క్రైమ్

Jaipur: ఘోర అగ్నిప్రమాదం.. రూ.కోట్ల విలువ చేసే 8 లగ్జరీ కార్లు దగ్ధం!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని సంగనేర్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ మార్కెట్‌లో ఉన్న ప్రముఖ మెర్సిడెస్(Mercedes) కార్ల వర్క్‌షాప్‌(Car workshop)లో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం(Fire accident) సంభవించింది.

 రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని సంగనేర్ సదర్ పోలీస్ స్టేషన్ పరిధి బాలాజీ మార్కెట్‌లో ఉన్న ప్రముఖ మెర్సిడెస్(Mercedes) కార్ల వర్క్‌షాప్‌(Car workshop)లో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం(Fire accident) సంభవించింది. ఒక్కసారిగా చెలరేగిన మంటలు వర్క్‌షాప్ నలువైపులా వేగంగా విస్తరించడంతో దాదాపు 8 ఖరీదైన లగ్జరీ కార్లు, విలువైన విడిభాగాలు మరియు యాక్సెసరీలు పూర్తిగా కాలి బూడిదయ్యాయి.

అగ్నిప్రమాద తీవ్రతకు దట్టమైన పొగలు సుమారు 5 కిలోమీటర్ల దూరం వరకు వ్యాపించడంతో చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు.  సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. సుమారు 10 ఫైరింజన్ల సాయంతో అగ్నిమాపక సిబ్బంది దాదాపు రెండు గంటల పాటు కష్టపడి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం జరిగిన సమయంలో వర్క్‌షాప్‌లో కొత్తవి, పాతవి కలిపి 50కి పైగా ఖరీదైన కార్లు పార్క్ చేసి ఉన్నాయి.

మంటలు మరింత విస్తరించకముందే సిబ్బంది స్పందించి మిగిలిన కార్లను సురక్షిత ప్రాంతాలకు తరలించడంతో ప్రాణనష్టం తప్పి, భారీ ఆస్తి నష్టం నివారించబడింది.  ముందుజాగ్రత్త చర్యగా విద్యుత్ శాఖ అధికారులు ఆ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాను తక్షణమే నిలిపివేశారు. ప్రాథమిక దర్యాప్తు ప్రకారం షార్ట్ సర్క్యూట్ వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండవచ్చని అధికారులు భావిస్తున్నారు.

ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని ధ్రువీకరించిన పోలీసులు, దగ్ధమైన కార్లు, విడిభాగాలకు సంబంధించి జరిగిన నష్టాన్ని అంచనా వేస్తున్నారు. అదే రోజు జైపూర్‌లోని నారాయణ్ సింగ్ సర్కిల్ సమీపంలో ఉన్న ఒక వ్యాపార మాల్‌లో కూడా అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. రెండు ఫైరింజన్ల సాయంతో అరగంటలోనే మంటలను అదుపు చేయడంతో అక్కడి ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. ఈ రెండు ఘటనలపై స్థానిక పోలీసులు కేసులు నమోదు చేసి తదుపరి దర్యాప్తు జరుపుతున్నారు.

 

#JaipurFireAccident#MercedesWorkshopFire#RajasthanNews#SanganerSadar#LuxuryCarsBurnt#FireSafety#JaipurNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి