తెలంగాణ

NIMS : నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్‌కు 14 రోజుల రిమాండ్

రచన: Kumar4 నిమిషాల పఠనం

ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు రావడంతో నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్‌ ఇళ్లు, కార్యాలయం, బంధువులు, బినామీల ఇండ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే.

ఆదాయానికి మించి అక్రమాస్తులు కలిగి ఉన్నారని ఆరోపణలు రావడంతో నిమ్స్ డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ లక్ష్మీభాస్కర్‌ ఇళ్లు, కార్యాలయం, బంధువులు, బినామీల ఇండ్లపై ఏకకాలంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ సోదాల్లో ఆయనకు భారీగా అక్రమాస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. అనంతరం లక్ష్మీ భాస్కర్‌ను అరెస్టు చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో హాజరుపరిచారు.

ఏసీబీ సమర్పించిన ఆధారాలు పరిశీలించిన నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించారు. కోర్టు ఆదేశాల అనంతరం భద్రతా సిబ్బంది ఆయనను నగరంలోని చంచల్‌గూడ కేంద్ర కారాగారానికి తరలించారు. నిమ్స్ ఉన్నతాధికారి హోదాను అడ్డం పెట్టుకుని భారీగా అక్రమ వసూళ్లకు పాల్పడినట్టు తెలిసింది.ఈ మేరకు పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, డాక్టర్ లక్ష్మీ భాస్కర్‌తో పాటు ఆయన బంధువులు, బినామీల నివాసాల్లోనూ సోదాలు జరిపి విలువైన పత్రాలు, బ్యాంక్ బ్యాలెన్స్ గుర్తించారు.

ఏసీబీ అధికారుల సోదాల్లో భాగంగా లక్ష్మీ భాస్కర్ బంధువులు, బినామీలకు చెందిన దాదాపు 8 కీలక ప్రాంతాల్లో పెద్దఎత్తున కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం దొరికిన ఆస్తి పత్రాలు రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం రూ.6.15 కోట్లు ఉండగా.. బహిరంగ మార్కెట్‌లో సుమారు రూ.80 కోట్లకు పైగా స్థిర, చరాస్తులను గుర్తించారు. నిమ్స్‌ హాస్పిటల్‌లో పరికరాల కొనుగోళ్లు, పరిపాలనాపరమైన నిర్ణయాల్లో భారీగా అక్రమాలకు పాల్పడిన లక్ష్మీభాస్కర్..

ఈ మేరకు భారీగా అక్రమ ఆస్తులను కూడబెట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. బినామీల పేర్లతో ఉన్న మరిన్ని బ్యాంకు ఖాతాలు, లాకర్లను తెరిచి పరిశీలించేందుకు ఏసీబీ అధికారులు సిద్ధం అయ్యారు.కాగా, అవినీతి అధికారి నుంచి మరిన్ని వివరాలు రాబట్టేందుకు కోర్టు అనుమతి ద్వారా నిందితుడిని పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

#nims deputy superintendent#ACB#illegal assests#hyderabad#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి