తెలంగాణ

TG: స్వేచ్ఛ ఎఫెక్ట్‌.. రూ.300 కోట్ల భూముల్లో ఎమ్మెల్యే దందాపై విజిలెన్స్ ఎంక్వైరీ..!

TG: రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం తుమ్మలూరులో ఏకంగా రూ.300 కోట్ల విలువైన ప్రొటెక్టెడ్ టెనెన్సీ (పీటీ) భూముల వ్యవహారంపై స్వేచ్ఛ వరుస కథనాలు రాసింది. ఈ భూముల్లో తాండూరు ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి కుట్రలు చేస్తున్నారని.. వాటిని కొనొద్దని అప్రమత్తం చేసింది. స్వేచ్ఛ కథనాలతో విజిలెన్స్‌ అధికారులు రంగంలోకి దిగారు. దశాబ్దాలుగా రికార్డుల్లో ఉన్న తమ భూములను కొట్టేసేందుకు కొందరు అధికారులు, రియల్ ఎస్టేట్ సంస్థలతో కలిసి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కుట్రలు చేస్తున్నారంటూ బాధిత రైతులు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన రాష్ట్ర విజిలెన్స్ బృందం మహేశ్వరం తహసీల్దార్ ఆఫీస్‌లో విజిలెన్స్ ఎంక్వైరీ చేపట్టడంతో వ్యవహారం ఒక్కసారిగా వేడెక్కింది.