అభిమానం పేరుతో టార్చర్.. ఫ్లైట్ లో కీర్తి సురేష్ కు చేదు అనుభవం....
Keerthy Suresh: హీరోయిన్లు బయట కనిపిస్తే చాలు.. ఫొటోలు, సెల్ఫీల కోసం ఫ్యాన్స్ వెంటపడటం మామూలే. కానీ కొందరు మాత్రం అభిమానం పేరుతో శృతిమించి ప్రవర్తిస్తూ నరకం చూపిస్తుంటారు. తాజాగా స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్‌కు విమానంలో సరిగ్గా ఇలాంటి చేదు అనుభవమే ఎదురైంది. మద్యం మత్తులో ఉన్న ఓ వ్యక్తి సెల్ఫీ కావాలంటూ ఆమెను విపరీతంగా వేధించాడు. ఈ విషయాన్ని స్వయంగా కీర్తి బయటపెట్టడంతో ఇప్పుడు నెట్టింట తీవ్ర చర్చ నడుస్తోంది.కీర్తి సురేశ్ తన భర్త ఆంటోనితో కలిసి మిలాన్ నుంచి ఇండియాకు ఫ్లైట్‌లో వస్తుండగా ఈ ఘటన జరిగింది. బాగా తాగి తూలుతున్న ఓ ప్రయాణికుడు కీర్తి కూర్చున్న సీటు దగ్గరకు వచ్చాడు. కాళ్లపై నిలబడే సత్తువ కూడా లేకపోయినా.. కీర్తితో ఇప్పుడే సెల్ఫీ దిగాలంటూ మొండిపట్టు పట్టాడు. పరిస్థితి అర్థం చేసుకున్న కీర్తి.. కాసేపు ఆగి తర్వాత తీసుకుందామని చాలా కూల్‌గా చెప్పినా అతగాడు వినిపించుకోలేదు.
