క్రైమ్

crime : సాధువు ముసుగులో మృగం.. ఒంటరి మహిళలకు దగ్గరై!

రచన: Kumar4 నిమిషాల పఠనం

ఆధ్యాత్మికత అనే ముసుగులో కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.అవతలి వ్యక్తుల వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. పూజలు చేసి మీ సమస్యలు తీరుస్తామంటూ మాయమాటలు చెబుతున్నారు.అనంతరం వారికి దగ్గరై లోబరుచుకుంటున్నారు. అంతేకాకుండా వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు.

ఆధ్యాత్మికత అనే ముసుగులో కొందరు కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు.అవతలి వ్యక్తుల వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకుంటున్నారు. పూజలు చేసి మీ సమస్యలు తీరుస్తామంటూ మాయమాటలు చెబుతున్నారు.అనంతరం వారికి దగ్గరై లోబరుచుకుంటున్నారు. అంతేకాకుండా వీడియోలు, ఫొటోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ వికృత చేష్టలకు పాల్పడుతున్నారు. ఇటువంటి ఘటనలు వరుసగా వెలుగుచూస్తున్నా జనాలు ప్రవర్తనలో మాత్రం మార్పు రావడం లేదు.

మోసగాళ్లను గుడ్డిగా నమ్మి బలవుతున్నారు. కొందరు డబ్బులు పొగొట్టుకుంటుంటే మరికొందరు కుటుంబ పరువు పోతుందనే భయంతో దారుణాలకు పాల్పడుతున్నారు. తాజాగా చోటుచేసుకున్న ఘటన ఇలాంటి ఘటనలకు అద్దం పడుతోంది. వివరాల్లోకివెళితే.. ఆధ్యాత్మికత పేరుతో మహిళలకు దగ్గరై.. వందలాది మందిని హిమ్మత్ గిరి అలియాస్ హేమంత్ రాజ్ అనే సాధువు వలలో వేసుకున్నాడు. అంతటితో ఆగకుండా మహిళలతో ఏకాంతంగా ఉన్న సమయంలో వీడియోలు తీసి వేధించినట్టు తెలిసింది.

ముఖ్యంగా వితంతువులు, పిల్లలు లేని మహిళల్ని టార్గెట్ చేసుకొని మాయమాటలతో వారికి దగ్గరై లైంగిక దాడికి పాల్పడినట్టు సమాచారం. అంతటితో ఆగకుండా మహిళల అశ్లీల వీడియోలు తీసి వారిని నిరంతరం వేధింపులకు గురి చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి.ఈ ఘటన ఉత్తరప్రదేశ్ మథురలోని వృందావన్‌లో చోటుచేసుకోగా.. ఆలస్యంగా వెలుగు చూసింది.

అతని వేధింపులు తాళలేక వృందావన్‌లోని ఓ గెస్ట్ హౌస్‌లో అతడ్ని పట్టుకొని బాధిత మహిళలు దేహశుద్ధి చేశారు.గెస్ట్ హౌస్ నుంచి బయటకు లాగుతూ చెప్పులు, కర్రలతో కొట్టడంతో పాటు బాధితులు పిడిగుద్దుల వర్షం కురిపించినట్టు తెలిసింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని బాధితుల ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నకిలీ సాధువుని అదుపులోకి తీసుకుని రిమాండ్‌కు పంపినట్టు సమాచారం. కాగా, సాధువు రూపంలో ఉన్న మృగానికి కఠిన శిక్ష విధించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్లు వినిపిస్తున్నాయి.

#holyman#sexual harrasment#uttarpradesh#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి