Tollywood: యంగ్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన నటిస్తున్న ‘రణబాలి’ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశాడు. ఈ సినిమాతో పాటు మరోవైపు తన తదుపరి ప్రాజెక్ట్‌పై కూడా ఫోకస్ పెట్టారు విజయ్.‘రణబాలి’ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాల చిత్రీకరణ పూర్తవడంతో విజయ్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌కు షిఫ్ట్ కాబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విజయ్ నుంచి రాబోతున్న డిఫరెంట్ జోనర్ మూవీగా ‘రణబాలి’పై అంచనాలు ఉన్నాయి.
ఇక విజయ్ దేవరకొండ తదుపరి సినిమా ‘రౌడీ జనార్ధన’ కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పుడు అందరి దృష్టి పడింది. ‘రౌడీ’ అనే ట్యాగ్‌తో ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న విజయ్.. మరోసారి అదే తరహా ఎనర్జిటిక్ క్యారెక్టర్‌లో కనిపించనున్నాడు. ‘రాజావారు రాణిగారు’తో దర్శకుడిగా తన ప్రతిభను చాటుకున్న రవికిరణ్ కోలా.. ఈసారి విజయ్ దేవరకొండను సరికొత్త మాస్ అవతారంలో చూపించబోతున్నాడు.
‘రౌడీ జనార్ధన’ కోసం విజయ్ తన లుక్, బాడీ లాంగ్వేజ్‌పై ప్రత్యేకంగా దృష్టి పెట్టాడు. కథకు తగ్గట్టుగా తనను తాను మార్చుకునేందుకు ఆయన సిద్ధమయ్యాడు. ‘రణబాలి’ షూటింగ్ పూర్తవడంతో ఇక పూర్తిగా ‘రౌడీ జనార్ధన’పై ఫోకస్ చేయనున్నట్లు ఫిల్మ్ సర్కిల్స్‌లో టాక్ వినిపిస్తోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటిస్తోంది. విజయ్, కీర్తి కలయికపై కూడా ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. వీరిద్దరి మధ్య ప్రేమకథకు సినిమాలో హైలెట్ గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే డాక్టర్ రాజశేఖర్ కీలక పాత్రలో కనిపించనున్నారని సమాచారం. దిల్ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే.
వరుసగా క్రేజీ ప్రాజెక్టులతో దూసుకెళ్తున్న విజయ్ దేవరకొండకు ఈ రెండు సినిమాలు ఎలాంటి ఫలితాలను అందిస్తాయో చూడాలి. ముఖ్యంగా ‘రౌడీ జనార్ధన’తో విజయ్ మరోసారి తన మాస్ ఇమేజ్‌ను మరింత బలపరుస్తారా అన్నది ఆసక్తికరంగా మారింది. కాగా, అక్టోబర్ 16న రణబాలి పాన్ ఇండియా వైడ్‌గా 5 భాషలలో రిలీజ్ కాబోతోంది. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో హీరోయిన్‌గా రష్మిక మందన్న నటించిన సంగతి తెలిసిందే.











