తెలంగాణ

TG: ఉదయం 9.30లోపే బ్రేక్‌ఫాస్ట్, పాలు.. విద్యాశాఖ నూతన మార్గదర్శకాలు!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అల్పాహార పథకానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు సరఫరా చేసే అల్పాహారం, పాలు పంపిణీ చేసిన తర్వాత, విద్యార్థులందరూ విధిగా ఉదయం 9:30 గంటల లోపే తమ టిఫిన్ తినడం, పాలు తాగే ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది.

తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల అల్పాహార పథకానికి సంబంధించి పాఠశాల విద్యాశాఖ కీలక ఆదేశాలు జారీ చేసింది. పాఠశాలలకు సరఫరా చేసే అల్పాహారం, పాలు పంపిణీ చేసిన తర్వాత, విద్యార్థులందరూ విధిగా ఉదయం 9:30 గంటల లోపే తమ టిఫిన్ తినడం, పాలు తాగే ప్రక్రియను పూర్తి చేయాలని స్పష్టం చేసింది. సమయపాలన పాటిస్తూ విద్యాబోధనకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకుంది.

 సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా ఉదయం 6:30 గంటల నుంచి 8:45 గంటల మధ్య కాలంలోనే అల్పాహారాన్ని పాఠశాలలకు చేరవేయాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించింది. ఈ పంపిణీ సమయ వేళలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని సంబంధిత సిబ్బందికి సూచించింది. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ‘బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ మిల్క్‌’ పథకాన్ని ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరు నాటికి రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది.

 ఈ పథకం సమర్థవంతమైన నిర్వహణకు ప్రధానోపాధ్యాయులకు (HM) ప్రత్యేక బాధ్యతలు అప్పగించారు. మరుసటి రోజు ఎంతమంది విద్యార్థులకు అల్పాహారం అవసరమో ఆ వివరాలను హెచ్‌ఎంలు ప్రతిరోజూ మధ్యాహ్నం 12:00 గంటలలోపు ప్రత్యేక యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా ఇండెంట్ రూపంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ నిర్ణీత సమయం దాటితే సిస్టమ్ ఆటోమేటిక్‌గా ఇండెంట్‌ను లాక్ చేస్తుందని స్పష్టం చేసింది.

 ఈ నూతన నిబంధనల ద్వారా ఆహారం వృథా కాకుండా చూడటంతో పాటు, విద్యార్థులకు వేడివేడిగా పోషకాహారాన్ని అందించవచ్చని విద్యాశాఖ భావిస్తోంది. అక్టోబర్ నాటికి పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు పాఠశాల స్థాయి నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు కార్యాచరణను సిద్ధం చేశారు.

 

#TelanganaEducation#GovtSchoolBreakfast#TelanganaGovt#MidDayMeal#SchoolBreakfastGuidelines#TelanganaNews#SchoolEducationTelangana#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి