తెలంగాణ

TG : కొత్త పింఛన్ పరేషాన్.. కుమ్మక్కైన అధికారులు, లీడర్లు!

రచన: Kumar5 నిమిషాల పఠనం

రాష్ట్రంలో కొత్త పింఛన్ దరఖాస్తుదారులకు ‘దసరా’లోపు ఇస్తామని నిన్న మంత్రి సీతక్క శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే.అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం అర్హులు ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. కొందరు అధికారులు, లీడర్ల కుమ్మక్కై నిజమైన లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది.

రాష్ట్రంలో కొత్త పింఛన్ దరఖాస్తుదారులకు ‘దసరా’లోపు ఇస్తామని నిన్న మంత్రి సీతక్క శుభవార్త చెప్పిన విషయం తెలిసిందే.అయితే, క్షేత్రస్థాయిలో మాత్రం అర్హులు ఇబ్బందులు పడుతున్నట్టు సమాచారం. కొందరు అధికారులు, లీడర్ల కుమ్మక్కై నిజమైన లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ కొనసాగుతోంది. అత్యంత పారదర్శకంగా వెరిఫికేషన్ చేయాలని ఉన్నతాధికారులను ప్రభుత్వం ఆదేశించిన విషయం తెలిసిందే.

దీంతో వెరిఫికేషన్ కోసం అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నారు. దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.కేవలం దరఖాస్తుదారులనే కాకుండా ఇరుగుపొరుగు వారిని సైతం అడిగి వివరాలు సేకరిస్తున్నారు. దరఖాస్తులు ఇచ్చిన సమాచారం తప్పా? ఒప్పా? అని అడిగి మరీ ఎంట్రీ చేస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, వెరిఫికేషన్ సమయంలో అధికారులు అడిగే ప్రశ్నలు విని కొత్త పింఛన్ దరఖాస్తుదారులు షాక్ అవుతున్నట్టు సమాచారం.

ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అందిన సంక్షేమ పథకాల గురించి ఆరా తీస్తున్నట్టు తెలిసింది.ఇతర పథకాలు అమలవుతుంటే, ఇందిరమ్మ ఇళ్లు వస్తే పింఛన్ రాదని అధికారులు భయపెడుతున్నట్టు సమాచారం. ఇంట్లో కారు ఉందా? మీ పిల్లలు జాబ్ చేస్తున్నారా? ఆస్తులు ఏమైనా ఉన్నాయా? అని కూడా ఆరా తీస్తున్నట్టు సమాచారం.వీటిలో ఏ ఒక్కటి ఉన్నా మీకు పింఛన్ రాదని దరఖాస్తుదారులకు అధికారులు చెప్పినట్టు తెలుస్తోంది.తమ కుమారులు ప్రయివేట్ జాబ్ చేస్తే తమకు పింఛన్ ఎందుకు రాదని, వారు తమకు డబ్బులు ఇవ్వడం లేదని, పట్టించుకోరని వృద్ధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఒంటరి మహిళలను సైతం ఇలాగే భయాందోళనకు గురిచేస్తున్నట్టు సమాచారం.

ఇక వెరిఫికేషన్‌కు వెళ్లే అధికారులు నేరుగా దరఖాస్తుదారుల ఇళ్లకు వెళ్లకుండా ముందుగా లోకల్ లీడర్లను కలుస్తున్నట్టు తెలుస్తోంది. వారు సూచించిన ఇళ్లకే వెళ్లి అధికారులు వెరిఫికేషన్ చేస్తున్నట్టు సమాచారం. లోకల్ లీడర్లు ఓకే అంటే.. ఎలాంటి ప్రశ్నలు వేయకుండా అర్హులను ఫైనల్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఫించన్ రాదని చెబితే భయాందోళనకు గురైన వారి బలహీనతను ఆసరాగా చేసుకొని కొందరు అధికారులు డబ్బులు డిమాండ్ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.

కొన్నిచోట్ల ముందుగానే లీడర్లు డబ్బులు తీసుకొని దగ్గరుండి వెరిఫికేషన్ పూర్తి చేయిస్తున్నట్టు ఆరోపణలొస్తున్నాయి. ఉమ్మడి వరంగల్‌లోని ఓ మున్సిపాలిటీలో ఒక్కొక్కరి దగ్గర రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు వసూలు చేసినట్టు ఆరోపణలు ఉన్నాయి. అర్హుల నిర్దారణకు వైట్ రేషన్ కార్డు ఉంటే చాలని ప్రభుత్వం చెబితే..అధికారులు మాత్రం ఇన్‌కమ్ సర్టిఫికేట్ కావాలని కండిషన్ పెడుతున్నట్టు సమాచారం.

#new pension#rules#officers#leaders#money demand#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి