క్రైమ్

Crime : క్యాబ్ ఎక్కుతుండగా అమానుషం.. మహిళా టెకీని లాగి ముద్దుపెట్టిన సెక్యూరిటీ

రచన: Kumar4 నిమిషాల పఠనం

ఉద్యోగాలు చేస్తున్న మహిళలు, యువతులకు వేధింపులు ఆగడం లేదు. ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఏదో ఒక రూపంలో వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కొందరు కామాంధులు కావాలనే ప్లాన్ ప్రకారం వారి మీద దాడులు చేయడం, లైంగికంగా వేధించడం వంటివి చేస్తున్నట్టు తెలుస్తోంది.

ఉద్యోగాలు చేస్తున్న మహిళలు, యువతులకు వేధింపులు ఆగడం లేదు. ఎంత జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఏదో ఒక రూపంలో వారికి చేదు అనుభవాలు ఎదురవుతున్నాయి. కొందరు కామాంధులు కావాలనే ప్లాన్ ప్రకారం వారి మీద దాడులు చేయడం, లైంగికంగా వేధించడం వంటివి చేస్తున్నట్టు తెలుస్తోంది. బస్సులో, ఆఫీసులో, జనసముదాయంలోనూ ఏదో రకంగా అతివలు ఇబ్బందులు ఎదుర్కొంటూనే ఉన్నారు. బాడీషేమింగ్ చేయడం,అక్కడ ఇక్కడ టచ్ చేయడం వంటివి చేస్తున్నట్టు ఫిర్యాదులొస్తున్నాయి.

కొందరు యువతులు, ఉద్యోగినులు ఇంటి నుంచి బయటకు వెళ్లాలన్న.. తమ పనులు ముగించుకుని ఇంటికి వెళ్లే క్రమంలోనూ వేధింపులు ఎదుర్కొంటున్నట్టు తెలుస్తోంది.ఒంటగా జర్నీ చేసేందుకు మరికొందరు జంకుతున్నారు.ఎటు నుంచి ఏ ప్రమాదం పొంచి ఉంటుందో అని భయాందోళనకు గురవుతున్నట్టు సోషల్ మీడియా వేదికగా కొందరు తమ ఎదురైన అనుభవాలను పంచుకుంటున్నారు.

ఈ క్రమంలోనే ఓ మహిళా ఉద్యోగినికి చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్‌లో ఉద్యోగానికి వెళ్లేందుకు క్యాబ్ ఎక్కుతున్న మహిళా సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ను ఓ సెక్యూరిటీ గార్డు పక్కకు లాగి ముద్దు పెట్టినట్టు సమాచారం. వైజాగ్‌కు చెందిన 24 ఏళ్ల యువతి గచ్చిబౌలి ఇందిరానగర్‌లోని పీజీ హాస్టల్‌లో ఉంటూ ఐటీ కారిడార్‌లో పనిచేస్తున్నది.ఇవాళ ఉదయం విధులకు వెళ్లేందుకు క్యాబ్ ఎక్కుతున్న యువతిని ఓ వ్యక్తి అకస్మాత్తుగా పక్కకు లాగి ముద్దు పెట్టాడు.

యువతి గట్టిగా కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు.ఒక్కసారిగా భయభ్రాంతులకు గురైన సదరు యువతి.. తనకు ఎదురైన చేదు అనుభవం నుంచి తేరుకుంది. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ పరిశీలించి ఇందిరానగర్‌లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న జార్ఖండ్‌కు చెందిన రాజ్‌కుమార్ (25)ను గుర్తించి అరెస్ట్ చేసినట్టు సమాచారం.ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

#software enjineer#women#kissed#security guard#hyderabad#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి