ఏపీ

చంద్రబాబు ఘోరంగా మోసం చేశాడు.. మాజీ మంత్రి పేర్ని నాని ఫైర్!

రచన: Mamatha puppala4 నిమిషాల పఠనం

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లాలో జరిగిన వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు ఘోరంగా మోసం చేశాడంటూ విమర్శించారు.

ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. కృష్ణా జిల్లాలో జరిగిన వైఎస్సార్‌సీపీ ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా చంద్రబాబు ఘోరంగా మోసం చేశాడంటూ విమర్శించారు.

  ప్రతి మహిళకు నెలకు రూ.1,500 ఇస్తామని చెప్పి, అధికారంలోకి వచ్చాక పంగనామాలు పెట్టారని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇన్ని నెలలైనా ఆడబిడ్డలకు ఇచ్చిన హామీని అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, మహిళలను నమ్మించి మోసం చేయడమే చంద్రబాబు నైజమని ఆయన మండిపడ్డారు. ఈ సందర్భంగా గత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో మహిళలకు అందించిన ఆర్థిక సాయాన్ని పేర్ని నాని గుర్తుచేశారు.

 జగన్ హయాంలో మహిళల సున్నా వడ్డీ పథకానికి రూ.5,000 కోట్లు, అలాగే డ్వాక్రా మహిళల అప్పులు తీర్చే వైఎస్సార్ ఆసరా పథకానికి ఏకంగా రూ.26,000 కోట్లు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో వేశారని తెలిపారు. ‘గతంలో జగన్ వేసిన డబ్బులను ఇప్పుడు మీరు ఎందుకు వేయలేకపోతున్నారు?’ అని ప్రస్తుత ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.  నిత్యావసర ధరల పెరుగుదలపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును ఎద్దేవా చేస్తూ, పెరిగిన ధరలను తగ్గించడం మాని సముద్రాన్ని ఎలా కంట్రోల్ చేయాలా అని చంద్రబాబు మాట్లాడటం విడ్డూరంగా ఉందని వ్యంగ్యాస్త్రాలు విసిరారు.

 ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, నిత్యావసరాల ధరల భారాన్ని తగ్గించడంలో కూటమి సర్కారు పూర్తిగా చేతులెత్తేసిందని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తుంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పష్టమైన సమాధానం రావడం లేదని పేర్ని నాని విమర్శించారు. తక్షణమే మహిళలకు ఇచ్చిన 'ఆడబిడ్డ నిధి' హామీతో పాటు అన్ని సంక్షేమ పథకాల బాకీలను విడుదల చేయాలని, లేనిపక్షంలో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.

#PerniNani#YSRCP#ChandrababuNaidu#SuperSixSchemes#APPolitics#YSJagan#APNews#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి