తెలంగాణ

Telangana: పోలీస్ సిస్టమ్‌కు సుస్తీ!.. ఖాకీల లంచాలకు విసిగెత్తిపోతున్న ప్రజలు!!..

రచన: Venu8 నిమిషాల పఠనం

తెలంగాణలో పోలీస్ వ్యవస్థ రోజురోజుకు దిగజారిపోతోందనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. అధికారుల పర్యవేక్షణ సిస్టమ్‌ను ఓవర్ టేక్ చేసి కొనసాగుతున్న వ్యవహారమే ఇందుకు కారణంగా చెప్పుకొంటున్నారు..

చేయి తడపనిదే పని చేయని పోలీస్ స్టేషన్లు కోకొల్లలు?

నిత్యం మానిటరింగ్ చేసే ఏసీపీ, అడిషనల్ డీసీపీల వ్యవస్థ నిర్వీర్యం?

నేరుగా డీసీపీలకు అటాచ్మెంట్ అవుతున్న ఎస్‌హెచ్‌ఓలు?

స్టేషన్‌లో ఎన్ని దందాలు జరిగినా వెనకేసుకొస్తున్నడీసీపీలు?

సిబ్బంది తప్పులను కూడా ఒప్పుగా మలుచుకోవడం అలవాటుగా మార్చేసిన వైనం

వీఐపీల విషయాలు అయితేనే బయటపడుతున్న వ్యవస్థ లోపాలు?

నిద్ర మత్తులో ఎస్పీ వ్యవస్థ?.. తూతూమంత్రంగా ఇంటెలిజెన్స్ ఎంక్వైరీలు?

స్టేషన్‌కు వెళితే జలగల్లా పీల్చుతున్నారని ప్రజల ఆందోళన?

పోలీసులపై రోజురోజుకు పెరుగుతున్న ఏసీబీ ఫిర్యాదులు

పోలీస్ స్టేషన్‌లో తప్పిన అడ్మినిస్ట్రేషన్ పట్టు?

పైరవీల కేసులకే ప్రయారిటీ.. కలెక్షన్స్ పైనే దృష్టి పెట్టిన ఎస్‌హెచ్‌ఓలు?

తాము ఖర్చు పెట్టుకుని వచ్చామని డైరెక్ట్‌గా చెబుతున్న వైనం

దాన్ని అడ్డుగా పెట్టుకుని ఎస్సైలు, కానిస్టేబుల్స్ విచ్చలవిడితనం?

జర మీ పోలీస్ స్టేషన్లలో ఏం జరగుతున్నాయో కన్నేయండి బాస్?

స్వేచ్ఛ న్యూస్‌కు స్వేచ్ఛాయుతంగా రికార్డ్ చేసి పంపండి?

వాళ్ల అక్రమాలను, అవినీతిని ఆధారాలతో సహా ఎండగడదాం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల

9848070809

స్వేచ్ఛ చైర్మన్

మసకబారుతోన్న పోలీస్ వ్యవస్థ?

తెలంగాణలో పోలీస్ వ్యవస్థ రోజురోజుకు దిగజారిపోతోందనే ఆరోపణలు ఎదుర్కొంటుంది. అధికారుల పర్యవేక్షణ సిస్టమ్‌ను ఓవర్ టేక్ చేసి కొనసాగుతున్న వ్యవహారమే ఇందుకు కారణంగా చెప్పుకొంటున్నారు.. ఎస్‌హెచ్‌ఓ నేరుగా డీసీపీలకు/ఎస్పీలకు లేదా సీపీలకు కనెక్టివిటీ పెంచుకోవడంతో రాష్ట్రంలో అవినీతిని కప్పిపుచ్చుకుంటున్నారు. ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని డబ్బులు భారీగా దండుకుంటున్నారని విమర్శలు రోజురోజుకు పెరుగుతున్నాయి.

ఫిర్యాదు దారులు పైరవీలతో వెళితేనే సరైన రెస్పాన్స్ ఉంటోంది. లేదంటే ప్రైమరీ ఎంక్వైరీ పేరుతో నాన్చుతున్నారు. ఆ విషయం ఉన్నతాధికారులకు తెలియజేయడం లేదు. ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినా, 7 ఏండ్లలోపు సెక్షన్స్‌నే చేర్చుతున్నారు. లావాదేవీలు జరిగితే నోటీసులు ఇచ్చి చార్జీషీట్ సమయంలో చూసుకుందాం అంటున్నారు. చాలా రోజుల తర్వాత నాన్ బెయిలబుల్ సెక్షన్స్ యాడ్ చేసి రిమాండ్ చూపిస్తున్నారనే ఆరోపణలున్నాయి..

చాలా స్టేసన్స్‌లో ఇలాంటి వ్యవహారాలతోనే బిజీగా ఉంటున్నాయి. నిజానికి కేసు ప్రైమరీ ఎంక్వైరీ అయినా ఏసీపీ అనుమతి తప్పనిసరి. కానీ అక్కడికి చేరకుండానే స్టేషన్‌లోనే సెటిల్మెంట్స్ చేస్తున్నారు. ఏవైనా ఇబ్బందులు వస్తే డీసీపీకి లేదా ఎస్పీలకు పైరవీతో వచ్చిన పోస్టింగ్ ద్వారా చెప్పించి ఒత్తిళ్లకు పాల్పడుతున్నారు.

భూముల సెటిల్మెంట్స్‌తోనే బతికేస్తున్న కొందరు ఆఫీసర్స్?

భూములు కబ్జా చేసుకోవడానికి ఎంతోమంది అధికారులు సహకరిస్తున్నారు. సైబరాబాద్ లాంటి ఏరియా అయితే వాళ్లు అడిందే ఆట పాడిందే పాటలాగా తయారైంది. నాన్ బెయిలబుల్ కేసులు నమోదు అయినా కూడా అరెస్ట్ చేయకుండా అడ్డుకుంటున్నారు. అందుకు జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ కేసు ఉదాహరణ. మాదాపూర్‌లో గుంటూర్ మస్తాన్ కేసులో ఇప్పటికీ అరెస్ట్ చేయలేదు. ఫేక్ డ్యాకుమెంట్లు పెట్టినా, ఎన్ని కబ్జాల అరోపణలు ఉన్నా చాలామందిని వదిలేస్తున్నారు. గట్టిగా అడిగితే పొలిటికల్ ప్రెజర్ అంటూ తప్పించుకోవడం చాలా ఈజీగా నేర్చుకున్నారు.

ఏసీబీకి చిక్కినా కూడా మారని సిస్టమ్!!

గత ఏడాదిగా ఏసీబీకి చిక్కిన పోలీసుల్లో సైబర్ నేరగాళ్లకు సహకరించిన ఎల్బీనగర్ సైబర్ క్రైం ఎస్సై ఉన్నారు. 70 ఏండ్ల వృద్దురాలి భూమిని కబ్జా చేస్తే కాపాడాలని చూసి చందానగర్‌లో ఒకరు చిక్కారు. బోయినపల్లిలో 30 వేలు లంచం తీసుకుంటూ మహిళా ఎస్సై, 15 వేలు తీసుకుంటూ చైతన్యపురి ఏఎస్సై, ఫేక్ డ్యాకుమెంట్ల కేసులో 2 లక్షలు తీసుకుంటూ సీఐని, ఎస్సైని ఎయిర్ పోర్ట్ పోలీస్ స్టేషన్‌లో పట్టుకున్నారు. సైబర్ కేసుల్లో ఇరికించకుండా ఉండేందుకు మరో సీఐ 4 లక్షలు తీసుకుంటుండగా, స్టేషన్ బెయిల్ పేరుతో లక్ష అడుగుతూ గాంధీనగర్ ఎస్సై ఇలా చాలామంది దొరికారు. అయినా కూడా వారి తీరు మారక పోవడం విమర్శలకు దారితీస్తుంది..

పోలీసుల్లో పనితీరు బాగుంటేనే ప్రజా పాలనకు అవకాశం.. లేదంటే ఖతమే?

ప్రజలకు నేరుగా సంబంధం ఉండే వ్యవస్థల్లో పోలీస్ వ్యవస్థ చాలా కీలకం. ఏదైనా ఇబ్బందులు వస్తే ప్రొసీజర్ ఫాలో అయి తప్పు చేసిన వారిని శిక్షిస్తే ఆ గ్రామ ప్రజలు అందరూ హర్షం వ్యక్తం చేస్తారు. తప్పు చేసి పోలీసులకు లంచాలు ఇచ్చి ప్రజల ముందే దర్జాగా తిరుగుతుంటే పాలనపై ప్రశ్నలు ఎక్కుపెడుతారు. స్టేషన్‌కు వెళితే ముఖాలు చూసి వ్యవహరించడం సరికాదు. సామాన్యుల సమస్యలను పట్టించుకోవడం లేదు. సీఐలు, ఎస్సైలే అలా తయారయ్యారు మేమేం తక్కువ అంటూ కింది స్థాయి సిబ్బంది చేయి తడకపోతే పని ముట్టుకోవడం లేదు.

వీటన్నింటికి చెక్ పెట్టాలంటే ఆధారాలు సేకరించి సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి. లేదంటే నేరుగా స్వేచ్ఛ న్యూస్‌కు పంపండి. సోషల్ మీడియాలో పోస్ట్ చేసేందుకు మీకు ధైర్యం లేకపోతే, మేము ఆధారాలతో పాటు ప్రచురిస్తాం. ఏసీబీ అధికారులు స్పందించకపోతే మాకు ఫోన్ చేయండి. ఎలా వారిని ప్రజల ముందు దోషిగా నిలబెట్టాలో మేము చెబుతాం. ఇలాంటి స్పెసిఫిక్ కేసుల్లో పోలీసులు ఎలా పైసలు కమాయిస్తున్నారో, కమిషనరేట్స్ వారీగా డీసీపీల వ్యవహారాల తీరు మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాం. వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్న అధికారులకు వాళ్ల డ్యూటీ ఏంటో తెలిసేలా వార్తలు ఇవ్వబోతున్నాం..

#Telangana#police system#ailing public#police corruption#Konda Surekha#former OSD Sumanth#Madhapur#Guntur Mastan
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి