Health

Health: రోజూ నల్ల శనగలు తింటే.. శరీరంలో ఏం జరుగుతుంది?..

రచన: Venu4 నిమిషాల పఠనం

మన వంటింట్లో చవకగా, సులభంగా లభించే పప్పుధాన్యాల్లో నల్ల శనగలకు ప్రత్యేక స్థానం ఉంది. రుచితో పాటు ప్రోటీన్, పీచు, ఐరన్, ఫోలేట్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు వీటిలో లభిస్తాయి.

మన వంటింట్లో చవకగా, సులభంగా లభించే పప్పుధాన్యాల్లో నల్ల శనగలకు ప్రత్యేక స్థానం ఉంది. రుచితో పాటు ప్రోటీన్, పీచు, ఐరన్, ఫోలేట్, ఫాస్ఫరస్ వంటి పోషకాలు వీటిలో లభిస్తాయి. ఆరోగ్య నిపుణులు కూడా పప్పుధాన్యాలను సమతుల ఆహారంలో భాగంగా చేర్చాలని సూచిస్తున్నారు.

మొదటిగా.. రక్తంలో చక్కెర స్థాయిల విషయంలో నల్ల శనగలు ఉపయోగపడే ఆహారాల్లో ఒకటి. శనగల్లో ఫైబర్, నెమ్మదిగా జీర్ణమయ్యే కార్బోహైడ్రేట్లు ఉండటం వల్ల భోజనం తర్వాత రక్తంలో గ్లూకోజ్ ఒక్కసారిగా పెరగకుండా ఉండటానికి సహాయపడవచ్చు. అయితే మధుమేహం ఉన్నవారు మందులకు బదులుగా శనగలను ఉపయోగించకూడదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇక రెండో ప్రయోజనం జీర్ణవ్యవస్థకు సంబంధించినది. శనగల్లోని ఫైబర్ పేగుల కదలికను మెరుగుపరచడంలో, మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. ఇందులోని కొన్ని ఫైబర్ పదార్థాలు పేగుల్లోని ఉపయోగకరమైన బ్యాక్టీరియాకు ఆహారంగా పనిచేస్తాయని నిపుణులు అంటున్నారు.

మూడోది గుండె ఆరోగ్యం. పప్పుధాన్యాల్లోని ఫైబర్ రక్తంలోని LDL అంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో కొంత సహాయపడుతుందని అధ్యయనాలు సూచిస్తున్నాయి. అందుకే శనగలను కూరగాయలు, సంపూర్ణ ధాన్యాలు, గింజలతో కూడిన ఆరోగ్యకరమైన ఆహార విధానంలో చేర్చుకోవడం ప్రయోజనకరంగా ఉండొచ్చు. అయితే శనగలు తింటే గుండెపోటు రాదు అని చెప్పడం మాత్రం శాస్త్రీయంగా సరైనది కాదని పేర్కొంటున్నారు.

ఇక బరువు నియంత్రణలో కూడా ఇవి ఉపయోగపడవచ్చు. ప్రోటీన్, ఫైబర్ కలయిక వల్ల ఎక్కువసేపు కడుపు నిండిన భావన ఉండే అవకాశం ఉంది. దీంతో తరచూ తినాలనే కోరిక తగ్గి, మొత్తం ఆహారం పరిమాణాన్ని నియంత్రించుకోవడానికి సహాయపడవచ్చని ఆరోగ్యనిపుణులు చెబుతున్నారు.

మరోవైపు నల్ల శనగల్లో ఐరన్ కూడా ఉంటుంది. కానీ కేవలం శనగలు తినడం వల్ల రక్తహీనత పూర్తిగా నయమవుతుందని చెప్పలేం. ఐరన్ లోపం ఉన్నవారు వైద్యుల సలహాతో కారణాన్ని గుర్తించి, అవసరమైన చికిత్స తీసుకోవాలని.. అయితే ఎక్కువ మోతాదులో శనగలు తింటే కొంతమందికి గ్యాస్, ఉబ్బరం వంటి సమస్యలు రావచ్చు. కాబట్టి మొదట తక్కువ మోతాదుతో ప్రారంభించి, బాగా నానబెట్టి, ఉడికించి తీసుకోవడం మంచిదని హెల్త్ ఫ్రొఫెషన్స్ సూచిస్తున్నారు.

మొత్తంగా చూస్తే.. నల్ల శనగలు ఏదో ఒక వ్యాధికి మందు కాదు. కానీ ప్రోటీన్, ఫైబర్, ఖనిజాలు అందించే పోషకమైన పప్పుధాన్యం. సరైన మోతాదులో, సమతుల ఆహారంలో భాగంగా తీసుకుంటే ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లకు ఇది మంచి ఎంపిక కావచ్చని నిపుణులు పేర్కొంటున్నారు..

ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..

#Health#Black chickpeas#Iron#Protein#fiber#Bad cholesterol
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి