International

డిసెంబర్‌లో అమెరికాకు ప్రధాని మోదీ.. జీ20 వేదికగా ట్రంప్‌తో కీలక భేటీ!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ప్రధాని మోదీ ఈఏడాది డిసెంబర్‌లో అమెరికాలో పర్యటించేందుకు సిద్ధమవుతున్నారు. ఫ్లోరిడాలోని డొరల్‌ వేదికగా డిసెంబర్ 14, 15 తేదీల్లో జరగనున్న ప్రతిష్టాత్మక జీ20 దేశాధినేతల శిఖరాగ్ర సదస్సులో ఆయన పాల్గొననున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అత్యంత ఆత్మీయంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ సదస్సును 2009 తర్వాత దాదాపు 17సంవత్సరాల విరామం అనంతరం అమెరికా తిరిగి నిర్వహిస్తుండటం ప్రాధాన్యం సంతరించుకుంది.

 ఈ సుదీర్ఘ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీ, యూఎస్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌లతో ద్వైపాక్షిక చర్చలు జరిపే అవకాశం ఉంది. ఇరుదేశాల మధ్య దౌత్య బంధం బలంగా ఉన్న తరుణంలో ఈ సమావేశం భారత్-అమెరికా ఆర్థిక, వాణిజ్య బంధాన్ని సరికొత్త ఎత్తుకు తీసుకెళ్తుందని భావిస్తున్నారు. ఇదే జీ20 వేదికగా భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాల అధినేతలతో కూడిన 'క్వాడ్' (QUAD) సమ్మిట్‌ను కూడా నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.

 అమెరికా పర్యటనను విజయవంతంగా ముగించుకున్న అనంతరం ప్రధాని మోదీ అక్కడి నుంచి నేరుగా కెనడాకు వెళ్లే యోచనలో ఉన్నట్లు విదేశాంగ వర్గాలు వెల్లడించాయి. కెనడా ప్రధాని మార్క్ కార్నీ ఆహ్వానం మేరకు ఈ ద్వైపాక్షిక పర్యటన ఖరారయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం భారత్-కెనడా మధ్య సమగ్ర వాణిజ్య భాగస్వామ్య ఒప్పందంపై కీలక చర్చలు సాగుతున్న నేపథ్యం లో ఈ పర్యటన ప్రాధాన్యం సంతరించుకుంది.

 అయితే, ఈ విదేశీ పర్యటనలకు సంబంధించిన అధికారిక షెడ్యూల్‌ను భారత విదేశాంగశాఖ (MEA) త్వరలోనే ప్రకటించనుంది. ఈ పర్యటనలు ఖరారైతే ఇండో-పసిఫిక్ ప్రాంతంలో వ్యూహాత్మక రక్షణ సహకారం, విదేశీ వాణిజ్య విధానాలు, ప్రపంచ ఆర్థిక స్థిరత్వం వంటి కీలక అంశాలపై స్పష్టమైన మార్గదర్శకాలు వెలువడే అవకాశం ఉంది.

#PMModiUSVisit#DonaldTrump#G20Summit2026#IndiaUSRelations#QuadSummit#ModiCanadaVisit#ForeignPolicy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి