క్రైమ్

Crime : రూ.10 వేల కోసం మొండికేశాడు.. రూ.24 కోట్ల భారీ నష్టం!

రచన: Kumar4 నిమిషాల పఠనం

కొందరు వ్యాపారులు చేసే చిన్న చిన్న తప్పిదాలు ఏకంగా రూ. కోట్ల నష్టానికి దారి తీసేలా చేస్తుంటాయి. అది వ్యాపారంలో తీసుకునే సలహా విషయంలో కావొచ్చు లేదా తమ కింద పనిచేసే వారితో వ్యవహరించే విధానం వల్లైనా కావొచ్చు.వ్యాపారంలో లాభం రావాలన్నా, నష్టం రావాలన్నా ఓనర్లు కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది.

కొందరు వ్యాపారులు చేసే చిన్న చిన్న తప్పిదాలు ఏకంగా రూ. కోట్ల నష్టానికి దారి తీసేలా చేస్తుంటాయి. అది వ్యాపారంలో తీసుకునే సలహా విషయంలో కావొచ్చు లేదా తమ కింద పనిచేసే వారితో వ్యవహరించే విధానం వల్లైనా కావొచ్చు.వ్యాపారంలో లాభం రావాలన్నా, నష్టం రావాలన్నా ఓనర్లు కొన్ని పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. అందరితో నమ్మకంగా వ్యవహరించాలి. ఉద్యోగుల జీతం విషయంలో ఆలస్యం చేయకూడదు. తమ కింద పనిచేసేవారి పట్ల చిన్న చూపు పనికిరాదు.

వ్యాపార లావాదేవీల విషయంలో గోప్యత చాలా అవసరం. అది లేకుంటే అవతలి వ్యక్తులు మన రహస్యాలు తెలుసుకుని మనకు కాంపిటీషన్‌గా కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చు. తమ కింద పనిచేసే ఉద్యోగులతో యాజమానులు సరిగా లోకపోయినా ఎదుటి వారికి కలిసిరావొచ్చు.. ఈ విషయంలో ఎప్పుడూ నిర్లక్ష్యంగా ఉండరాదని బిజినెస్ ఎక్స్ పర్ట్స్ చెబుతున్నారు.తాజాగా ఓ యాజమాని తన కింద పనిచేసిన ఉద్యోగి పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది.అసలు ఏం జరిగింది? అంత పెద్దమొత్తంలో యాజమాని ఎలా నష్టపోవాల్సి వచ్చిందో తెలసుకునే ప్రయత్నం చేద్దాం..

గుజరాత్‌లోని సూరత్‌లో ఓ టెక్స్‌టైల్ షాపులో అకౌంటెంట్‌గా పనిచేసిన వినోద్ పండి సావ్ల అనే వ్యక్తి.. కేవలం మూడు నెలలకే ఉద్యోగం మానేశాడు.అయితే, అతనికి రూ. 10 వేల జీతం రావాల్సి ఉంది. తనకు రావాల్సిన డబ్బులు ఇవ్వాలని అడిగితే యాజమాని నిర్లక్ష్యంగా వ్యహరించినట్టు తెలిసింది. దీంతో ఓనర్, మాజీ ఉద్యోగి మధ్య వివాదం చెలరేగింది. తనకు రావాల్సిన రూ. 10 వేలు ఇవ్వలేదనే కోపంతో మాజీ యజమాని షాపునకు మాజీ ఉద్యోగి నిప్పు పెట్టినట్లు పోలీసులు గుర్తించారు.

మంటలు వేగంగా వ్యాపించడంతో మొత్తం 14 షాపులు దగ్ధమై రూ. 24 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్టు తెలిసింది. తొలుత దీనిని సాధారణ అగ్నిప్రమాదంగా భావించిన పోలీసులు.. CCTV ఫుటేజ్‌ను పరిశీలించడంతో అసలు విషయం బయటపడింది. అనంతరం వినోద్‌ను అరెస్ట్ చేశారు. రూ.10 వేల వివాదం కాస్త యాజమానికే కాకుండా, చుట్టుపక్కల వారికి కూడా తీవ్ర నష్టాన్ని మిగిల్చాయి. దీంతో షాపుల యాజమానులు తమకు న్యాయం చేయాలని పోలీసులను వేడుకుంటున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు రిమాండ్‌కు తరలించినట్టు సమాచారం. కాగా, షాపులకు నిప్పు పెడుతున్న వీడియో విజువల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

#gujrath#salary dispute#fired#shops#crime#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి