తెలంగాణ

మియాపూర్‌లో 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదే- సుప్రీంకోర్టు

Miyapur Lands: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం మియాపూర్ పరిధిలోని సర్వే నెంబర్లు 100, 101 లకు చెందిన భూవివాదంపై సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వం విజయం సాధించింది. ఈ రెండు సర్వే నెంబర్లలోని 550 ఎకరాల భూమి ప్రభుత్వానిదే అంటూ సర్వోన్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. కాగా, కొందరు ప్రైవేట్ వ్యక్తులు ఈ భూమి తమదేనంటూ గతంలో ఆక్రమించే ప్రయత్నం చేశారు. ఈ వ్యవహారంలో ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు ఈ భూమి ప్రభుత్వానికే చెందుతుందని 2003లో తీర్పు ఇచ్చింది.