The Paradise: నేచురల్ స్టార్ నాని హీరోగా, దసరా ఫేమ్మ్ శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ డ్రామా ‘ది ప్యారడైజ్’. ఈ సినిమా విడుదలకు ముందే బాక్సాఫీస్ దగ్గర సత్తా చూపిస్తోంది. సెప్టెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్‌లో అదిరిపోయే స్పందన లభిస్తోంది.
తాజా ట్రేడ్ ట్రాకింగ్ ప్రకారం.. ఇండియాలో ప్రీమియర్ షోతో పాటు తొలి ఐదు రోజుల అడ్వాన్స్ బుకింగ్స్ కలిపి రూ.37 కోట్లకు పైగా గ్రాస్ ప్రీ-సేల్స్ నమోదయ్యాయని తెలుస్తోంది. ఇందులో బ్లాక్ చేసిన సీట్లను మినహాయిస్తే దాదాపు రూ.30.94 కోట్ల గ్రాస్ నమోదైనట్లు సమాచారం. ఇప్పటివరకు 17 లక్షలకు పైగా టికెట్లు అడ్వాన్స్‌లో అమ్ముడయ్యాయట.
ఫస్ట్ డేకు భారీ డిమాండ్:
ముఖ్యంగా మొదటి రోజు అడ్వాన్స్ బుకింగ్స్ ‘ది ప్యారడైజ్’పై ఉన్న క్రేజ్‌ను తెలియజేస్తున్నాయి. సెప్టెంబర్ 24న విడుదలయ్యే డే-1కు మాత్రమే రూ.18.16 కోట్ల గ్రాస్ అడ్వాన్స్ బుకింగ్స్ నమోదయ్యాయని సమాచారం. 8.5 లక్షలకు పైగా టికెట్లు ఇప్పటికే అమ్ముడయ్యాయట. మేజర్‌గా హైదరాబాద్ అడ్వాన్స్ బుకింగ్స్‌లో కీలకంగా నిలిచినట్టుగా తెలుస్తోంది.
తెలుగు రాష్ట్రాల్లోనూ నాని సినిమాకు భారీ డిమాండ్ కనిపిస్తోంది. డే-1 అడ్వాన్స్ బుకింగ్స్‌లో తెలంగాణ రూ.9.14 కోట్లతో ముందుండగా, ఆంధ్రప్రదేశ్ రూ.5.63 కోట్లతో తర్వాత స్థానంలో ఉంది. కర్ణాటకలోనూ రూ.2 కోట్లకు పైగా అడ్వాన్స్ గ్రాస్ నమోదైందట. దేశీయ మార్కెట్‌తో పాటు ఓవర్సీస్‌లో కూడా ‘ది ప్యారడైజ్’కు మంచి హైప్ కనిపిస్తోంది. అమెరికాలో అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమైన కొద్ది గంటల్లోనే $100K మార్క్‌ను దాటింది. ఇది నార్త్ అమెరికాలో తెలుగు సినిమాకు వేగంగా నమోదైన ప్రీ-సేల్స్‌లో ఒకటిగా నిలిచింది.
నాని కెరీర్‌లోనే భారీ ఓపెనింగ్:
‘దసరా’ తర్వాత శ్రీకాంత్ ఓదెల–నాని కాంబినేషన్ కావడంతో ‘ది ప్యారడైజ్’పై మొదటి నుంచే భారీ అంచనాలు ఉన్నాయి. దీనికి తోడు సినిమా ప్రమోషన్స్, పాటలు, టీజర్‌కు వచ్చిన స్పందనతో హైప్ మరింత పెరిగింది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్‌లో కనిపిస్తున్న జోరు చూస్తుంటే.. నాని కెరీర్‌లోనే ఇది అత్యంత భారీ ఓపెనింగ్ సాధించే సినిమాల్లో ఒకటిగా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే అసలు బాక్సాఫీస్ తీర్పు మాత్రం సినిమా విడుదలైన తర్వాతే తేలనుంది.












