Karnataka Congress: డీకేకు ఆదిలోనే ఘోర ఓటమి.. కష్టకాలం మొదలయిందా?
Karnataka Congress: మొన్నటివరకు "జ్ఞానేష్.. ఇట్స్ డన్ బ్రో" అంటూ బీజేపీపై విపక్షాలు సెటైర్లు వేస్తే, ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. కర్ణాటకలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌కు బీజేపీ-జేడీఎస్ కూటమి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. శాసన మండలిలో ఖాళీ అయిన నాలుగు టీచర్స్, గ్రాడ్యుయేట్స్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఖాతా కూడా తెరవలేకపోయింది. నాలుగుకి నాలుగు సీట్లను ఎన్డీయే కూటమి గెలుచుకుని 4-0తో క్లీన్ స్వీప్ చేసింది. రిజల్ట్స్ రాగానే బీజేపీ నేతలు సీఎం డీకే శివకుమార్‌ను టార్గెట్ చేస్తూ.. "డీకే.. మీ పని అయిపోయింది బ్రో" అంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి ఒక రేంజ్లో ఆడుకుంటున్నారు.గతంలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అసెంబ్లీలో నిరసన తెలుపుతూ డీకే శివకుమార్ చెవిలో బంతిపూలు పెట్టుకున్న పాత ఫొటోను బీజేపీ బయటకు తీసింది. మండలి ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ నేతల చెవుల్లోనే పూలు పెట్టారంటూ ఎక్స్‌లో దారుణంగా ట్రోల్ చేసింది. ఈ నాలుగు స్థానాల్లో.. గతంలో కాంగ్రెస్ గెలిచిన ఏకైక సిట్టింగ్ సీటును ఈసారి జేడీఎస్ ఎగరేసుకుపోయింది. ఇక మిగిలిన మూడు స్థానాల్లోనూ బీజేపీ తమ సిట్టింగ్ సీట్లను సులభంగా కాపాడుకుని సత్తా చాటింది.
