమ్మార్వో ఇచ్చిన నివేదికలకు, ఇప్పటి రికార్డులకు పొంతన లేకపోవడంతో విజిలెన్స్ ఎంక్వైరీలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే ఒత్తిళ్లతోనే ఎమ్మార్వో పరస్పర విరుద్ధమైన బోగస్ రిపోర్టులు ఇచ్చారని, ఈ నివేదికల వెనుక ఉన్న అధికారులపైనా విచారణ జరపాలని రైతులు పట్టుబడుతున్నారు.

ఎమ్మెల్యే అండతోనే రియల్ మాఫియా దందా

తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తన రాజకీయ పరపతిని ఉపయోగించి రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తెచ్చారని బాధిత రైతులు గద్దగూటి నరేష్, మహేందర్, శ్రీరాములు, హరికృష్ణ, శాంతమ్మ తదితరులు మండిపడ్డారు. జేబీ ఇన్‌ఫ్రా, కాంక్రీట్ ఇన్‌ఫ్రా, భువన్ ఇన్‌ఫ్రా వంటి కంపెనీల ముసుగులో తమ 51 ఎకరాల భూమిని ఆక్రమించి అక్రమంగా లేఅవుట్లకు అనుమతులు ఇప్పించుకున్నారని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పేద రైతులకు అండగా ఉండాల్సిన చట్టాలను తుంగలో తొక్కి తమ పొట్ట కొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆ లేఅవుట్లలో ప్లాట్లు కొంటే నిలువునా మునుగుతారు

ఈ వివాదం ఓ కొలిక్కి వచ్చేంత వరకు సదరు వివాదాస్పద లేఅవుట్లలో ఎవరూ ప్లాట్లు కొనుగోలు చేయవద్దని రైతులు హెచ్చరించారు. వివాదంలో ఉన్న సర్వే నంబర్లలో ప్లాట్లు కొంటే భవిష్యత్తులో తీవ్రంగా మోసపోవాల్సి వస్తుందని ప్రజలను అప్రమత్తం చేశారు. రూ.300 కోట్ల విలువైన ఈ భూములపై సమగ్రంగా విజిలెన్స్ ఎంక్వైరీ జరిపించి, ఎమ్మెల్యే మనోహర్ రెడ్డితో పాటు తప్పుడు నివేదికలు ఇచ్చిన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాయి.

#Telangana#TG News#Rangareddy District#Maheshwaram#Tummalur Lands#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి