తెలంగాణ
Hyderabad: హైదరాబాద్‌లో బ్రాండెడ్ బియ్యం కొంటున్నారా?.. అయితే మీరు మోసపోయినట్టే!..
ఎల్ నినో ఎఫెక్ట్ పేరుతో ఇప్పటికే భియ్యం ధరలు ఆకాశానికి అంటుతున్నాయి. ఈ సమయంలో కొంత మంది వ్యాపారులు భారీగా అక్రమాలకు తెరలేపుతున్నారు. తాజాగా హైదరాబాద్‌లో భారీ రేషన్ బియ్యం స్కామ్ వెలుగు చూసింది. రేషన్ బియ్యానికి పాలిష్ చేసి బయట మార్కెట్లో అమ్మేస్తున్న మాఫియాగుట్టు రట్టైంది. నగరంలోని కర్మన్‌ఘాట్ ప్రాంతంలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లయ్స్, విజిలెన్స్ దాడులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కర్మన్‌ఘాట్‌లోని పలు రైస్ డిపోల్లో బియ్యం సంచులపై ముద్రించిన తూకానికి, వాస్తవంగా ఉన్న బియ్యం పరిమాణానికి తేడా ఉంటోందనే ఫిర్యాదులతో రంగంలోకి దిగగా ఈ సోదాల్లో షాకింగ్ విషయాలు వెలుగు చూశాయి.
