ఏపీ

AP : డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై న్యాయవిచారణ జరపాలి : సీపీఎం

రచన: Kumar4 నిమిషాల పఠనం

ఏపీలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఈ నియామకాల్లో అసలైన అర్హులకు న్యాయం జరగలేదని, కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తున్నది. ఈ మేరకు వైసీపీ నేతలు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.

ఏపీలో డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై వివాదం రాజుకున్న విషయం తెలిసిందే. ఈ నియామకాల్లో అసలైన అర్హులకు న్యాయం జరగలేదని, కూటమి ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ప్రతిపక్ష వైసీపీ ఆరోపిస్తున్నది. ఈ మేరకు వైసీపీ నేతలు పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు.దీనికి బదులుగా తెలుగుదేశం పార్టీ నేతలు సైతం వైసీపీ ఆందోళనలను దీటుగా ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. విజయవాడలో చేపట్టిన నిరసన ప్రదర్శనలు తీవ్ర ఉద్రిక్తతలకు దారితీశాయి.

దీంతో పోలీసులు రంగంలోకి దిగి వైసీపీ శ్రేణులు, నిరసన కారులను చెదరగొట్టారు. వైసీపీ చేస్తున్న ఆరోపణల మీద స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం పొందిన టీచర్లు సైతం స్పందించారు. మెగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా టీచర్లు విజయవాడలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించగా.. దీనికి 370 మంది హాజరయ్యారు. తమ నియామకాలపై వైసీపీ చేస్తున్న దుష్ర్పచారాన్ని ఈ సందర్భంగా ఖండించారు.

అబద్ధాలు రుద్దవద్దు, ఆత్మగౌరవం దెబ్బతీయవద్దని నినాదాలు చేశారు. మెగా డీఎస్సీలో స్పోర్ట్స్ కోటాను 3 శాతం పెంచిన సీఎం చంద్రబాబు నాయుడుకు ఈ సందర్బంగా టీచర్లు ధన్యవాదాలు తెలిపారు.ప్రతిభతో ఉద్యోగం సాధించిన తమను అవమానించడం సరికాదని టీచర్లు హితవు పలికారు. వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాన్ని నమ్మవద్దని పిలుపునిచ్చారు. స్పోర్ట్స్ ఆడే సమయంలో తగిలిన గాయాల కంటే వైసీపీ చేస్తున్న అసత్య ప్రచారాలే తమను ఇంకా ఎక్కువగా బాధిస్తున్నాయన్నారు.

ఇదిలాఉండగా, డీఎస్సీ స్పోర్ట్స్ కోటా నియామకాలపై న్యాయ విచారణ జరపాలని తాజాగా సీపీఐ(ఎం) పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ‘డీఎస్సీ అక్రమాలపై నిరసనకు దిగిన వైసీపీ కార్యకర్తలు/ నిరుద్యోగులపై లాఠీచార్జీని ఖండిస్తున్నాం.తమ సమస్యలపై నిరసన తెలియజేయడం ప్రజాస్వామ్యంలో పార్టీలు, సంఘాలు, సంస్థల ప్రాథమిక హక్కు.హక్కును నిరాకరించడం అప్రజాస్వామికం.

సవాళ్లకు ప్రతి సవాళ్లు బదులుగా సమస్యను పరిష్కరించడానికి న్యాయ విచారణ జరిపితే వాస్తవాలు వెల్లడవుతాయి.తమ ప్రయోజనాల కోసం ఉపాధ్యాయులను అడ్డం పెట్టుకోవడం సమంజసం కాదు. ఆరోపణలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పకుండా ఉపాధ్యాయులను పోటీగా రంగంలోకి దింపడం సమస్యను మరింత జఠిలం చేస్తుంది.ఇటువంటి చర్యలను మానుకోవాలని ప్రభుత్వాన్ని సీపీఎం కోరుతుంది’ అని పేర్కొన్నారు.

#Megha DSC#sports quota#teacher jobs#ysrcp protest#swechaanews#CPIM
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి