సినిమా

Nani: తెలంగాణ సీఎం కి నాని రిక్వెస్ట్..!

రచన: Anshu5 నిమిషాల పఠనం

Nani: నేచురల్ స్టార్ నాని మరోసారి తన అభిమానులపై ఉన్న ప్రేమను చాటుకున్నారు. తన తాజా చిత్రం ‘ది ప్యారడైజ్’ ప్రీమియర్ షోను అభిమానులతో కలిసి థియేటర్‌లో కూర్చొని చూడాలని ఉందని, అందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనుమతి ఇవ్వాలని నాని కోరుతూ ఎక్స్ లో పోస్ట్ పెట్టాడు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 24న పాన్ ఇండియా వైడ్‌గా రిలీజ్ అవుతోంది. ఈ నేపథ్యంలో 23నే పేయిడ్ ప్రీమియర్స్ పడబోతున్నాయి. ఈ షోను నానీ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో అభిమనౌలతో కలిసి చూడాలనే కోరికను తెలిపాడు.

సినిమా విడుదల సమయంలో హీరోలు అభిమానులతో కలిసి థియేటర్‌లో సినిమా చూడటం, ప్రేక్షకుల మధ్య ఉండటం ఎప్పుడూ ప్రత్యేకమైన అనుభూతినే ఇస్తుంది. అయితే భద్రతా కారణాలు, భారీగా అభిమానులు తరలివచ్చే అవకాశం ఉండటంతో స్టార్ హీరోలు సాధారణంగా థియేటర్లకు వెళ్లడం కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో నాని చేసిన ఈ విజ్ఞప్తి ఆసక్తిని రేకెత్తిస్తోంది.

పుష్ప 2 వుషయంలో జరిగిన తప్పిదం మళ్ళీ కరగకూడనే:

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, సుకుమార్ కంబినేషన్‌లో వచ్చిన పుష్ప 2 ప్రీమియర్ షోకి అల్లు అర్జున్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వచ్చి ఫ్యామిలీతో సినిమా చూశాడు. ఈ సమయంలో ఇక ఫ్యామిలీ తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడింది. ఒకరు మృతి చెందగా బాబు ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు. ఈ విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయిన సంగతి కూడా తెలిసిందే. దీంతో, ఇలాంటి పొరపాటు నాని సినిమా ప్యారడైజ్ కి జరగకూడనే సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేశాడు.

మరి నాని రిక్వెస్ట్‌కు సీఎం నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందా? అభిమానులతో కలిసి నాని ‘ది ప్యారడైజ్’ను థియేటర్‌లో చూసే అవకాశం దక్కుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది. అధికారికంగా దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. విభిన్నమైన కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్నారు.

గతంలో నాని–శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో వచ్చిన ‘దసరా’ మంచి విజయాన్ని అందుకోవడంతో, ఈ సినిమాపై కూడా అంచనాలు మరింత పెరిగాయి. ఇందులో, హీరోయిన్‌గా కయాదు లోహర్ నటించింది. స్పెషల్ సాంగ్‌లో కీర్తి సురేష్ అలరించబోతోంది. మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. అనిరుధ్ సంగీతం అందించాడు. సుధాకర్ చెరుకూరి నిర్మాత.

#nani#the paradise#cm revanth reddy#srikanth odela#kayadu lohar
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి