సినిమా

Kayadu Lohar: తెలంగాణ యాస..కయాదు ఇలా అనేసిందేంటి?

రచన: Anshu5 నిమిషాల పఠనం

Kayadu Lohar: తెలుగు సినిమాల్లోకి అడుగుపెట్టిన తర్వాత హీరోయిన్లు తమ పాత్రలకు తగ్గట్టుగా భాష, యాస నేర్చుకోవడం కొత్తేమీ కాదు. ముఖ్యంగా తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కే సినిమాల్లో అక్కడి నేటివిటీని పర్ఫెక్ట్‌గా చూపించేందుకు నటీనటులు ప్రత్యేకంగా యాసపై శిక్షణ తీసుకుంటుంటారు. తాజాగా హీరోయిన్ కయాదు లోహర్ కూడా తెలంగాణ యాసలో మాట్లాడేందుకు తాను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ఆసక్తికరంగా చెప్పుకొచ్చింది. ఆ ఇబ్బంది తాజా చిత్రం ది ప్యారడైజ్ కోసం డబ్బింగ్ చెప్పలేక అని తెలిపింది.

తెలంగాణ యాస తనకు మొదట్లో అంత సులభంగా అనిపించలేదని కయాదు లోహర్ తెలిపింది. సాధారణ తెలుగు మాట్లాడటంతో పోలిస్తే తెలంగాణ స్లాంగ్‌లో పదాలను పలికే విధానం, ఉచ్చారణ, మాట తీరు కొంత భిన్నంగా ఉండటంతో ప్రారంభంలో ఇబ్బంది పడ్డానని చెప్పింది. అయితే పాత్రకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో యాసను అర్థం చేసుకుని, పలుమార్లు ప్రాక్టీస్ చేసినట్లు పేర్కొంది. అయినా, కూడా పాత్రకి తగ్గట్టు చెప్పలేకపోయింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, హీరో నానీ ఈ విషయంలో చాలా ఎంకరేజ్ చేసినప్పటికీ తెలంగాణా యాసలో డబ్బింగ్ చెప్పలేకపోయాను అని తెలిపింది. ఈ విషయాన్ని తాజాగా ముంబైలో జరిగిన ప్యారడైజ్ ప్రమోషనల్ ఈవెంట్ లో చెప్పుకొచ్చింది.

ఇక, నాని నటించిన ఈ సినిమాలో కయాదు సుబ్బలక్ష్మి(సుబ్బు) అనే పాత్రలో నటించింది. ఈ పాత్రలో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉంటాయని కూడా ఇటీవల వచ్చిన పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. హీరోయిన్ అయ్యాక ఇప్పటి వరకూ ఇలాంటి ఛాలెంజింగ్ రోల్ చేయలేదని ఆమె తెలిపింది. వరుసగా అటు తమిళం, ఇటు తెలుగులో హీరోయిన్‌గా అవకాశాలు అందుకుంటున్నప్పటికీ సాలీడ్ సక్సెస్ మాత్రం దక్కడం లేదు. ఇప్పుడు, రాబోతున్న ప్యారడైజ్ మూవీ పాన్ ఇండియా రేంజ్‌లో సక్సెస్ అవుతుందనే నమ్మకంతో ఉంది కయాదు

ప్రస్తుతం తెలుగు సినిమాల్లోనే కాకుండా వరుసఅగా తమిళంలో కూడా అవకాశాలను అందుకుంటూ ముందుకు సాగుతున్న కయాదు లోహర్.. విభిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో కూడా ఓ భారీ చిత్రంలో నటిస్తోంది. చూడాలి, మరి, ప్యారడైజ్ తర్వాత ఈ బ్యూటీ కెరీర్ ఏ రేంజ్‌కి వెళుతుందో. కాగా, సెప్టెంబర్ 24న 7 భాషల్లో ప్యారడైజ్ రిలీజ్ కాబోతున్న సంగతి తెలిసిందే.

#Kayadu Lohar#Nani#The Paradise#Srikanth Odela
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి