వైరల్ న్యూస్
UP: తవ్వేకొద్దీ బయటపడ్డ నోట్ల కట్టలు.. 3 బ్లూ డ్రమ్ముల్లో కోట్ల డబ్బు
UP: సినిమాల్లో గుప్తనిధుల కోసం నేల తవ్వితే బంగారు నాణేలు బయటపడటం చూసుంటాం. కానీ ఇక్కడ తవ్వుతున్న కొద్దీ కట్టల కొద్దీ ఐదొందల నోట్లు బయటపడ్డాయి. అది కూడా ఎక్కడో అడవుల్లో కాదు.. ఓ పల్లెటూరి పెంకుటింట్లో. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ సమీపంలో వెలుగుచూసిన ఈ ‘3 బ్లూ డ్రమ్ముల’ కథ ఇప్పుడు ఇంటర్నెట్ను షేక్ చేస్తోంది. భూమిలో దాదాపు 15 అడుగుల లోతున గొయ్యి తీసి.. మూడు పెద్ద ప్లాస్టిక్ డ్రమ్ముల్లో కోట్ల రూపాయల క్యాష్ దాచిపెట్టిన తీరు చూసి పోలీసులే అవాక్కయ్యారు.ప్రయాగ్రాజ్ గంగానగర్ జోన్ పరిధిలోని రామ్నగర్ గ్రామంలో ఇద్దరు అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. ఊళ్లో వాళ్లతో చిన్న గొడవ జరగడంతో, ఈ సోదరుల ఇంట్లో ఏదో పెద్ద తతంగమే నడుస్తోందని పోలీసులకు ఉప్పందింది.
