తెలంగాణ

Hyderabad:గణేష్‌ నిమజ్జనం సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం!..

రచన: Venu4 నిమిషాల పఠనం

గణేష్‌ నిమజ్జన వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక ఏర్పాట్లు చేసింది. నిమజ్జనానికి తరలివచ్చే భక్తులు తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు పడకుండా ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు రాత్రివేళ ప్రత్యేక ఎంఎంటీఎస్‌ సర్వీసులను అందుబాటులో ఉంచుతోంది.

గణేష్‌ నిమజ్జన వేడుకల సందర్భంగా హైదరాబాద్‌లో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక ఏర్పాట్లు చేసింది. నిమజ్జనానికి తరలివచ్చే భక్తులు తిరుగు ప్రయాణంలో ఇబ్బందులు పడకుండా ఈనెల 25 నుంచి 27వ తేదీ వరకు రాత్రివేళ ప్రత్యేక ఎంఎంటీఎస్‌ సర్వీసులను అందుబాటులో ఉంచుతోంది.

రాత్రి 11 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు మొత్తం 8 ప్రత్యేక రైళ్లు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్‌వో ఎ. శ్రీధర్‌ తెలిపారు. సికింద్రాబాద్‌, నాంపల్లి, లింగంపల్లి, ఫలక్‌నుమా ప్రాంతాలను అనుసంధానిస్తూ ఈ సర్వీసులను నడపనున్నారు. దీంతో నిమజ్జన కార్యక్రమాలు ముగిసిన తర్వాత వారి ప్రాంతాలకు తిరిగి వెళ్లే వారికి ప్రజా రవాణా మరింత అందుబాటులోకి రానుంది.

షెడ్యూల్‌ ప్రకారం.. సికింద్రాబాద్‌ నుంచి రాత్రి 11.50 గంటలకు బయలుదేరే ప్రత్యేక రైలు అర్ధరాత్రి 12.20 గంటలకు నాంపల్లికి చేరుకుంటుంది. నాంపల్లి నుంచి 12.30 గంటలకు బయలుదేరే మరో సర్వీసు రాత్రి 1.20 గంటలకు లింగంపల్లికి చేరుతుంది. ఆ తర్వాత లింగంపల్లి నుంచి 1.50 గంటలకు బయలుదేరే రైలు 2.40 గంటలకు నాంపల్లికి చేరుకోనుంది. తెల్లవారుజామున 3.30 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరే సర్వీసు 4 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుంది.

మరో సర్వీసు రాత్రి 11.10 గంటలకు నాంపల్లి నుంచి బయలుదేరి 11.55 గంటలకు లింగంపల్లికి చేరుతుంది. లింగంపల్లి నుంచి 12.10 గంటలకు బయలుదేరే రైలు ఫలక్‌నుమాకు తెల్లవారుజామున 1.50 గంటలకు చేరుకుంటుంది. ఫలక్‌నుమా నుంచి 2.20 గంటలకు బయలుదేరే సర్వీసు 3 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుకోనుంది. చివరగా సికింద్రాబాద్‌ నుంచి 4 గంటలకు బయలుదేరే రైలు 4.40 గంటలకు నాంపల్లికి చేరుతుంది.

భక్తుల సౌకర్యం, రద్దీ నియంత్రణ, సురక్షిత రాకపోకలను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రత్యేక సర్వీసులను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. మరోవైపు నగరంలో వినాయక విగ్రహాల నిమజ్జన వేడుకలు అంగరంగ వైభవంగా కొనసాగుతుండగా.. కార్యక్రమాలకు హాజరయ్యే భక్తులకు రాత్రివేళ కూడా రవాణా సౌకర్యం అందుబాటులో ఉండనుంది..

#Hyderabad#South Central Railway#MMTS#Ganesh Immersion#Secunderabad#Nampally#Night Service
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి