Srikanth Odela: నేచురల్ స్టార్ నాని హీరోగా తెరకెక్కిన భారీ చిత్రం ‘ది ప్యారడైజ్’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త తరహా కథ, డిఫరెంట్ వరల్డ్, పవర్‌ఫుల్ క్యారెక్టరైజేషన్‌తో దర్శకుడు శ్రీకాంత్ ఓదెల ఈ సినిమాను తెరకెక్కించాడు. అయితే ఈ సినిమాలో కథతో పాటు మన తెలంగాణ నేటివిటీని ప్రతిబింబించే కొన్ని ప్రత్యేకమైన అంశాలు ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. అందులో ముఖ్యంగా ఇంటర్వెల్ సీక్వెన్స్‌లో వచ్చే ‘సర్వపిండి’ ఎలిమెంట్ ప్రత్యేకంగా నిలవబోతోందనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇంటర్వెల్‌లో ‘సర్వపిండి’ ఎందుకు?
సాధారణంగా మాస్ సినిమాల్లో ఇంటర్వెల్ అంటే హీరో క్యారెక్టర్‌ను మరో స్థాయిలో ఎలివేట్ చేసే కీలక ఘట్టం. కథలో అసలు మలుపు అక్కడే మొదలవుతుంది. ‘ది ప్యారడైజ్’లో కూడా ఇంటర్వెల్ బ్లాక్ చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉండబోతుందట.అందులోనూ, తెలంగాణకు ప్రత్యేకమైన సర్వపిండి ప్రస్తావన లేదా దాని చుట్టూ సాగే సన్నివేశం ఉండటం సినిమాకు మరింత నేటివిటీని తీసుకొస్తుందని తెలుస్తోంది. సర్వపిండి అనేది కేవలం ఒక వంటకం కాదు.. తెలంగాణ పల్లె సంస్కృతి, ఇంటి రుచులు, మన జీవన విధానంతో ముడిపడిన ఒక గుర్తింపు.

అందుకే, హైదరాబాద్ లోనీ మైత్రీ వారు తీసుకున్నటువంటి మైత్రీ విమల్, మైత్రీ శివ గంగ థియేటర్స్‌లో ఇంట్రవెల్ కి సర్వపిండి స్నాక్స్ గా పెట్టబోతున్నారు. వాస్తవానికి ఒక చిన్న టిఫిన్ సెంటర్‌లో.. ఓ 77 ఏళ్ల బామ్మ చేతిలో తయారైన ఈ స్పెషల్ వంటకం..ప్యారడైజ్ సినిమాతో ఇప్పుడు ప్రముఖ సింగిల్ స్క్రీన్ థియేటర్ల వరకు చేరుకోవడం అంటే గొప్ప విశేషమనే చెప్పాలి. ఇక, ఈ తెలంగాణ సంప్రదాయ రుచిని వెండితెర సందడితో కలిపే ఈ ప్రయత్నానికి ఏమేరకు ఆదరణ దక్కుతుందో.. ప్రేక్షకులకు ఎటువంటి ప్రత్యేక అనుభవాన్ని అందించనుందో చూడాలి. ఏదేమైనా తెలంగా ప్రాంతం వాడైన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల..ప్రాంతీయ చిత్రాలను రూపొందించడంలో గొప్ప ఫిల్మ్ మేకర్‌గా పేరు తెచ్చుకుంటున్నాడు.
ఇక, ఈ సినిమాలో కాకులకి సంబందించిన ఒక ఎపిఓడ్ సినిమాకి చాలా ప్లస్ పాయింట్‌గా నిలుస్తుందని తెలుస్తోంది. ఈ ఎపిసోడ్ ఉన్న విషయాన్ని దర్శకుడు సినిమా మొదలైనప్పుడు వదిలిన స్పెషల్ గ్లింప్స్ లోనే హింట్ ఇచ్చాడు. కాబట్టి, ఖచ్చితంగా ఆ సీక్వెన్సెస్ ప్యారడైజ్ సినిమాకి మేజర్ ప్లస్ కావచ్చు. కాగా, సుబ్బలక్ష్మి పాత్రలో గ్లామర్ బ్యూటీ కయాదు లోహర్ నటించింది. కీర్తి స్పెషల్ సాంగ్ అదనపు ఆకర్షణగా నిలవనుంది.










