క్రీడలు

ఆసియా గేమ్స్‌లో భారత్ పతకాల పంట.. మరో మూడు కాంస్యాలు సొంతం!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. పోటీల్లో భారత్ తాజాగా మొత్తంగా మూడు కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకుంది. షూటింగ్‌లోని స్కీట్ విభాగానికి చెందిన పురుషుల, మహిళల జట్లు చెరో కాంస్యం సాధించగా, సాఫ్ట్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు చారిత్రక కాంస్య పతకం లభించింది.

 జపాన్ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు తమ అద్భుత ప్రదర్శనతో దూసుకుపోతున్నారు. పోటీల్లో భారత్ తాజాగా మొత్తంగా మూడు కాంస్య పతకాలను తన ఖాతాలో వేసుకుంది. షూటింగ్‌లోని స్కీట్ విభాగానికి చెందిన పురుషుల, మహిళల జట్లు చెరో కాంస్యం సాధించగా, సాఫ్ట్ టెన్నిస్ పురుషుల సింగిల్స్ విభాగంలో భారత్‌కు చారిత్రక కాంస్య పతకం లభించింది. దీంతో భారత్ సాధించిన మొత్తం పతకాల సంఖ్య తొమ్మిదికి చేరగా, అందులో ఏడు పతకాలు ఒక్క షూటింగ్ విభాగం నుంచే రావడం విశేషం.

 మహిళల స్కీట్ టీమ్ ఈవెంట్‌లో రైజా ధిల్లాన్, పరినాజ్ ధాలివాల్, మహేశ్వరి చౌహాన్‌లతో కూడిన భారత బృందం 331పాయింట్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం కైవసం చేసుకుంది. ఈ ఈవెంట్‌లో చైనా స్వర్ణం, కజకిస్థాన్ రజతం సాధించాయి. మరోవైపు, అనంత్‌జీత్ సింగ్ నరుకా, మైరాజ్ అహ్మద్ ఖాన్, భవతేగ్ సింగ్ గిల్‌లతో కూడిన భారత పురుషుల స్కీట్ జట్టు 346 పాయింట్లతో కజకిస్థాన్‌తో సమంగా నిలిచి, అనంతరం జరిగిన ఉత్కంఠభరిత షూట్ ఆఫ్‌లో విజయం సాధించి కాంస్య పతకాన్ని ముద్దాడింది.

 సాఫ్ట్ టెన్నిస్ పురుషుల సింగిల్స్‌లో భారత ఆటగాడు జై మీనా అద్భుత ప్రదర్శనతో కాంస్య పతకం సాధించాడు. సెమీఫైనల్లో జపాన్ క్రీడాకారుడు కురొసాల చేతిలో 2-4 తేడాతో ఓటమి పాలైనప్పటికీ, ఆసియా గేమ్స్ సాఫ్ట్ టెన్నిస్ చరిత్రలోనే భారత్‌కు మొట్టమొదటి పతకాన్ని అందించిన క్రీడాకారుడిగా జై మీనా చరిత్ర సృష్టించాడు. అయితే, 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్లో ఒలింపిక్ పతక విజేత మను భాకర్ 181.1 పాయింట్లతో 5వ స్థానానికే పరిమితమై నిరాశపరిచారు.

 నేడు జరగనున్న ఇతర క్రీడాంశాల్లో కూడా భారత్ పతకాలపై భారీ ఆశలు పెట్టుకుంది. మహిళల వెయిట్‌లిఫ్టింగ్ 49 కేజీల ఫైనల్లో మీరాబాయి చాను బరిలోకి దిగుతుండగా, మహిళల కబడ్డీలో ఇరాన్‌తో మ్యాచ్, బ్యాడ్మింటన్ సెమీఫైనల్లో చైనాతో భారత్ తలపడనుంది. రోయింగ్‌లో బల్‌రాజ్ పన్వార్, డబుల్స్‌లో సత్నామ్ సింగ్ - సల్మాన్ ఖాన్‌ల జోడీ ఫైనల్స్‌కు అర్హత సాధించడంతో భారత పతకాల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.

#AsianGames2026#ShootingBronze#JaiMeena#SoftTennisIndia#ManuBhaker#MirabaiChanu#IndianSportsUpdates#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి