క్రైమ్

Crime : 16 మందిని చంపిన ‘దోమ’.. దట్టమైన అడవుల్లో దూరి!

రచన: Kumar4 నిమిషాల పఠనం

16 మందిని దారుణంగా హత్యచేసిన ‘దోమ’ ఎట్టకేలకు చిక్కాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దోమ అంటే రక్తం పీలుస్తుంది కదా? అంతమందిని ఎలా చంపిందని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయొచ్చు. ఇక్కడ దోమ అంటే రక్తం పీల్చే కీటకం కాదు.

16 మందిని దారుణంగా హత్యచేసిన ‘దోమ’ ఎట్టకేలకు చిక్కాడు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. దోమ అంటే రక్తం పీలుస్తుంది కదా? అంతమందిని ఎలా చంపిందని అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేయొచ్చు. ఇక్కడ దోమ అంటే రక్తం పీల్చే కీటకం కాదు. దోమ అంటే మనిషే..బ్రెజిల్‌లో వరుస హత్యలకు కారణం ఈ సీరియల్ కిల్లర్ జోర్లాన్ లోప్స్ డా సిల్వా (33). నిందితుడు హత్యచేశాక పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునేందుకు అడవుల్లో గుడారాలు వేసుకుని తలదాచుకున్నట్టు తేలింది.

సన్నని దేహదారుడ్యం కలిగి ఉన్నందునే అందరూ అతన్ని మస్కిటో (దోమ) అని పిలిచేవారు తెలుస్తోంది. వివరాల్లోకివెళితే..బ్రెజిల్‌లోని పరైబా రాష్ట్రంలో ఉండే జొర్లాన్ మారుమూల ప్రాంతాల్లో వరుస హత్యలకు పాల్పడినట్టు సమాచారం. గత మూడు నెలల్లో 16 మందిని అత్యంత దారుణంగా హతమార్చినట్టు అతని మీద ఆరోపణలు ఉన్నాయి. ఒకరిని చంపేసిన వెంటనే దట్టమైన అడవుల్లోకి వెళ్లి దాక్కోవడం అతనికి అలవాటు.

అంతేకాదు పోలీసులకు దొరక్కుండా ఉండేందుకు అమ్మాయిలా వేషం వేసుకొని తిరిగేవాడని ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా జొర్లాన్ కదిలికలపై అనుమానం రావడంతో బ్రెజిల్ పోలీసులు అతనిపై నిఘా పెట్టారు. పబ్లిక్ స్క్వేర్‌లో 18 ఏళ్ల యువకుడిని కాల్చి చంపిన ఘటన తర్వాత నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారించగా 16 మందిని తానే చంపినట్టు ‘దోమ’ అంగీకరించినట్టు తెలిసింది. దీంతో ఈ సీరియల్ కిల్లర్‌కు, ఇతర నేరాలకు మధ్య సంబంధాన్ని గుర్తించారు.

దోమ ఓ క్రిమినల్ గ్యాంగ్‌కు చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించారు. అతనిపై చాలా వరకు హత్యారోపణలు ఉన్నాయి. జొర్లాన్ శరీరాకృతి వల్లే స్థానికులు అతనికి దోమ అని పేరు పెట్టినట్టు తెలుస్తుండగా.. అతను పైకి కనిపించినంతగా అమాయకుడు కాదని బ్రెజిల్ పోలీసులు నిర్ధారించారు. అతని కోర్టులో ప్రవేశపెట్టి కఠిన శిక్ష పడేలా చూస్తామని బ్రెజిల్ పోలీసులు వెల్లడించారు.కాగా, సీరియల్ కిల్లర్ దొరకడంతో స్థానికంగా ఉండే ప్రజలు సైతం ఊపిరి పీల్చుకున్నారు.

#doma#16 members#killed#brazil#swechaanews#crime#criminal arrested
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి