Spirituality

Spirituality: పురుషులే పిండప్రదానం చేయాలా?..

రచన: Venu4 నిమిషాల పఠనం

సనాతన ధర్మంలో శ్రాద్ధం, తర్పణం, పిండప్రదానాలకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే పిండప్రదానం విషయంలో మహిళలకు అధికారం ఉందా అనే సందేహం చాలాకాలంగా ఉంది.

పితృదేవతలను స్మరించుకోవడం అంటే మనకు జన్మనిచ్చిన వంశపారంపర్యానికి కృతజ్ఞత చెప్పడం. అందుకే సనాతన ధర్మంలో శ్రాద్ధం, తర్పణం, పిండప్రదానాలకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే పిండప్రదానం విషయంలో మహిళలకు అధికారం ఉందా అనే సందేహం చాలాకాలంగా ఉంది. సాధారణంగా పురుషులే ఈ కర్మలను నిర్వహించడం కనిపించడంతో.. మహిళలు చేయకూడదనే భావన ఏర్పడింది.

గరుడ పురాణంలోని కొన్ని సందర్భాల్లో కుమారుడు లేని పరిస్థితుల్లో భార్య, కుమార్తె వంటి కుటుంబ సభ్యులకు కొన్ని పితృకర్మలు నిర్వహించే అవకాశం ప్రస్తావించబడింది. ఉదాహరణకు గరుడ పురాణంలోని ఒక శ్లోకం.. కుమారుడు లేనప్పుడు భార్య, కుమార్తె లేదా కుమార్తె కుమారుడు వంటి వారిని కర్మ నిర్వహణలో పేర్కొంటుంది. ఇక రామాయణ సంప్రదాయంలో ప్రచారంలో ఉన్న కథనం ప్రకారం..

గయలో ఫల్గు నది తీరంలో శ్రీరాముడు, లక్ష్మణుడు శ్రాద్ధ సామగ్రి కోసం వెళ్లిన సమయంలో.. పిండప్రదాన సమయం సమీపించింది. అప్పుడు దశరథ మహారాజు తన కోడలు సీతాదేవిని పిండం సమర్పించమని కోరినట్లు కథనం. సామగ్రి లేకపోవడంతో సీతమ్మ ఇసుకతో పిండాన్ని తయారు చేసి.. భక్తిశ్రద్ధలతో దశరథునికి సమర్పించినట్లు గయా క్షేత్ర సంప్రదాయాల్లో ఈ కథ చెప్పబడుతుంది. అనంతరం ఫల్గు నది, కేతకి పుష్పం, గోవు, వటవృక్షం వంటి వాటిని సాక్షులుగా నిలిపిన కథ కూడా ప్రచారంలో ఉంది.

అందుకే మహిళలు పిండప్రదానం చేయగలరా అనే ప్రశ్నకు ఒకే మాటతో సమాధానం చెప్పడం కంటే.. కుటుంబ సంప్రదాయం, ఆచారం, ప్రాంతీయ ధర్మపద్ధతి, కర్మకు సంబంధించిన శాస్త్రవిధి వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు. అలాగే పితృస్మరణలో ప్రధానమైనది ఎవరి చేతులు కర్మ చేశాయన్నదే కాదు.. ఎంత శ్రద్ధతో పూర్వీకులను స్మరించామన్నదే ముఖ్యమని అంటున్నారు.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#Spirituality#Ancestral spirits#remembrance#gratitude#Sanatana Dharma#Shraddha#Tarpanam#Pinda Pradanam.
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి